Shanmukh Jaswanth: బడా ప్రాజెక్ట్ తో సిద్దమవుతున్న షన్ను.. ఎజెంట్ పాత్ర కోసం సాలీడ్ రెమ్యునరేషన్?

యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ ప్రస్తుత రోజుల్లో మంచి క్రేజ్ అందుకున్న వారిలో టాప్ లిస్టులో ఉంటాడు అని చెప్పవచ్చు. అతను ఎలాంటి వెబ్ సిరీస్ చేసిన కూడా ఇంటర్నెట్ ప్రపంచంలో యూత్ కు చాలా ఈజీగా కనెక్ట్ అవుతున్నాయి. మిలియన్ల వ్యూవ్స్ కూడా అందుకునే విధంగా వెబ్ సిరీస్ లు చేస్తున్న షన్ను ఈ సారి డైరెక్ట ఆహా సంస్థతో కలిసి ఒక విభిన్నమైన వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను కూడా ఇటీవల విడుదల చేయగా సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంది. అయితే ఆ వెబ్ సిరీస్ కోసం ఎంత రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు అనే వివరాల్లోకి వెళితే...

మొదట్లో అలా..

మొదట్లో అలా..

మొదట కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో చిన్న నటుడిగా కనిపించిన షణ్ముఖ్ జస్వంత్ ఆ తర్వాత వైవా యూ ట్యూబ్ కామెడీ షో ద్వారా గుర్తింపు అందుకున్న విషయం తెలిసిందే. వైవా టీమ్ తో కలిసి అనేక రకాల కామెడీ స్కిట్స్ చేసిన షణ్ముఖ్ జస్వంత్ ఆ తర్వాత వారి నుంచి సొంతంగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకునే వరకు వెళ్ళాడు.

 యూట్యూబ్ ద్వారా ఆదాయం

యూట్యూబ్ ద్వారా ఆదాయం

షణ్ముఖ్ జస్వంత్ కొన్ని వెబ్ సిరీస్ లతో యూట్యూబ్ నుంచి మంచి ఆదాయం సొంతం చేసుకున్నాడు. సొంతంగా నిర్మించడమే కాకుండా సొంతంగా కథలు కూడా రాసుకుని యూట్యూబ్లో డైరెక్ట్ చేసుకున్నాడు కూడా. ఆ తర్వాత అతనికి తెలిసిన కొంతమంది దర్శకులతో కలిసి మొదట సాఫ్ట్ వేర్ డెవలపర్ అనే ఒక వెబ్ సీరీస్ చేశాడు. దానికి యూత్ నుంచి భారీ స్థాయిలో స్పందన లభించింది.

 ఆ వెబ్ సీరీస్ తో..

ఆ వెబ్ సీరీస్ తో..

అనంతరం మెల్లగా సూర్య అనే వెబ్ సీరీస్ కూడా చేశాడు. అప్పటివరకు షణ్ముఖ్ జస్వంత్ కేవలం కామెడీ చేస్తూ వచ్చాడు. ఇక సూర్య వెబ్ సీరీస్ తో ఎమోషనల్ గా కూడా యూత్ కు బాగా కనెక్ట్ అయిపోయాడు. అనంతరం ఏమాత్రం వెనక్కి చూసుకోలేదు. ఆ వెబ్ సిరీస్ ద్వారానే అతను మంచి ఆదాయాన్ని కూడా అందుకున్నాడు. ప్రతి ఎపిసోడ్ 10 మిలియన్స్ కు పైగా వ్యూవ్స్ రావడంతో అతని రేంజ్ మరింత పెరిగిపోయింది.

 బిగ్ బాస్ 5లో అలా..

బిగ్ బాస్ 5లో అలా..

అనంతరం బిగ్ బాస్ లో కూడా అవకాశం వచ్చింది. అసలైతే బిగ్ బాస్ సీజన్ 4 లోనే ఛాన్స్ వచ్చింది. కమి అప్పుడు అతను ఆ షో చేయడానికి అంతగా ఆసక్తి చూపించలేదు. ఇక సీజన్ 5లో భారీ స్థాయిలో పారితోషికం ఇస్తామని ఆఫర్ చేయడంతో కంటెస్టెంట్ గా వెళ్లడానికి ఒప్పుకున్నాడు. ఇక అందులో షణ్ముక్ జశ్వంత్ కంటెస్టెంట్ గా ఫైనల్స్ వరకు బాగానే నిలదొక్కుకున్నాడు. ఇక చివరికి రన్నరప్ గా నిలిచిన విషయం తెలిసిందే.

ఆహాలో ఏజెంట్ సీరీస్

ఆహాలో ఏజెంట్ సీరీస్

ఇక ఇప్పుడు అతనితో ఓటీటీ సంస్థ ఆహా నుంచి ఒక వెబ్ సిరీస్ ఆఫర్ వచ్చింది. అరుణ్ పవర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న AAS ఏజెంట్ ఆనంద్ సంతోష్ అనే వెబ్ సీరీస్ కు సుబ్బు కథను అంధించాడు. ఈ వెబ్ ప్రాజెక్ట్ ద్వారా సరి కొత్తగా ఓటీటీ ప్రపంచం లోకి అడుగుపెట్టబోతున్నాడు.

 రెమ్యునరేషన్ గట్టిగానే..

రెమ్యునరేషన్ గట్టిగానే..

అయితే ఈ వెబ్ సీరీస్ చేసేందుకు ఆహా నుంచి షన్ను భారీ స్థాయిలో రెమ్యునరేషన్ కూడా తీసుకుంటున్నట్లు సమాచారం. షన్ను కు మంచి డిమాండ్ ఉండడంతో అతను అడిగినంత ఇచ్చినట్లు సమాచారం. ఆ ప్రాజెక్ట్ కోసం దాదాపు 50 లక్షలకు పైగానే ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ డిమాండ్ మరింత పెరిగితే ఇంకాస్త ఎక్కువగా ఇస్తామని కూడా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఫుల్ కామెడీ థ్రిల్లర్ గా రానున్న ఆ వెబ్ సీరీస్ ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X