Shambhala OTT: భారీ ధరకు శంబాల ఓటీటీ డీల్.. ఆది సాయికుమార్ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఆది సాయికుమార్, అర్చన అయ్యర్ జంటగా నటించిన చిత్రం శంబాల: ఏ మిస్టికల్ వరల్డ్. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. ఈ మూవీలో స్వసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్, శైలజ ప్రియా, ఇంద్రనీల్, ప్రవీణ్, మీసాల లక్ష్మణ్, సిజ్జు మీనన్, హర్షవర్దన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.
శంబాల తారాగణం
శంబాల మూవీకి శ్రీచరణ్ పాకాల సంగీత దర్శకత్వం వ్యవహరించగా, ప్రవీణ్ కే బంగారి సినిమాటోగ్రఫి, శ్రవణ్ కటికనేని ఎడిటర్‌గా, జేకే మూర్తి ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. జేవీ రామారావు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తించారు. టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కార్యక్రమాల ద్వారా మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ కానుకగా వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో శంబాల ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడు? అన్నదానిపై ఆసక్తి నెలకొంది. ఈ వివరాల్లోకి వెళితే..

శంబాల బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి శంబాల మూవీకి 12 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. టీజర్, ట్రైలర్లు, ఇతర ప్రమోషనల్ కార్యక్రమాలతో శంబాల మూవీపై టాలీవుడ్‌లో భారీ హైప్ క్రియేట్ అయ్యింది. దానికి తగినట్లుగానే శంబాల థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగిందని ఫిలింనగర్ టాక్.
శంబాల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
ఈ సినిమా నైజాం ఏరియా థియేట్రికల్ రైట్స్‌ను మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్ దక్కించుకోగా.. ఆంధ్రా, సీడెడ్ థియేట్రికల్ రైట్స్‌ను ఉషా పిక్చర్స్ సంస్థ సొంతం చేసుకుంది. కర్ణాటక థియేట్రికల్ రైట్స్‌ను కుమార్ బెంగళూరు ఫిల్మ్స్, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్‌ను మూన్‌షైన్ సినిమాస్ దక్కించుకుంది. అయితే థియేట్రికల్ బిజినెస్‌కి సంబంధించిన లెక్కలు తెలియాల్సి ఉంది. అయితే శంబాల చిత్రం లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 30 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేయాల్సి ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
శంబాల ఏ ఓటీటీలో?
మరోవైపు.. శంబాల డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ఆహా ఓటీటీ సంస్థ 10 కోట్ల రూపాయల రికార్డ్ ధరకు సొంతం చేసుకున్నట్లుగా ఓటీటీ ప్లే సంస్థ నివేదించింది. తద్వారా ఆది సినిమాలలోనే అత్యధిక ఓటీటీ ధర పలికిన చిత్రంగా శంబాల నిలిచింది. అలాగే ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను జీ నెట్‌వర్క్ సంస్థ 2 కోట్ల రూపాయలకు కైవసం చేసుకుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. థియేటర్‌లలో రిలీజైన 4 వారాలకు ఓటీటీలో స్ట్రీమింగ్ కావాలనే నిబంధన మేరకు శంబాల డిజిటల్ రైట్స్ ఒప్పందం జరిగినట్లుగా తెలుస్తోంది. దాంతో జనవరి మూడవ వారంలో ఆది సాయికుమార్ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. అయితే థియేట్రికల్ రన్‌ను బట్టి ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ ముందుగా జరగొచ్చు.. లేదా ఆలస్యం కావొచ్చు. దీనిపై త్వరలోనే ఆహా సంస్థ క్లారిటీ ఇవ్వనుంది.


Click it and Unblock the Notifications











