ఓటీటీలోకి మంచి మిడిల్ క్లాస్ మూవీ.. హాయిగా అనిపించే దీన్ని ఎందులో చూడాలంటే!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో రకాల జోనర్లలో సినిమాలు వస్తుంటాయి. కానీ, అందులో కొన్ని మాత్రం ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించి హైలైట్ అవుతుంటాయి. వాటిలోనూ కొన్ని మాత్రం ఇంటిల్లిపాది హాయిగా చూస్తూ ఆనందం పొందే కొన్ని సినిమాలు కూడా ఉంటాయి. అలాంటి చిత్రాల్లో మార్చి నెలలో విడుదలైన 'షరతులు వర్తిస్తాయి' ఒకటి.

'30 వెడ్స్‌ 21' వెబ్ సిరీస్ ఫేమ్ చైతన్య రావు హీరోగా నటించిన తాజా చిత్రమే 'షరతులు వర్తిస్తాయి'. కుమారస్వామి తెరకెక్కించిన ఈ చిత్రం ఫ్యామిలీ స్టోరీతో రావడంతో ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. దీనికితోడు డిఫరెంట్ ప్రమోషన్ చేయడంతో అంచనాలను పెంచుకుంది. ఇలా 'షరతులు వర్తిస్తాయి' మూవీ మార్చి 15న ఎంతో గ్రాండ్‌గా విడుదలైంది.

Sharathulu Varthisthai Movie OTT Streaming From May 18th On AHA

మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'షరతులు వర్తిస్తాయి' మూవీకి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఫలితంగా ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన చాలా తక్కువగానే వచ్చింది. ఫలితంగా చైతన్య రావు నటించిన ఈ మూవీకి ఓపెనింగ్స్‌ పెద్దగా రాలేదు. ఆ తర్వాత కూడా కలెక్షన్లను అంతగా వసూలు చేయలేదు. తద్వారా ఈ సినిమా సక్సెస్‌ను సొంతం చేసుకోలేదు.

చైతన్య రావు - కుమారస్వామి కలిసి చేసిన 'షరతులు వర్తిస్తాయి' మూవీ విడుదలై రెండు నెలల గడుస్తున్నా ఓటీటీ అప్‌డేట్ రాలేదు. దీంతో ఈ సినిమా డిజిటల్ డీల్ ముగియలేదని అంతా అనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ హక్కులను ఫేమస్ ఓటీటీ సంస్థ ఆహా దక్కించుకుంది. ఇక, ఇప్పుడు ఈ ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ మూవీ స్ట్రీమింగ్‌పై ఆహా అధికారిక ప్రకటనను వదిలింది.

Sharathulu Varthisthai Movie OTT Streaming From May 18th On AHA

వినోదంతో కూడిన ఫ్యామిలీ కథతో రూపొందిన 'షరతులు వర్తిస్తాయి' మూవీని మే 18వ తేదీ నుంచే ఆహా సంస్థ అందుబాటులోకి తీసుకు రాబోతుంది. ఈ విషయాన్ని తాజాగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అంతేకాదు, 'మంచి మిడిల్ క్లాస్ సినిమా చూడాలని ఉందా? అయితే షరతులు వర్తిస్తాయి' అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఈ చిత్రం కోసం అంతా ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉండగా.. చైతన్య రావు హీరోగా నటించిన 'షరతులు వర్తిస్తాయి' సినిమాలో భూమిక శెట్టి హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని స్టార్ లైట్స్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై శ్రీలత, నాగార్జున్ సామలలు నిర్మించారు. అరుణ్ చిలువేరు, సురేష్ బొబ్బిలి ఈ మూవీకి సంగీతాన్ని అందించారు. ఇందులో నంద కిశోర్, సంతోష్ యాదవ్, మల్లేష్ తదితరులు నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X