Pathaan OTT: ఆ ఓటీటీలో పఠాన్.. ఆ సీన్స్ కూడా యాడ్ చేసి.. ఇండియాలోనే తొలి సినిమాగా రికార్డు
సుదీర్ఘ కాలంగా ఇండియన్ సినిమాలో ప్రత్యేకతను చాటుకుంటూ దూసుకుపోతోన్నాడు బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్. అలా సుదీర్ఘ కాలంగా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ వచ్చాడు. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం విజయాలను అందుకోవడంలో విఫలం అవుతోన్న షారూఖ్.. చాలా కాలం పాటు గ్యాప్ తీసుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే ఈ సీనియర్ హీరో 'పఠాన్' అనే యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే...

పఠాన్‌గా షారూఖ్ అరాచకం
బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ నటించిన తాజా సినిమానే 'పఠాన్'. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదేకొణె హీరోయిన్‌గా చేసింది. ఇందులో జాన్ అబ్రహం విలన్‌గా నటించాడు. ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. మరో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్ర చేశాడు. దీనికి విశాల్ శేఖర్ సంగీతాన్ని అందించాడు.

గ్రాండ్ రిలీజ్... రెస్పాన్స్‌తో
షారూఖ్ ఖాన్, దీపికా పదుకొణె, జాన్ అబ్రహం కలిసి నటించిన 'పఠాన్' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 8000లకు పైగా థియేటర్లలో రిలీజ్ చేశారు. అన్ని చోట్లా ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. దీంతో మొదటి నుంచే షారూఖ్ ఖాన్ సినిమా భారీ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది.

కలెక్షన్ల సునామీ.. రికార్డులు
షారూఖ్ ఖాన్ - సిద్దార్థ్ ఆనంద్ కాంబోలో రూపొందిన 'పఠాన్' మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. దీన్ని పాన్ ఇండియా రేంజ్‌లో చాలా భాషల్లో విడుదల చేశారు. అందుకు అనుగుణంగానే దీనికి అన్ని ఏరియాల్లోనూ మంచి కలెక్షన్లు వచ్చాయి. ఇలా ఇప్పటి వరకూ ఇది రూ. 1050 కోట్ల వరకూ గ్రాస్, రూ. 542 కోట్లు నెట్ కలెక్షన్లు రాబట్టి రికార్డులు క్రియేట్ చేసింది.

ఓటీటీ స్ట్రీమింగ్ ఆలస్యంగా
క్రేజీ కాంబినేషన్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'పఠాన్' మూవీని అనుకున్న సమయానికి కంటే ముందుగానే డిజిటల్ స్ట్రీమింగ్ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, అలా మాత్రం జరగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమాను ఫిబ్రవరి నెలలోనే స్ట్రీమింగ్ చేస్తారని టాక్ వినిపించింది. కానీ, చిత్ర యూనిట్ దీన్ని మరింత ఆలస్యం చేస్తూ వచ్చింది.

అమెజాన్‌లో పఠాన్ మూవీ
బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ నటించిన యాక్షన్ మూవీ 'పఠాన్' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం భారీ స్థాయిలో పోటీ ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ చిత్రం హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ కొనుగోలు చేసింది. ఇందుకోసం సదరు సంస్థ చిత్ర నిర్మాతలకు భారీ మొత్తాన్నే ముట్టజెప్పిందని అన్నారు. ఇది షారూఖ్ కెరీర్‌లోనే బెస్ట్ డీల్ అని బీ టౌన్ సమాచారం.

పఠాన్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
స్పై యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'పఠాన్' మూవీ స్ట్రీమింగ్‌పై తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ అధికారిక ప్రకటన చేసింది. ఇందులో ఈ చిత్రాన్ని ఉగాది పండుగను పురస్కరించుకుని మార్చి 22 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. అంతేకాదు, ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనే అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు తెలిపింది.

తొలిసారి అలాంటి వెర్షన్
షారూఖ్ ఖాన్ - దీపికా పదుకొణె కాంబినేషన్‌లో తెరకెక్కిన 'పఠాన్' మూవీ ఒరిజినల్ అండ్ లెంగ్తీ వెర్షన్ (ఎడిటింగ్ లేకుండా)ను అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఇటీవలే వెల్లడించాడు. అంటే.. ఈ సినిమా నిడివి మూడు గంటల పైనే ఉండబోతుంది. ఇలా స్ట్రీమింగ్ అవుతున్న తొలి చిత్రంగా ఇది రికార్డును సాధించింది.


Click it and Unblock the Notifications











