మళ్లీ ఒక్కటైన షణ్ముఖ్, దీప్తి సునైనా: ఇద్దరూ ఒకే ఫొటో షేర్ చేసి మరీ రిక్వెస్ట్
సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది అమ్మాయిలు, అబ్బాయిలు ఫుల్ ఫేమస్ అయ్యారు. అందులో ప్రముఖ యూట్యూబర్లు దీప్తి సునైనా.. షణ్ముఖ్ జస్వంత్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆరంభంలో ఎవరికి వారే క్రేజ్‌ను సంపాదించుకున్న ఈ ఇద్దరు.. ఆ తర్వాత జంటగా మారారు. ఇలా చాలా కాలం పాటు ప్రేమాయణం సాగించిన తర్వాత ఈ ఏడాది ఆరంభంలోనే బ్రేకప్ చెప్పుకుని విడిపోయారు. అప్పటి నుంచి ఎవరికి వారే తమ తమ కెరీర్‌లను ముందుకు తీసుకు వెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునైనా ఒక్కటయ్యారు. ఇందులో భాగంగానే సోషల్ మీడియాలో ఒకే పోస్టు చేసి రిక్వెస్ట్ చేస్తున్నారు. అసలేం జరిగిందో మీరే చూడండి!

జంటగా ఫేమస్.. పెళ్లికి రెడీగానే
ప్రొఫెషనల్‌గా పని చేస్తోన్న సమయంలోనే ప్రేమలో పడిన దీప్తీ సునయన.. షణ్ముఖ్ జస్వంత్ చాలా కాలంగా జంటగా సందడి చేస్తున్నారు. దీంతో వీళ్లిద్దరూ వ్యక్తిగతంగా కంటే జోడీగానే ఎక్కువ పాపులార్ అయ్యారు. దీంతో కష్ట సమయాల్లోనూ ఒకరికి ఒకరు అండగా నిలిచారు. ఈ క్రమంలోనే దీప్తి, షన్నూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని చాలా రోజుల పాటు వార్తలు కూడా వచ్చాయి.

ఆ షోతో మొత్తం మారిపోయింది
బిగ్ బాస్ ఐదో సీజన్‌లోకి షణ్ముఖ్ జస్వంత్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అందులో అతడు సిరి హన్మంత్‌తో ఎప్పుడూ కలిసే ఉండడం.. కలిసే ఆడడం.. కలిసే తినడం.. కలిసే పడుకోవడం వంటివి చేశాడు. అంతేకాదు, తరచూ ముద్దులు.. హగ్గులు చేసుకోవడం వంటి వాటితో రెచ్చిపోయాడు. దీంతో అతడు ఓడిపోవడంతో పాటు బ్యాడ్ ఇమేజ్‌ను కూడా తెచ్చుకోవాల్సి వచ్చింది.

షణ్ముఖ్‌కు బ్రేకప్ చెప్పిన దీప్తి
బిగ్ బాస్ షో వల్ల షణ్ముఖ్ జస్వంత్ ఇమేజ్ డ్యామేజ్ అవడంతో దీప్తి సునైనా కూడా అతడిపై విముఖత వ్యక్తం చేసింది. ఫలితంగా సుదీర్ఘ బంధానికి పుల్‌స్టాప్ పెడుతూ కొన్ని నెలల క్రితమే అతడికి బ్రేకప్ చెప్పేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రకటన వదిలింది. ఆ తర్వాత షణ్ముఖ్ కూడా ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్టును చేశాడు.

ఎవరి కెరీర్‌లతో వాళ్లే ఫుల్ బిజీ
షో వల్ల చెడ్డపేరు రావడం.. లవ్ బ్రేకప్ అవడం వల్ల కొంత గ్యాప్ తీసుకున్న షణ్ముఖ్ జస్వంత్ ఇటీవలే తన కొత్త వెబ్ సిరీస్ 'ఏజెంట్ ఆనంద్ సంతోష్'ను ప్రకటించాడు. దీన్ని సుబ్బు కే తెరకెక్కించబోతున్నాడు. ఈ సిరీస్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా నిర్మిస్తోంది. ఇక, దీప్తి సునైనా కూడా తన కెరీర్‌పై ఫోకస్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఎన్నో ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతోంది.

ఆమెతో కలుస్తానని చెప్పేశాడు
ఇటీవలే షణ్ముఖ్ జస్వంత్.. యాంకర్ శివను సపోర్ట్ చేస్తూ బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. అందులో అషు రెడ్డి 'దీప్తి ఎలా ఉంది షణ్నూ' అని ప్రశ్నించింది. దీనికతడు 'ఎవరు అషు రెడ్డేనా అడిగింది. హా.. దీప్తి బాగానే ఉంది. త్వరలోనే తనను కలవబోతున్నా' అని చెప్పాడు. దీంతో అతడి అభిమానులు షణ్నూ - దీప్తి మళ్లీ కలవబోతున్నారని ఫుల్ ఖుషీ అవుతున్నారు.

మళ్లీ ఒక్కటైన షణ్ముఖ్.. దీప్తీ
కొన్ని నెలల క్రితమే విడిపోయిన షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునైనా మళ్లీ కలవాలని వాళ్లిద్దరి అభిమానులు కోరుకుంటున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు కూడా చేసి వాళ్లను అభ్యర్ధిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో షణ్ముఖ్.. దీప్తి మరోసారి కలిశారు. అయితే, వీళ్లిద్దరూ కలిసి వీళ్ల కోసం కాదు.. బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్‌లో ఫినాలేకు చేరిన అఖిల్ సార్థక్ కోసం మాత్రమే.

ఒకే ఫొటో షేర్ చేసి మరీ రిక్వెస్ట్
బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ ఫినాలేకు చేరుకుంది. ఇందులో అఖిల్ సార్థక్ టైటిల్ ఫేవరెట్‌గా ఉన్నాడు. దీంతో అతడికి ఓట్లు వేసి గెలిపించాలని కోరుతూ ఒకవైపు షణ్ముఖ్ జస్వంత్, మరోవైపు దీప్తి సునైనా తమ తమ సోషల్ మీడియా ఖాతాల్లో ప్రచారం చేస్తున్నారు. జంటగా విడిపోయిన వీళ్లిద్దరూ ఇలా అఖిల్ సార్థక్‌ను గెలిపించేందుకు ఒక్కటయ్యారని చెప్పుకోవచ్చు.


Click it and Unblock the Notifications











