OTTలో రచ్చ లేపుతున్న లేడీ కామెడీ డ్రామా.. ప్రతీ ఒక్కరూ కచ్చితంగా చూడాల్సిన 3 చిత్రాలివే!

వేసవి కాలం ప్రారంభం అయినప్పటి నుంచి ఓటీటీలో సినిమాల హవా మరీ ఎక్కువ అయిపోయింది. ముఖ్యంగా ఎండలు ఎక్కువ అవడం.. ఇంట్లోనే కూర్చుని బోర్ కొడుతుండడంతో అంతా కొత్త కొత్త చిత్రాలు, వెబ్ సిరీస్ లు చూసేందుకు తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ విషయం అర్థం చేసుకున్న ఓటీటీ సంస్థలు కూడా అదిరిపోయే చిత్రాలు తెస్తుండగా.. అందులో కొన్ని మాత్రమే టాప్ లో నిలుస్తున్నాయి. ఓటీటీలో ఎన్నో చిత్రాలు ఉన్నా.. టాప్ లో ఉన్నవి ఏవో తెలియక చాలా మంది తెగ కష్టపడిపోతున్నారు. అలాంటి వారి కోసమే అన్నట్లు ఆర్మాక్స్ మీడియా సంస్థ ఓ సర్వే చేసింది.

ముఖ్యంగా మే 10వ తేదీ నుంచి మే 16వ తేదీ వరకు ఓటీటీలో ట్రెండింగ్ లో నిలిచిన టాప్ 3 సినిమాల లిస్టును విడుదల చేసింది. ముఖ్యంగా ఆర్మాక్స్ మీడియా సంస్థ విడుదల చేసిన ఈ లిస్టులో టాప్ 1లో జ్యోతిక బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమా షైతాన్ నిలిచింది. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ హీరోగా.. సూర్య భార్య జ్యోతిక హీరోయిన్ గా వచ్చిన తాజా సినిమానే షైతాన్. అద్భుతమైన మిస్టరీ హార్రర్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా జ్యోతిక ఈ సినిమాతోనే బాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వగా.. మార్చి 8వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దేవగన్ ఫిల్మ్స్ , జియో స్టూడియోస్ మరియు పనోరమా స్టూడియోస్ నిర్మించాయి.

Shaitaan And Other Two Movies Trending in May 3rd Week in OTT Check Details

షైతాన్ సినిమాలో మాధవన్, జాంకీ బోడివాలా, అంగద్ రాజ్, పాలక్ లాల్వాణీ, మనోజ్ ఆనంద్, రిచా ప్రకాష్, హితేన్ పటేల్, రోష్ని కౌర్ వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. అమిత్ త్రివేది సంగీతం అందించగా.. సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా బాధ్యతలు నిర్వహించారు. అలాగే దీప్ ఫ్రాన్సిసి ఎడిటర్ గా పని చేశారు. 65 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాకు రూ.167.32 కోట్లు కలెక్షన్లు వచ్చాయి. ఇక టాప్ 2లో లాపతా లేడీస్ మూవీ నిలిచింది. కామెడీ డ్రామాగా వచ్చిన ఈ క్రేజీ మూవీని కిరణ్ రావు డైరెక్ట్ చేశారు. అమీర్ ఖాన్, జ్యోతి దేశ్ పాండే లు ఈ చిత్రాన్ని నిర్మించారు.

Shaitaan And Other Two Movies Trending in May 3rd Week in OTT Check Details

ముఖ్యంగా ఈ సినిమాలో నితాన్షి గోయెల్, ప్రతిభా రంతా, స్పర్ష్ శ్రీవాస్తవ్, ఛాయా కదమ్, రవి కిషన్ లు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. సెప్టెంబర్ 8వ తేదీ విడుదల అయిన ఈ సినిమాలో 5 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా.. దాదాపు రూ.23 కోట్లు వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇలా సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాలో రైలు ప్రయాణంలో ఇద్దరు భర్తలు తమ భార్యలను మార్చుకునే కథను చూపిస్తారు. ఆద్యంతం ఆకట్టుకునే ఈ సినిమాను చూసి కడుపుబ్బా నవ్వుకోవచ్చు. ఇక టాప్3లో యోధా అనే సినిమా నిలిచింది.

Shaitaan And Other Two Movies Trending in May 3rd Week in OTT Check Details

ఈ క్రేజీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని సాగర్ అంబ్రే మరియు పుష్కర్ ఓజా దర్శకత్వం వహించారు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హిరూ యష్ జోహార్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మించారు. ఈ సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటించగా.. రాశి ఖన్నా, దిశా పటానీలు హీరోయిన్లుగా కనిపించారు. మార్చి 15వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించకలేకపోయింది. కానీ ఓటీటీలో మాత్రం సెన్సషన్ క్రియేట్ చేస్తోంది. ఏప్రిల్ 19వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా విడుదల అయిన ఈ సినిమాను ఓటీటీలో చాలా మందే చూస్తున్నారు. మీరు కూడా ఓసారి ఈ మూడు క్రేజీ చిత్రాలను చూసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X