నేరుగా ఓటీటీలో స్టార్ డాటర్ మూవీ.. రొమాంటిక్ లవ్ స్టోరీని ఎందులో చూడాలంటే!
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఓటీటీ (OTT)ల హవా కనిపిస్తోంది. గతంలో సినిమాకు వెళ్లాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు ఓటీటీలు అందుబాటులోకి రావడంతో ఇది చాలా సులభం అయిపోయింది. అందుకే ప్రేక్షకులు వీటికే పచ్చజెండా ఊపుతున్నారు. అందుకు తగ్గట్లే ఓటీటీ సంస్థలు కొత్త కంటెంట్‌ను అందిస్తూ వాళ్లకు వినోదాన్ని అందిస్తున్నాయి.
తెలుగులో ఫేమస్ ఓటీటీ సంస్థ ఆహా కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు, షోలు తీసుకు వస్తోంది. ముఖ్యంగా కొన్నింటిని థియేటర్లలో కాకుండా నేరుగా స్ట్రీమింగ్ చేస్తోంది. ఇలా ఇప్పటికే ఎన్నో సినిమాలను ఈ సంస్థ ప్రేక్షకులకు అందించింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ క్రేజీ మూవీని ఈ ప్లాట్‌ఫాంలో స్ట్రీమింగ్ చేయబోతుంది. అదే 'విద్య వాసుల అహం'.

స్టార్ డాటర్ శివానీ రాజశేఖర్, రాహుల్ విజయ్ జంటగా నటించిన చిత్రమే 'విద్య వాసుల అహం'. మణికాంత్ గిల్లి తెరకెక్కించిన ఈ మూవీ ఎప్పుడో షూటింగ్ జరుపుకుంది. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకుంది. కానీ, ఎందుకనో ఇది థియేటర్లలోకి రావడంలో ఆలస్యం అయింది. ఫలితంగా ఈ చిత్రం అసలు విడుదల కాదేమో అని అంతా అనుకున్నారు.
గిల్లికజ్జాలు పెట్టుకునే ప్రేమికుల కథతో రూపొందిన 'విద్య వాసుల అహం' మూవీని థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే విడుదల చేయాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయింది. ఈ మేరకు ఈ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఆహా సంస్థకు అమ్మేసింది. ఈ నేపథ్యంలో తాజాగా సదరు సంస్థ సోషల్ మీడియాలో ఈ సినిమాను నేరుగానే స్ట్రీమింగ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసేసింది.

ఆహా సంస్థ సోషల్ మీడియా ఖాతాలో 'విద్య వాసుల అహం' మూవీ స్ట్రీమింగ్ త్వరలోనే ఉండబోతున్నట్లు తెలిసింది. అంతేకాదు, 'ఎవరెస్టు శిఖరంలో సగం.. ఈ 'విద్య, వాసుల' అహం! ఆ కహనీ ఏంటో త్వరలో ఆహాలో చూద్దాం' అంటూ రాసుకొచ్చింది. దీంతో ఈ చిత్రం కోసం సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు, 'విద్య వాసుల అహం' మే 10వ తేదీ నుంచే స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది.
ఇదిలా ఉండగా.. 'విద్య వాసుల అహం' మూవీని ఎటర్నిటీ ఎంటర్‌టైన్‍మెంట్, తన్విక జష్విక క్రియేషన్స్ బ్యానర్లపై మహేశ్ దత్త, లక్ష్మీ నవ్య నిర్మించారు. ఈ చిత్రానికి కల్యాణి మాలిక్ సంగీతాన్ని అందించారు. ఇందులో శ్రీనివాస్ అవసరాల, అభినయ, తనికెళ్ల భరణి, శ్రీనివాసరెడ్డి, మౌనిక రెడ్డి, రవివర్మ, కాశీ విశ్వనాథ్ కీలక పాత్రల్లో నటించారు.


Click it and Unblock the Notifications











