Unstoppable 2: సిద్ధార్థ్ లవ్ ఎఫైర్ పై బాలయ్య కామెంట్స్.. శర్వానంద్ షాకింగ్ రిప్లై!

సినిమాల్లోనే కాకుండా డిజిటల్ తెరపై కూడా అదరగొడుతున్నాడు నందమూరి నటసింహం బాలయ్య బాబు. సూపర్ సక్సెస్ అయిన టాక్ షో 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే'కు కొనసాగింపుగా సీజన్ 2ను తీసుకొచ్చింది తెలిసిన సంగతే. ఈ రెండో సీజన్ ఫస్ట్ అండ్ సెకండ్ ఎపిసోడ్ లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకున్నాయి. మూడో ఎపిసోడ్ కు మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్స్ గా శర్వానంద్, అడవి శేష్ హాజరయ్యారు. వీళ్లు గెస్టులుగా వచ్చిన పూర్తి ఎపిసోడ్ నవంబర్ 4 నుంచి ప్రసారం అవుతోంది. శర్వానంద్ ను ప్రశ్నలు అడిగే క్రమంలో బ్యూటిఫుల్ హీరోయిన్ అదితిరావు హైదరీతో కలిసి సిద్ధార్థ్ తాజాగా పెట్టిన పోస్ట్ పై కామెంట్స్ చేశాడు బాలకృష్ణ.

టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్స్..

నందమూరి నట సింహం బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో సీజన్ 2 చాలా ఆసక్తికరంగా కొనసాగుతోంది. రాజకీయ నేతలు, హీరోలు వంటి విభిన్నమైన గెస్టులతో బాలయ్య బాబు చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఇక సెకండ్ సీజన్ మూడో ఎపిసోడ్ లో స్పెషల్ గెస్టులుగా అడివి శేష్, శర్వానంద్ వచ్చారు. వీరిని టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్ గా పేర్కొంటూ వారితో దబిడి దిబిడి అంటూ ఇంటర్డ్యూస్ చేశారు.

బోల్డ్ ప్రశ్నలతో చెమటలు..

బోల్డ్ ప్రశ్నలతో చెమటలు..

అన్ స్టాపబుల్ షోకి హాజరైన అడవి శేష్, శర్వానంద్ తో బాలయ్య గేమ్ మామూలుగా కొనసాగలేదు. యూత్ కు తగినట్లుగా బోల్డ్ ప్రశ్నలతో ఆ యువ హీరోలకు చెమటలు పెట్టించాడు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా రన్ రజా రన్ సినిమా సమయంలో మీ ఇద్దరికి గొడవ అయిందటగా అని బాలయ్య అడిగిన ప్రశ్నకు అదేం లేదే అని శర్వానంద్, అడవి శేష్ సమాధానం ఇచ్చారు. దీంతో లేదు నాకు సుజిత్ (రన్ రాజా రన్ డైరెక్టర్) చెప్పాడని బాలకృష్ణ అన్నాడు.

శర్వా కోపంతో వెళ్లిపోయావట కదా.

శర్వా కోపంతో వెళ్లిపోయావట కదా.

స్క్రిప్ట్ విషయంలో అడవి శేష్ వేలు పెట్టి తన క్యారెక్టర్ ను పొడగిస్తూన్నాడాని కోపంతో శర్వా వెళ్లిపోయావట కదా అని బాలకృష్ణ అడగడంతో.. అదేం లేదని శర్వానంద్ చెప్పాడు. సినిమా సమయంలో అడవి శేష్ జిమ్ లోనే ఉండేవాడు. బాడీ, సినిమా అంతే ఇవే చూసుకునేవాడని చెప్పాడు శర్వానంద్. దీంతో అప్పుడు బాడీ రాలేదు గానీ ఇప్పుడు వచ్చిందని నవ్వించాడు అడవి శేష్.

నచ్చింది ఓకే చేస్తాను..

నచ్చింది ఓకే చేస్తాను..

సినిమా కథల గురించి మాట్లాడగా.. నాకు ఎవరు సరైనా కథలు తీసుకురాలేదు. దీంతో నేనే కథలు రాసుకుని సినిమాలు తీసుకున్న.. ఇప్పుడు హిట్ 2లో మాత్రం నాదేం లేదు. వాళ్లు చెప్పినట్లు యాక్ట్ చేయడమే అని అడవి శేష్ చెప్పాడు. దీనికి వాళ్లకు అవకాశం ఇచ్చావ్ అని బాలకృష్ణ అనడంతో లేదంటూ అందరూ నవ్వుకున్నారు. తర్వాత శర్వా.. నువ్ చెప్పు నీ కథల సెలక్షన్ గురించి అని బాలయ్య అడగ్గా.. నాదేం లేదు. వాళ్లు చెబుతారు.. నచ్చింది ఓకే చేస్తాను అని శర్వానంద్ అన్నాడు.

నిన్నే ఓ పోస్ట్ చూశానని..

నిన్నే ఓ పోస్ట్ చూశానని..

మరి హీరోయిన్ల సెలక్షన్ అని బాలకృష్ణ అడగ్గా.. అడవి శేష్ గట్టిగా నవ్వేశాడు. హీరోయిన్లను కూడా డైరెక్టర్లే సెలెక్ట్ చేస్తానరని శర్వానంద్ ఆన్సర్ ఇవ్వగా.. అదితిరావు హైదరీ గురించి అడగ్గా.. తను సిద్ధార్థ్ పెయిర్ సార్ అని శర్వానంద్ అంటే.. అదేంటీ సినిమాలో చేసుకున్నావ్ గా నీ పెయిర్.. అంటే బయట సిద్ధార్థ్ కు పెయిర్ అయిందా.. అని బాలకృష్ణ అంటే.. ఆశ్చర్యంగా ఆలోచిస్తూ.. అది నాకు తెలీదు సార్.. నిన్నే ఓ పోస్ట్ చూశానని శర్వానంద్ అన్నాడు.

బాబోయ్.. నన్ను ఇలా ఇరికించకండి..

బాబోయ్.. నన్ను ఇలా ఇరికించకండి..

ఏం పోస్ట్ చూశావ్ అని మళ్లీ బాలకృష్ణ అడగ్గా.. మై లవ్లీ హార్ట్ అని పోస్ట్ చూశాను సర్ అని శర్వానంద్ అన్నాడు. దీనికి మరి పలికిందంటావా అని బాలయ్య అంటే.. ఏమో పలికినట్టుందేమో సార్ అని శర్వానంద్ బదులిచ్చాడు. అంటే ఆవిడ నీకు చెప్పిందా అని బాలకృష్ణ మళ్లీ అడగ్గా.. నాకేం చెప్పలేదు సార్ బాబోయ్.. నన్ను ఇలా ఇరికించకండి.. ఇలా ర్యాగింగ్ చేస్తారేంటి సార్ అని శర్వానంద్ షాక్ అయ్యాడు. దీంతో శర్వా.. బాగా మెలవకులు ఉన్నాయి అని కంప్లీట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X