OTTలో ఇప్పుడీ 3 చిత్రాలదే హవా.. వన్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హార్రర్ థ్రిల్లర్, మిగతా స్థానాల్లో ఏమున్నాయంట
ప్రతీ వారం ఓటీటీలోకి అనేక చిత్రాలు వస్తుంటాయి. కానీ అందులో కొన్ని మాత్రమే టాప్ లో నిలుస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి. ముఖ్యంగా వారానికి కనీసం 30 నుంచి 50 వరకు కొత్త చిత్రాలు వస్తుండగా.. అందులో టాప్ లో ఏవి నిలిచాయనే దానిపై ఆర్మాక్స్ మీడియా సంస్థ సర్వేలు చేస్తూ ఉంటుంది. ఓటీటీలో ఎన్నో చిత్రాలు ఉండగా.. టాప్ లో ఉన్నవి ఏవో, కచ్చితంగా చూడాల్సిన చిత్రాలో ఏవో ఈ సంస్థే చెప్పేస్తుంటుంది. అయితే తాజాగా ఆర్మాక్స్ మీడియా సంస్థ ఆ సర్వే చేసి సరైన ఫిలితాలను వెల్లడించింది. మరి ఈ వారం టాప్ 3లో నిలిచిన క్రేజీ సినిమాలు ఏవో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మే 18వ తేదీ నుంచి మే 23వ తేదీ వరకు ఓటీటీలో ట్రెండింగ్ లో నిలిచిన టాప్ 3 సినిమాల లిస్టును విడుదల చేసింది. ముఖ్యంగా ఆర్మాక్స్ మీడియా సంస్థ విడుదల చేసిన ఈ లిస్టులో టాప్ 1లో షైతాన్ సినిమా నిలిచింది. బాలీవుడ్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ద్వారానే జ్యోతిష హిందీ చిత్రసీమలో అడుగు పెట్టింది. అలాగే అజయ్ దేవగన్ హీరోగా చేశారు. అద్భుతమైన మిస్టరీ హార్రర్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మార్చి 8వ తేదీన థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమాకు వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించారు. అలాగే దేవగన్ ఫిల్మ్స్ , జియో స్టూడియోస్ మరియు పనోరమా స్టూడియోస్ నిర్మించాయి.

జ్యోతిక్, అజయ్ దేవగన్ లు హీరోహీరోయిన్లుగా చేసిన ఈ సినిమాలో మాధవన్, జాంకీ బోడివాలా, అంగద్ రాజ్, పాలక్ లాల్వాణీ, మనోజ్ ఆనంద్, రిచా ప్రకాష్, హితేన్ పటేల్, రోష్ని కౌర్ వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. అమిత్ త్రివేది సంగీతం అందించగా.. సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా బాధ్యతలు నిర్వహించారు. అలాగే దీప్ ఫ్రాన్సిసి ఎడిటర్ గా పని చేశారు. 65 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాకు రూ.167.32 కోట్లు కలెక్షన్లు వచ్చాయి. ఇక టాప్ 2లో లాపతా లేడీస్ మూవీ నిలిచింది. కామెడీ డ్రామాగా వచ్చిన ఈ క్రేజీ మూవీని కిరణ్ రావు డైరెక్ట్ చేశారు. అమీర్ ఖాన్, జ్యోతి దేశ్ పాండే లు ఈ చిత్రాన్ని నిర్మించారు.

లాపతా లేడీస్ సినిమాలో నితాన్షి గోయెల్, ప్రతిభా రంతా, స్పర్ష్ శ్రీవాస్తవ్, ఛాయా కదమ్, రవి కిషన్ లు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. సెప్టెంబర్ 8వ తేదీ విడుదల అయిన ఈ సినిమాలో 5 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా.. దాదాపు రూ.23 కోట్లు వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇలా సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాలో రైలు ప్రయాణంలో ఇద్దరు భర్తలు తమ భార్యలను మార్చుకునే కథను చూపిస్తారు. ఆద్యంతం ఆకట్టుకునే ఈ సినిమాను చూసి కడుపుబ్బా నవ్వుకోవచ్చు.

ఇక టాప్3లో క్రేజీ యాక్షన్ థ్రిల్లర్ యోధా అనే సినిమా నిలిచింది. సాగర్ అంబ్రే మరియు పుష్కర్ ఓజాలు ఈ సినిమాను డైరెక్టర్ చేశారు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హిరూ యష్ జోహార్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మించారు. ఈ సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటించగా.. రాశి ఖన్నా, దిశా పటానీలు హీరోయిన్లుగా కనిపించారు. మార్చి 15వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించకలేకపోయింది. కానీ ఓటీటీలో మాత్రం సెన్సషన్ క్రియేట్ చేస్తోంది. ఏప్రిల్ 19వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా విడుదల అయిన ఈ సినిమాను ఓటీటీలో చాలా మందే చూస్తున్నారు. మీరు కూడా ఓసారి ఈ మూడు క్రేజీ చిత్రాలను చూసేయండి.


Click it and Unblock the Notifications











