Pathaan OTT: పఠాన్ ఓటీటీ రిలీజ్‌పై షాకింగ్ న్యూస్.. అప్పటి వరకూ ఆగాల్సిందే!
దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగానే ఇండియన్ సినిమాలో తనకంటూ ప్రత్యేకమైన ముద్రను వేసుకుని దూసుకుపోతోన్నాడు బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్. అప్పట్లో లవ్ స్టోరీ మూవీలకే ప్రాధాన్యం ఇచ్చిన ఈ బాద్‌షా.. క్రమంగా పంథాను మార్చుకుని ప్రయోగాలు చేస్తూ వస్తున్నాడు. అలా సుదీర్ఘ కాలంగా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ వచ్చాడు. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం విజయాలను అందుకోవడంలో విఫలం అవుతోన్న షారూఖ్.. చాలా కాలం పాటు గ్యాప్ తీసుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే ఈ సీనియర్ హీరో 'పఠాన్' అనే యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
యాక్షన్ చిత్రాల దర్శకుడిగా పేరొందిన సిద్ధార్థ్ ఆనంద్ రూపకల్పనలో షారూఖ్ ఖాన్ నటించిన చిత్రమే 'పఠాన్'. ఈ సినిమా రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి ఆరంభంలోనే ప్రపంచ వ్యాప్తంగా మంచి టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కింది. దీంతో షారూఖ్ నటించిన ఈ మూవీ ఐదారు వారాల నుంచి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిసింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను వారం లోపులోనే చేరుకోవడంతో పాటు 1030 కోట్ల గ్రాస్‌ను కూడా వసూలు చేసింది. అలాగే, తాజాగా 'బాహుబలి 2' హిందీ కలెక్షన్లను బీట్ చేసింది.

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'పఠాన్' మూవీని అనుకున్న సమయానికి కంటే ముందుగానే డిజిటల్ స్ట్రీమింగ్ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, అలా మాత్రం జరగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమాను మార్చి నెలలోనే స్ట్రీమింగ్ చేస్తారని టాక్ వినిపించింది. అయితే, ఇప్పుడు ఈ హక్కులను సొంతం చేసుకున్న అమెజాన్ సంస్థతో చిత్ర యూనిట్ సంప్రదింపులు జరిపిందని తెలిసింది. దీంతో ఈ సినిమా స్ట్రీమింగ్‌ను ఏప్రిల్‌కు వాయిదా వేశారని అంటున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రాబోతుందని సమాచారం. ఇది షారూఖ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూసే అని చెప్పొచ్చు.
షారూఖ్ ఖాన్ నటించిన తాజా సినిమానే 'పఠాన్'. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదేకొణె హీరోయిన్‌గా చేసింది. ఇందులో జాన్ అబ్రహం విలన్‌గా నటించాడు. అలాగే, మరో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేశాడు. విశాల్ శేఖర్ దీనికి మ్యూజిక్ అందించారు. ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు.


Click it and Unblock the Notifications











