Shivangi OTT Release : సైలెంట్‌గా ఓటీటీలోకి శివంగి .. వరలక్ష్మీ శరత్ కుమార్ మూవీ ఎందులో అంటే?

సీనియర్ హీరో శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మీ శరత్ కుమార్ దక్షిణాదిలో పవర్‌ఫుల్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. హీరోయిన్‌గా స్టార్‌డమ్ దక్కనప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మాత్రం ఆమె బాగా పాపులర్ అయ్యారు. సౌత్‌లో మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా వరలక్ష్మీ నిలిచారు. తాను ఏ పాత్ర చేసినా ఖచ్చితంగా కథాబలం ఉండేలా , తనపాత్రకు ప్రాథాన్యం ఉండేలా చూసుకుంటున్నారు. నెగిటివ్ రోల్స్‌తో విలనిజం పండించినా.. పాజిటివ్ రోల్స్‌తో కంటతడి పెట్టించినా తనకు తానే సాటి అన్న విధంగా నటిస్తున్నారు వరలక్ష్మీ.

రవితేజ హీరోగా వచ్చిన క్రాక్‌లో జయమ్మగా భయపెట్టిన వరలక్ష్మీ.. తర్వాత నాంది సినిమాతో ఆకట్టుకున్నారు. తర్వాత నందమూరి బాలకృష్ణ చెల్లెలుగా వీరసింహారెడ్డి సినిమాలో మరోసారి పవర్‌ఫుల్ పాత్రను పోషించారు. దాంతో ఆమెకు ఆఫర్లు క్యూకడుతున్నాయి. తమిళంలో కంటే తెలుగులోనే వరలక్ష్మీకి క్రేజ్ నెలకొంది. దాంతో చెన్నై నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చేసింది ఈ ముద్దుగుమ్మ. వచ్చిన ప్రతి సినిమా కాకుండా చాలా సెలెక్టివ్‌గా సినిమాలు ఎంపిక చేసుకుంటోంది. ఇక హనుమాన్ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకుని ఈ సినిమా హిట్ సాధించడంలో కీలకపాత్ర పోషించారు.

Shivangi ott release here is the varalakshmi sarathkumar s Movie ott streaming details

తాజా వరలక్ష్మీ శరత్ కుమార్ నటించిన చిత్రం శివంగి. మరో హీరోయిన్ ఆనంది, జాన్ విజయ్, డాక్టర్ కోయ కిశోర్ కీలకపాత్రలు పోషించగా.. దేవరాజ్ భరణీధరన్ దర్శకత్వం వహించారు. నరేశ్ బాబు పీ నిర్మాణ సారథ్యం వహించారు. మార్చి 7న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా తాజాగా ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఆనంది ఓ సాధారణ గృహిణి పాత్రను పోషించగా.. వరలక్ష్మీ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా విశ్వరూపం చూపించారు.

అనారోగ్యంతో బాధపడే భర్త.. అత్తింటి వేధింపులకు తోడు ఆర్ధిక సమస్యల కారణంగా సత్యభామ (ఆనంది) జీవితం కష్టాలతో సాగుతుంటుంది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసే సత్యభామకి తను పనిచేసే చోట లైంగిక వేధింపులు ఎదురవుతాయి. ఇంతలో ఆమె అనుకోకుండా ఓ హత్య కేసులో ఇరుక్కుంటుంది. ఈ కేసును వరలక్ష్మీ శరత్ కుమార్ విచారిస్తుంది. సత్యభామను హత్య కేసులో ఇరికించింది ఎవరు? వీటన్నింటి వెనుక ఉన్నది ఎవరు? పోలీస్ అధికారిగా వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ మిస్టరీని ఎలా ఛేదించింది? ఆనంది కష్టాలు తీరాయా? అన్నదే శివంగి సినిమా కథ.

మరోసారి వరలక్ష్మీ శరత్ కుమార్ తన పవర్‌ఫుల్ ‌యాక్టింగ్‌‌తో అలరించగా.. ఆనంది గృహిణిగా, మధ్యతరగతి అమ్మాయిగా అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అయితే శివంగి చిత్రం బాక్సాఫీస్ వద్ద మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో శివంగిని ఓటీటీని రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా .. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. తాజాగా శివంగి సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఆహా ప్రకటించింది. ఏప్రిల్ 17 నుంచి తెలుగులో.. ఏప్రిల్ 18 నుంచి తమిళంలో స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుందని ఎక్స్ వేదికగా తెలిపింది. థియేటర్‌లో సక్సెస్ కానీ ఈ చిత్రం ఓటీటీలో ఎంత మేరకు ప్రభావం చూపిస్తుందో చూడాలి.

More from Filmibeat

Read more about: varalakshmi sarathkumar anandhi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X