Bigg Boss: దీప్తి సునైన గురించి షణ్ముఖ్ గుడ్ న్యూస్.. బ్రేకప్ అయిన చోటే సంచలన ప్రకటన

సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతో మంది యువతీ యువకులు విపరీతంగా పాపులర్ అయ్యారు. అందులో తెలుగు వాళ్లు కూడా చాలా మందే ఉన్నారు. అలా సామాజిక మాధ్యమాల వల్ల ఫేమస్ అయిన వారిలో ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ పేరు ప్రముఖంగా చెప్పుకుంటారు. దీనికి కారణం యాక్టింగ్, డ్యాన్సులు, మరికొన్ని వీడియోలతో చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సంపాదించుకోవడమే.

అదే సమయంలో యూత్‌లో క్రేజ్‌ను అందుకున్నాడు. ఇక, బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రం షణ్ముఖ్ ఇమేజ్ డ్యామేజ్ అయింది. అదే సమయంలో దీప్తి సునైనా కూడా అతడికి బ్రేకప్ చెప్పేసింది. ఈ నేపథ్యంలో తాజాగా మాజీ ప్రియురాలిపై అతడు కామెంట్ చేశాడు. ఆ వివరాలు మీకోసం!

బిగ్ బాస్‌లోకి షణ్ముఖ్ ఎంటర్

బిగ్ బాస్‌లోకి షణ్ముఖ్ ఎంటర్

సోషల్ మీడియాలో షణ్ముఖ్ జస్వంత్ ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. తద్వారా టాప్ యూట్యూబర్‌గా పేరొందాడు. ఈ క్రేజ్ కారణంగానే అతడు బిగ్ బాస్ ఐదో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అందులోకి టైటిల్ ఫేవరెట్‌గా అడుగు పెట్టిన ఈ టాలెంటెడ్ గాయ్.. ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించేలా మంచి గేమ్‌తో సత్తా చాటుకున్నాడు.

ఇమేజ్‌తో పాటు టైటిల్ కూడా

ఇమేజ్‌తో పాటు టైటిల్ కూడా

బిగ్ బాస్ షోలో మంచి ఆటతీరుతో పేరు సంపాదించుకున్న షణ్ముఖ్ జస్వంత్.. సిరి హన్మంత్‌తో రొమాన్స్ వల్ల విమర్శలు ఎదుర్కొన్నాడు. ఎప్పుడూ కలిసే ఉండడం.. కలిసే ఆడడం.. కలిసే తినడం.. కలిసే పడుకోవడం వంటివి చేశాడు. అంతేకాదు, తరచూ ముద్దులు.. హగ్గులు చేసుకోవడం వంటి వాటితో రెచ్చిపోయాడు. దీంతో ఇమేజ్‌తో పాటు టైటిల్‌ను కూడా కోల్పోయాడు.

షణ్ముఖ్‌కు దీప్తి సునైనా బ్రేకప్

షణ్ముఖ్‌కు దీప్తి సునైనా బ్రేకప్

షణ్ముఖ్ జస్వంత్‌తో చాలా కాలంగా ప్రేమాయణం సాగించిన దీప్తి సునైనా కొద్ది రోజుల క్రితమే సోషల్ మీడియా వేదికగా బ్రేకప్ చెప్పేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో 'చాలా ఆలోచనలు, చర్చల తర్వాత షన్నూ, నేనూ పరస్పరంగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఇకపై ఇద్దరం వేరే వేరే దారుల్లో నడవబోతున్నాం' అంటూ ఓ ప్రకటనను వదిలింది.

మళ్లీ మొదలెట్టి.. ఫుల్ బిజీగానే

మళ్లీ మొదలెట్టి.. ఫుల్ బిజీగానే

షో వల్ల చెడ్డపేరు రావడం.. లవ్ బ్రేకప్ అవడం వల్ల కొంత గ్యాప్ తీసుకున్న షణ్ముఖ్ జస్వంత్ ఇటీవలే తన కొత్త వెబ్ సిరీస్ గురించి ప్రకటన చేశాడు. ప్రస్తుతం అతడు 'ఏజెంట్ ఆనంద్ సంతోష్' అనే వెబ్ సిరీస్‌ను చేస్తున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న దీన్ని సుబ్బు కే తెరకెక్కించబోతున్నాడు. గతంలో వీళ్లిద్దరూ కలిసి 'సాఫ్ట్‌వేర్ డెవలపర్స్', 'సూర్య' చేశారు.

యాంకర్ శివ కోసం రంగంలోకి

యాంకర్ శివ కోసం రంగంలోకి

బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో గత వారంలో ఫ్యామిలీ మెంబర్లు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో కంటెస్టెంట్ల స్నేహితులు, సపోర్టర్లు, కుటుంబ సభ్యులు వచ్చారు. ఇందులో భాగంగానే యాంకర్ శివ కోసం షణ్ముఖ్ జస్వంత్ ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో అతడు మిగిలిన కంటెస్టెంట్లతోనూ సరదాగా మాట్లాడుతూ కనిపించాడు.

దీప్తి గురించి నాగ్, అషు ప్రశ్న

దీప్తి గురించి నాగ్, అషు ప్రశ్న

షణ్ముఖ్ జస్వంత్‌ బిగ్ బాస్ స్టేజ్‌పై కనిపించగానే కంటెస్టెంట్లతో పాటు హోస్ట్ నాగార్జున అతడిపై పంచ్‌లు వేయడానికి ప్రయత్నించారు. ఇందులో భాగంగానే అషు రెడ్డి 'దీప్తి ఎలా ఉంది షణ్నూ' అని అందరి ముందరే అతడి మాజీ ప్రియురాలి గురించి ప్రశ్నించింది. దీనికి నాగార్జున కూడా 'అవును షణ్నూ ఎలా ఉంది చెప్పు' అంటూ అతడిని ఇరికించే ప్రయత్నం చేశాడు.

దీప్తి గురించి గుడ్ న్యూస్ చెప్పి

దీప్తి గురించి గుడ్ న్యూస్ చెప్పి

అషు రెడ్డి అడిగిన దానికి స్పందిస్తూ.. షణ్ముఖ్ జస్వంత్ 'ఎవరు అషు రెడ్డేనా అడిగింది. హా.. దీప్తి బాగానే ఉంది. త్వరలోనే తనను కలవబోతున్నా' అని చెప్పాడు. దీంతో అతడి అభిమానులు షణ్నూ - దీప్తి మళ్లీ కలవబోతున్నారని ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక, బిగ్ బాస్ వల్ల తన ప్రేమను కోల్పోయిన షణ్ముఖ్.. ఇప్పుడదే స్టేజ్‌పై ఆమె గురించి మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X