పెళ్లి కాకుండానే పేరెంట్స్‌గా హీరో హీరోయిన్.. ఈ రొమాంటిక్ మూవీ ఓటీటీ వివరాలివే!

టాలీవుడ్‌లో ఎంతో మంది హీరోలు తమదైన యాక్టింగ్‌తో మెప్పిస్తున్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే విలక్షణమైన నటనతో ప్రేక్షకులను ఫిదా చేస్తున్నారు. అలాంటి వారిలో టాలెంటెడ్ గాయ్ శర్వానంద్ ఒకడు. చాలా కాలంగా సరైన బ్లాక్ బస్టర్ హిట్ కోసం చూస్తున్న అతడు.. వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇలా ఇటీవలే శర్వానంద్ 'మనమే' (Manamey) మూవీ చేశాడు.

చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీనే 'మనమే'. శ్రీరామ్ ఆదిత్య రూపొందించిన ఈ మూవీ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ప్లస్ ఎమోషనల్ కాన్సెప్టుతో వచ్చింది. దీంతో ఈ చిత్రం మొదట్లోనే భారీగానే అంచనాలను ఏర్పరచుకుంది. అందుకు తగ్గట్లుగానే అత్యధికంగా థియేట్రికల్ బిజినెస్‌ను జరుపుకుని ఈ మూవీ జూన్ 7వ తేదీన ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

Sharwanand Starrer Manamey Movie OTT Streaming From August 16th

శర్వానంద్ ప్రధాన పాత్రలో నటించిన 'మనమే' సినిమా ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి ప్రీమియర్స్ నుంచే డీసెంట్ టాక్‌ సొంతం అయింది. అందుకు తగ్గట్లుగానే ఈ మూవీకి స్పందన కూడా బాగానే వచ్చింది. ఫలితంగా భారీగా కాకుండా ఏవరేజ్ కలెక్షన్లను అందుకుంది. తద్వారా ఈ చిత్రం కూడా సెమీ హిట్‌గానే మిగిలిపోవాల్సి వచ్చింది.

యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'మనమే' మూవీపై హైప్ ఉండడంతో.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు పోటీ కూడా భారీగానే ఏర్పడింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకుంది. కానీ, రెండు నెలలు దాటినా స్ట్రీమింగ్ మాత్రం చేయడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై గుడ్ న్యూస్ లీకైంది.

Sharwanand Starrer Manamey Movie OTT Streaming From August 16th

'మనమే' సినిమా వీలైనంత త్వరగా ఓటీటీలోకి వస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఈ చిత్రం ఇప్పటికీ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రాలేదు. అయితే, తాజా సమాచారం ప్రకారం ఆగస్టు 16వ తేదీ నుంచి ఇది ఓటీటీలో దర్శనం ఇవ్వబోతుందని తెలిసింది. దీనిపై ఈ రెండు రోజుల్లోనే ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే నిజం అయితే శర్వానంద్ ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పాలి.

ఇదిలా ఉండగా.. క్రేజీ స్టోరీతో రూపొందిన 'మనమే' సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. ఇందులో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించగా.. వెన్నెల కిశోర్, సీరత్ కపూర్, రాహుల్ రవీంద్రన్ తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ సినిమాకు హేషామ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్‌ను ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X