OTTలోకి డైరెక్టుగా షారుక్ ఖాన్ క్రైమ్ థ్రిల్లర్.. ఎందులో చూడాలంటే?
ఓటీటీలోకి మరో ఇన్వెస్టిగేటివ్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా రాబోతుంది. అది కూడా బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ సినిమా. అయితే ఆయన హీరోగా నటించిన సినిమా అనుకుంటే పొరపాటే. బాలీవుడ్ ముద్దుగుమ్మ భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం భక్షక్. ఈ సినిమాను బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ సతీమణి గౌరీ ఖాన్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమా ఓటీటీలోకి డైరెక్టుగా రాబోతుంది. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
బాలీవుడ్ హాట్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ భక్షక్. ఇన్వెస్టిగేటివ్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఈ సినిమాను పులకిత్ రూపొందించారు. ఇక ఈ సినిమాను బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ సతీమణి గౌరీ ఖాన్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్ మెంట్ పతాకంపై భక్షక్ సినిమాను గౌరీ ఖాన్, గౌరవ్ వర్మ సంయుక్తంగా నిర్మించారు.

షారుక్ ఖాన్ సినిమా కావడంతో... హిందీ చిత్ర పరిశ్రమలో మంచి బజ్ క్రియేట్ అయింది. భక్షక్ చిత్రంలో భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్ర పోషించగా.... ఆదిత్య శ్రీవాస్తవ, సాయి తమ్‌హంకర్, రాజ్‌పాల్ యాదవ్, సూర్య శర్మ, సంజయ్ మిశ్రా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. వీరిలో ఆదిత్య శ్రీవాస్తవ గురించి తెలుగు వారికి కూడా పరిచయమే. ప్రముఖ హిందీ టీవీ షో సీఐడీలో కీలక పాత్ర పోషించారనే విషయం తెలిసిందే. సీఐడీ సీరియల్ లో అభిజీత్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్ర చాలా మందికి ఫెవరెట్.
ఇప్పుడు ఆ సీఐడీ అభిజీత్ పాత్రను ఆదిత్య శ్రీవాస్తవ భక్షక్ మూవీలో విలన్ పాత్ర పోషిస్తున్నారు. తాజాగా భక్షక్ మూవీ ట్రైలర్ విడుదల కాగా... ఈ ట్రైలర్ ను కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ ఇన్ స్టా గ్రామ్ వేదికగా పంచుకున్నారు. "ఇది అందరికీ చెప్పాల్సిన కథ. భక్షక్ నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు" అంటూ... షారుక్ ఖాన్ ట్రైలర్ వీడియో షేర్ చేశారు. దీంతో ఈ సినిమాపై మంచి బజ్ నెలకొంది.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే.... ఇన్వెస్టిగేటివ్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. భక్షక్ మూవీ థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ కానుంది. భక్షక్ గ్రిప్పింగ్ సీన్స్, ఆకట్టుకునే టేకింగ్ అండ్ స్క్రీన్ ప్లేతో అలరించనుందని ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. ఇతరులు కష్టాల్లో ఉంటే బాధపడని వాళ్లు మనుషులు ఎలా అవుతారు.. భక్షక్‌లు అవుతారనే డైలాగ్ ఆకట్టుకుంటుంది
ఇక భక్షక్ సినిమా డైరెక్టుగా ఓటీటీలో రిలీజ్ కానుండగా... ఇక ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసిందని తెలుస్తోంది. భక్షక్ సినిమా ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. నెట్ ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా పలు భాషల్లో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. మీరు మంచి ఇన్వెస్టిగేటివ్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూడాలనుకుంటే ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











