OTTలో రచ్చ చేస్తున్న బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హార్రర్ మూవీ.. వన్‌లో షైతాన్, ఆ తర్వాతి స్థానాల్లో ఏమున్నాయంటే?

సమ్మర్ స్టార్ అయినప్పటి నుంచి ఓటీటీల హవా చాలా ఎక్కువైపోయింది. ముఖ్యంగా విపరీతమైన ఎండలు కాస్తుండడంతో బయటకు వెళ్లడానికి ఏమాత్రం అవకాశం లేక ప్రజలంతా ఇంట్లోనే కూర్చుని సినిమాలు చూసేస్తున్నారు. ప్రతీ వారం సరికొత్త చిత్రాలు వస్తుండగా.. అన్నింటనీ వదలకుండా చూసేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈక్రమంలోనే ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ వీటిలో ట్రెండ్ అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ లపై సర్వేలు చేస్తోంది. ముఖ్యంగా ఈ వారం ఓటీటీలో ట్రెండింగ్ లో నిలిచిన టాప్ 3 సినిమాల లిస్టును విడుదల చేసింది.

మే 3వ తేదీ నుంచి మే 9వ తేదీ వరకు ఓటీటీలో ట్రెండింగ్ లో నిలిచిన టాప్ 3 సినిమాల లిస్టును విడుదల చేసింది. ముఖ్యంగా ఆర్మాక్స్ మీడియా సంస్థ విడుదల చేసిన ఈ లిస్టులో టాప్ 1లో జ్యోతిక బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమా షైతాన్ నిలిచంది. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ హీరోగా.. సూర్య భార్య జ్యోతిక హీరోయిన్ గా వచ్చిన తాజా సినిమానే షైతాన్. అద్భుతమైన మిస్టరీ హార్రర్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా జ్యోతిక ఈ సినిమాతోనే బాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వగా.. మార్చి 8వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దేవగన్ ఫిల్మ్స్ , జియో స్టూడియోస్ మరియు పనోరమా స్టూడియోస్ నిర్మించాయి.

Shaitaan And Other Two Movies Trending in May Second Week in OTT Check Details

అజయ్ దేవగన్, జ్యోతికలు హీరోహీరోయిన్లుగా చేసిన ఈ సినిమాలో మాధవన్, జాంకీ బోడివాలా, అంగద్ రాజ్, పాలక్ లాల్వాణీ, మనోజ్ ఆనంద్, రిచా ప్రకాష్, హితేన్ పటేల్, రోష్ని కౌర్ వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. అమిత్ త్రివేది సంగీతం అందించగా.. సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా బాధ్యతలు నిర్వహించారు. అలాగే దీప్ ఫ్రాన్సిసి ఎడిటర్ గా పని చేశారు. 65 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాకు రూ.167.32 కోట్లు కలెక్షన్లు వచ్చాయి. అలాగే రెండో స్థానంలో యామీ గౌతమ్ ప్రధాన పాత్రలో వచ్చిన ఆర్టికల్ 370 సినిమా నిలిచింది. జియో స్టూడియోస్, B62 స్టూడియోస్ బ్యాన‌ర్‌ల‌పై ఆదిత్య ధ‌ర్ నిర్మించిన ఈ సినిమాకు ఆదిత్య సుహాస్ జంభ దర్శకత్వం వహించారు.

ఈ సినిమాలో యామీ గౌత‌మ్ తో పాటు ప్రియమణి, రాజ్ అర్జున్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన‌ ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 23వ తేదీన విడుదల చేశారు. అయితే 2019 ఫిబ్ర‌వ‌రి 14న పుల్వామా దాడి జ‌రిగిన అనంతరం జమ్ముకశ్మీర్‌ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 ర‌ద్దు చేసే అంశాన్ని ప్రధానంగా తీసుకొని.. 20 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రూ.110 కోట్లు రాబట్టుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది. పలు దేశాలు ఈ చిత్రాన్ని బ్యాన్ కూడా చేశాయి. బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఏప్రిల్ 19వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలోకి వచ్చినప్పటి నుంచి ట్రెండింగ్ లోనే నిలుస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

ఇక టాప్ 3లో క్రాక్ సినిమా నిలిచింది. ఆదిత్య దత్ దర్శకత్వంలో స్పోర్ట్స్ యాక్షన్ జోనర్ లో వచ్చిన ఈ సినిమాను యాక్షన్ హీరో ఫిల్మ్స్ కింద విద్యుత్ జమ్‌వాల్ మరియు అబ్బాస్ సయ్యద్‌లు నిర్మించారు. ఇందులో విద్యుత్ జమ్వాల్, అర్జున్ రాంపాల్, నోరా ఫతేహి మరియు అమీ జాక్సన్ లు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. ఈ మూవీ ఇండియాలోనే మొట్టమొదటి ఎక్స్‌ట్రీమ్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్‌గా నిలవగా.. ఫిబ్రవరి 23వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయింది. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుని సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మూవీ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఇలా టాప్ 3లో నిలిచిన ఈ మూడు చిత్రాలను కచ్చితంగా చూసేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X