Unstoppable 2: ఆ అమ్మాయి గురించి చెప్పొద్దయ్యా.. శర్వానంద్ కు బాలయ్య బాబు వినతి
సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే నందమూరి నటసింహం బాలయ్య బాబు డిజిటల్ తెరపై కూడా అదరగొడుతున్నాడు. సూపర్ సక్సెస్ అయిన టాక్ షో 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే'కు కొనసాగింపుగా సీజన్ 2ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండో సీజన్ ఫస్ట్ అండ్ సెకండ్ ఎపిసోడ్ లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకున్నాయి. మూడో ఎపిసోడ్ కు మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్స్ గా శర్వానంద్, అడవి శేష్ హాజరయ్యారు. వాళ్లతో వచ్చి రాగానే ఆడుకోవడం స్టార్ట్ చేశాడు బాలకృష్ణ. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన రెండో ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇందులో ఒక అమ్మాయి గురించి చెప్పొద్దని హీరో శర్వానంద్ ర్విక్వెస్ట్ చేశాడు బాలయ్య బాబు.
నందమూరి నట సింహం బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో సీజన్ 2 చాలా ఆసక్తికరంగా కొనసాగుతోంది. రాజకీయ నేతలు, హీరోలు వంటి విభిన్నమైన గెస్టులతో బాలయ్య బాబు చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఇక సెకండ్ సీజన్ మూడో ఎపిసోడ్ లో ప్రత్యేక అతిథులుగా అడివి శేష్, శర్వానంద్ వచ్చారు. వీరిని టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్ గా పేర్కొంటూ వారితో దబిడి దిబిడి అంటూ ఇంటర్డ్యూస్ చేశారు. షోకి హాజరైన అడవి శేష్, శర్వానంద్ తో బాలయ్య గేమ్ మామూలుగా కొనసాగలేదు. బోల్డ్ ప్రశ్నలతో కూడా యువ హీరోలకు చెమటలు పెట్టించాడు. ఇక ఈ పూర్తి ఎపిసోడ్ నవంబర్ 4న ఆహా లో స్ట్రీమింగ్ కానుంది.

పూర్తి ఎపిసోడ్ రిలీజ్ కు ముందు ప్రోమోలు విడుదల చేస్తారన్న విషయం తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ చేసిన మొదటి ప్రోమో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ ప్రోమోలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నాతో శర్వానంద్ వీడియో కాల్ చేసి బాలకృష్ణతో మాట్లాడించాడు. అంతకుముందు ఎపిసోడ్ లో బాలకృష్ణకు రష్మిక మందన్నా అంటే క్రష్ అని చెప్పిన విషయం తెలిసిందే. అందుకే ఈ ఎపిసోడ్ కు వచ్చిన శర్వానంద్ ఆమెతో వీడియో కాల్ చేయించాడు. రష్మికతో మాట్లాడిన బాలయ్య అలానే ఆ ఫోన్ ను జేబులో పెట్టుకున్నాడు. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో శర్వానంద్, రష్మిక మందన్నా జోడి కట్టిన విషయం తెలిసిందే.
ఇక అన్‌స్టాపబుల్ సీజన్ 2 మూడో ఎపిసోడ్ రెండో ప్రోమో విషయానికొస్తే.. బాలకృష్ణ పాల్గొన్న ఒక పార్టీ గురించి శర్వానంద్ చెప్పుకొచ్చాడు. ''ఒక పార్టీలో చూశా. ఈయన ఐదున్నర నిమిషాలు ఉన్న పాటకు డ్యాన్స్ చేశారు. ఆయనకు పోటీగా నువ్వా నేనా అన్నట్లు ఒక అమ్మాయి డ్యాన్స్ చేసింది. మూడున్నర నిమిషాలు కాగానే ఆ అమ్మాయి ఆపేసింది. కానీ ఈయన మాత్రం ఐదున్నర నిమిషాల పాట పూర్తి చేసి.. కమాన్ రెడీ.. ఇంకో సాంగ్ కు రెడీ ఆ అన్నారు'' అంటూ అది బాలకృష్ణ ఎనర్జీ అని శర్వానంద్ తెలిపాడు. దీంతో అంతా చెప్పింది నిజమే కానీ, ఆ అమ్మాయి గురించి చెప్పొద్దయ్యా అంటూ శర్వానంద్ ను సరాదగా రిక్వెస్ట్ చేశాడు బాలకృష్ణ.


Click it and Unblock the Notifications











