Pathaan OTT: షారుక్ 'పఠాన్' ఓటీటీ హక్కులకు భారీ ధర, ఏకంగా అన్ని కోట్లకు డీల్.. రిలీజ్ ఎప్పుడంటే?

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. సుధీర్ఘకాలంగా సినిమాలు చేస్తూ ఎంటర్టైన్ చేస్తున్నాడు. 2018లో జీరో సినిమాతో ఫ్లాప్ మూటగట్టున్న షారుక్ ఖాన్ ఇటీవల రాకెట్రీ, బ్రహ్మాస్త్రం వంటి సినిమాల్లో గెస్ట్ రోల్ చేసి ఆకట్టుకున్నాడు.

షారుక్ ఖాన్ ఫుల్ లెంగ్త్ సినిమా కోసం అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పఠాన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు షారుక్ ఖాన్. యాక్షన్ చిత్రాలకు పేరొందని బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలోనే పఠాన్ డిజిటల్ రైట్స్ ఆసక్తికరంగా మారాయి.

యాక్షన్ చిత్రాల దర్శకుడితో..

యాక్షన్ చిత్రాల దర్శకుడితో..

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, హాట్ బ్యూటి దీపిక పదుకొణె ఇప్పటికీ ఓం శాంతి ఓం, చెన్నై ఎక్స్ ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్ చిత్రాల్లో జంటగా కలిసి నటించారు. ఇప్పుడు మరోసారి వీళ్లిద్దరు కలిసి జోడి కట్టిన చిత్రం పఠాన్. చాలా కాలం గ్యాప్ అంటే దాదాపుగా మూడేళ్ల తర్వాత షారుక్ ఖాన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు.

అందుకు తగినట్లుగానే పఠాన్ షూటింగ్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. హృతిక్ రోషన్ తో బ్యాంగ్ బ్యాంగ్, వార్ సినిమాలు చిత్రీకరించిన యాక్షన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు.

భారతీయ గూఢచారి నేపథ్యంలో..

భారతీయ గూఢచారి నేపథ్యంలో..

అభిమానుల అంచనాలకు తగినట్టుగానే వరల్డ్ వైడ్ గా జనవరి 25న గ్రాండ్ గా విడుదలైంది పఠాన్ సినిమా. యశ్ రాజ్ ఫిలీంస్ బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రంలో మరో బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం విలనిజం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అలాగే కండల వీరుడు సల్మాన్ ఖాన్ గెస్ట్ అప్పిరియన్స్ కు విజిల్స్ కొడుతున్నారు.

హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తున్న ఈ చిత్రంతో షారుక్ సాలిడ్ కమ్ బ్యాక్ కొట్టాడని అంటున్నారు. ఇండియన్ స్పై నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాపై తొలి రోజు నుంచి మంచి టాక్ వచ్చింది. భారీ యాక్షన్ సీన్స్ కు దీపికా పదుకొణె గ్లామర్ తోడు కావడంతో భారీ వసూళ్లు కొల్లగొడుతోంది.

ప్రముఖ ఓటీటీకి సొంతం..

ప్రముఖ ఓటీటీకి సొంతం..

ఇదిలా ఉంటే ఇప్పుడు పఠాన్ డిజిటల్ రైట్స్ కు సంబంధించిన విషయం ఆసక్తిగా మారింది. ఈ సినిమా కోసం ఎన్నో ఓటీటీ సంస్థలు పోటి పడగా.. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో పొందినట్లు సమాచారం. ఏకంగా రూ. 100 కోట్లతో పఠాన్ సినిమా డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుందని సమాచారం.

అయితే ఓటీటీలో సినిమా విడుదలపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఈ చిత్రాన్ని విడుదలైన 3 నెలల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. అంటే ఏప్రిల్ 25న పఠాన్ సినిమాను డిజిటల్ తెరపై చూడొచ్చు. ఈ విషయంపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

తొలి రోజే వసూళ్ల రికార్డు..

తొలి రోజే వసూళ్ల రికార్డు..

షారుక్ ఖాన్-సల్మాన్ ఖాన్ స్క్రీన్ షేర్ చేసుకున్న పఠాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 8000కు పైగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది. అంటే ఇండియాలో 5500 థియేటర్లు కాగా.. ఓవర్సీస్ లో మరో 2500 స్క్రీన్ లలో పఠాన్ సినిమా రిలీజ్ అయింది.

ఇక ఈ యాక్షన్ సినిమాకు దాదాపుగా రూ. 250 నుంచి రూ. 260 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. ఈ సినిమా తొలిరోజే ఏకంగా రూ. 106 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. యష్ నటించిన కేజీఎఫ్-2 తొలి రోజు వసూళ్లైన రూ. 53కోట్లను బ్రేక్ చేసి రికార్డ్ నెలకొల్పింది షారుక్ ఖాన్-దీపిక పదుకొణెల గ్లామరస్ యాక్షన్ మూవీ పఠాన్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X