మనమే ఓటీటీపై బిగ్ ట్విస్ట్.. శర్వానంద్ మూవీ ఎందులో రాబోతుందో తెలిస్తే!

తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే వచ్చిన హీరోలు చాలా మందే ఉన్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే తమదైన టాలెంట్లతో సత్తా చాటుతూ స్టార్లుగా మారారు. అలాంటి వారిలో చార్మింగ్ స్టార్ శర్వానంద్ ఒకడు. విలక్షణమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ యంగ్ హీరో.. ఇటీవలే 'మనమే' (Manamey) అనే సినిమాలో నటించాడు.

చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా నటించిన తాజా చిత్రమే 'మనమే'. శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన ఈ మూవీ ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. దీంతో ఈ చిత్రం భారీగానే అంచనాలను ఏర్పరచుకుంది. అందుకు అనుగుణంగానే అత్యధికంగా థియేట్రికల్ బిజినెస్‌ను జరుపుకుని ఈ మూవీ ఎంతో గ్రాండ్‌గా ఆడియెన్స్ ముందుకు వచ్చింది.

Sharwanand Starrer Manamey Movie OTT Streaming Details Revealed

శర్వానంద్ హీరోగా నటించిన 'మనమే' సినిమా ఎన్నో అంచనాలతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి అమెరికాలోని ప్రీమియర్స్ నుంచే డీసెంట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రానికి స్పందన మోస్తరు స్థాయిలోనే వచ్చింది. ఫలితంగా కాస్త తక్కువగానే వసూళ్లను అందుకుంది. దీంతో ఈ చిత్రం ఏవరేజ్‌ అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'మనమే' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు పోటీ కూడా భారీగానే ఏర్పడింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ సొంతం చేసుకుందని ప్రచారం జరిగింది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా హక్కులను ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకున్నట్లు తెలిసింది.

Sharwanand Starrer Manamey Movie OTT Streaming Details Revealed

'మనమే' సినిమా జూన్ 7వ తేదీన విడుదలైంది. అయితే, ప్రేక్షకుల మెప్పును ఇది అంతలా పొందలేకపోవడంతో వీలైనంత త్వరగా ఓటీటీలోకి వస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఈ చిత్రం ఇప్పటికీ స్ట్రీమింగ్‌కు రాలేదు. అయితే, తాజా సమాచారం ప్రకారం జూలై 19వ తేదీ నుంచి ఇది స్ట్రీమింగ్ అవబోతుందని తెలిసింది. దీనిపై ఈ రెండు రోజుల్లోనే ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

ఇదిలా ఉండగా.. 'మనమే' సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. ఇందులో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించగా.. వెన్నెల కిశోర్, సీరత్ కపూర్, రాహుల్ రవీంద్రన్ తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ సినిమాకు హేషామ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్‌ను కంపోజ్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X