OTT: ముందుగానే ఓటీటీలోకి శర్వానంద్ ఫ్యామిలీ డ్రామా.. ఎప్పుడు? ఎక్కడ అంటే?
ప్రెజెంట్ టాలీవుడ్ లో ఉన్నటువంటి స్టార్ అండ్ యంగ్ హీరోస్ లలో టైర్స్ వారీగా మన వాళ్ళు విభజించుకున్నారు. భారీ మార్కెట్ ఉంటే టైర్ 1 అని మిడ్ రేంజ్ మార్కెట్ ఉంటే టైర్ 2 అని ఇంకా తక్కువ మార్కెట్ ఉంటే టైర్ 3 అని కొందరు హీరోలకి ఒక లిస్ట్ ని పెట్టుకున్నారు. కాగా ఈ టైర్ 1 అండ్ 3 లని పక్కన పెడితే టైర్ 2 లో చాలా మంది యంగ్ హీరోస్ కనిపిస్తారు.
నాని, విజయ్ దేవరకొండ, నితిన్, నిఖిల్ ఇంకా చాలా మంది ఉన్నారు. అయితే వీరితో పాటుగా ఎప్పుడు నుంచో ఇండస్ట్రీలో ఉండి ఎవర్ ఛార్మ్ తో అదరగొట్టిన మరో హీరోనే శర్వానంద్. మతి తన లేటెస్ట్ సినిమానే "మనమే". కాగా ఈ చిత్రంతోనే తాను ఛార్మింగ్ స్టార్ గా టాలీవుడ్ లో తనకు కూడా ఓ స్టార్ తెచ్చుకున్న హీరోగా నిలిచాడు. అయితే ఇప్పుడు శర్వానంద్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ హిట్ కాలేదు కానీ ఓకే అనిపించింది.

ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా పర్వాలేదు అన్నారు. అయితే ఈ సినిమా గత జూన్ 7న థియేటర్స్ లోకి వస్తే ఈ సినిమాతో వచ్చిన కాజల్ సత్యభామ, నవదీప్ లవ్ మౌళి సినిమాలు కూడా ఓటిటి లోకి వచ్చేసాయి కానీ ఈ సినిమా మాత్రం ఇంకా ఈ మనమే సినిమా మాత్రం రావడం లేదు. దీనితో అప్పుడు స్కిప్ చేసి ఓటిటి చూద్దాం అనుకునేవారికి ఇంకా ఎలాంటి అప్డేట్ కనిపించడం లేదు.
కాగా ఇందుకు కారణం ఈ సినిమాకి ఇంకా ఓటిటి పార్ట్నర్ ఎవరు అనేది ఇంకా లాక్ కాకపోవడం ప్రధాన కారణం అని తెలుస్తుంది. అందుకే దీనితో వచ్చిన అన్ని సినిమాలు వచ్చినా ఇది ఇంకా అందుబాటులోకి రాలేదు. మరి అసలు ఈ సినిమా వస్తుందా రాదా అంటే వస్తుందనే వినిపిస్తుంది. ఈ సినిమాని ప్రముఖ సంస్థ హాట్ స్టార్ వారు సొంతం చేసుకున్నట్టుగా కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి.
ఇందులో ఈ సినిమా జూలై 12 నుంచి అలా రావచ్చని ప్రస్తుతానికి ఉన్న అప్డేట్. అయితే హాట్ స్టారే ఎందుకు అయ్యే ఛాన్స్ ఉందంటే గతంలో కూడా కొన్ని ఓటిటి డీల్ అవ్వని సినిమాలని హాట్ స్టార్ వారే తీసుకున్నారు. రీసెంట్ తమిళ హారర్ చిత్రం "బాక్" కూడా ఒటిటి డీల్ పూర్తి చేసుకోకుండానే వచ్చింది కానీ దాన్ని ప్రైమ్ వీడియో వారు తీసుకుంటారు అనుకున్నారు కానీ హాట్ స్టార్ చేతికి వెళ్ళింది.
ఇదే కోవలో ఇపుడు మనమే కూడా వెళ్లినట్టు భోగట్టా. మరి ఇది ఎంతవరకు నిజం అనేది అఫీషియల్ క్లారిటీ వచ్చే వరకు ఆగి చూడాల్సిందే. కాగా ఈ సినిమాలో శర్వానంద్ సరసన హీరోయిన్ గా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటించగా ఆయేషా ఖాన్ ముఖ్య పాత్రలో నటించింది. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వప్రసాద్ ఈ సినిమాని నిర్మాణం వహించారు.


Click it and Unblock the Notifications











