Manamey OTT Release: ఏడాది తర్వాత ఓటీటీలోకి శర్వానంద్ మూవీ.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?

ఓటీటీ మార్కెట్ రోజుకు పెరుగుతుండటంతో పాటు ఓటీటీల ద్వారా అదనపు ఆదాయం వస్తుండటంతో దర్శక నిర్మాతలు తమ సినిమాలను రిలీజ్‌కు ముందే డిజిటల్ రైట్స్‌ను విక్రయించేస్తున్నారు. బడా హీరో, స్టార్ డైరెక్టర్ అయితే నిర్మాతకు కళ్లు చెదిరే లాభాలు వస్తున్నాయి. భారత్‌లో ఓటీటీలకు ఆదరణ పెరుగుతుండటంతో ప్రపంచ ప్రఖ్యాత సంస్థ మనదేశంలో దిగుతున్నాయి. సినిమాలను దక్కించుకోవడానికి ఆయా సంస్థలు భారీ ఆఫర్ చేస్తుండటంతో కోట్లు రాలుతున్నాయి.

కొన్ని సినిమాలు చిత్రీకరణ దశలో, మరికొన్ని రిలీజ్‌కు ముందు, ఇంకొన్ని రిలీజ్ అయ్యాక తమ డిజిటల్ డీలింగ్స్‌ను పూర్తి చేస్తాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం ఓటీటీలోకి రావడానికి నెలలకొద్దీ వెయిట్ చేయాల్సి వస్తోంది. రెండు మూడేళ్లు గడిచినా ఇప్పటికీ ఓటీటీలోకి రాని సినిమాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి సినిమాలు ఒకదానికొకటి ఈ మధ్య కాలంలో ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను కన్ఫర్మ్ చేసుకుంటున్నాయి. ఈ కోవలోకే వస్తుంది శర్వానంద్ - కృతిశెట్టి నటించిన మనమే.

Sharwanand Krithi Shetty s Manamey OTT release date confirmed

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, రామ్‌సే స్టూడియోస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబోట్ల సంయుక్తంగా నిర్మించారు. హేఏ వాహబ్ స్వరాలు సమకూర్చిన ఈ సినిమాలో విక్రమ్ ఆదిత్య, వెన్నెల కిశోర్, సీరత్ కపూర్, త్రిగుణ్, సచిన్ ఖేడెకర్, తులసి, ముఖేష్ రిషి, సీత, రాహుల్ రవీంద్రన్ తదితరులు కీలకపాత్ర పోషించారు. 2024 జూన్ 7న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేసిన ఈ సినిమా తొలి మూడు రోజుల్లో రూ.8 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టగా.. లాంగ్ రన్‌లో దాదాపు రూ.22 కోట్ల వసూళ్లు సాధించి కమర్షియల్‌గానూ హిట్ అయ్యింది. తల్లిదండ్రులను కోల్పోయిన ఓ పాపను హీరో, హీరోయిన్లు పెంచడం, ఆ పాపను చూసుకునే సమయంలో వారిద్దరి మధ్య ఎలాంటి అనుబంధం ఏర్పడింది? అన్నదే మనమే సినిమా కథ. నిజానికి గతేడాదే ఈ చిత్రం ఓటీటీలోకి రావాల్సింది . అయితే ఓటీటీ, శాటిలైట్ రైట్స్‌ దక్కించుకున్న వారు తమకు డబ్బులు చెల్లించలేదంటూ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కోర్టుకెక్కడంతో ఓటీటీ స్ట్రీమింగ్‌కు అడ్డంకి ఏర్పడింది.

Sharwanand Krithi Shetty s Manamey OTT release date confirmed

ప్రస్తుతం ఈ వివాదం ఓ కొలిక్కి రావడంతో ఓటీటీ రిలీజ్‌పై స్పష్టత వచ్చింది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమాను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దాదాపు 8 నెలల నిరీక్షణ తర్వాత మార్చి 7 నుంచి మనమే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. శర్వానంద్‌ సినిమాలు ఓటీటీలలో బాగానే ఆదరణ దక్కించుకుంటాయి. ఈ నేపథ్యంలో మనమే ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Read more about: sharwanand manamey krithi shetty
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X