డైరెక్టుగా ఓటీటీలో విడుదలైన రొమాంటిక్ మూవీ.. స్టార్ డాటర్ సినిమా ఎందులో వచ్చిందంటే!
ఒకప్పుడు సినిమాను చూడాలంటే థియేటర్లకు వెళ్లాల్సి వచ్చేది. లేకుంటే టీవీలోకి వచ్చే వరకూ వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేది. కానీ, ఇప్పుడు మాత్రం ఓటీటీ (OTT)లు అందుబాటులోకి వచ్చిన తర్వాత థియేటర్లలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఇంట్లో చూసే సదుపాయం వచ్చేసింది. ముఖ్యంగా తెలుగు ఓటీటీ సంస్థ ఆహా ఎన్నో కొత్త కొత్త సినిమాలను తీసుకు వస్తూనే ఉంది.
ఓటీటీల హవా పెరిగిన తర్వాత చాలా సినిమాలు థియేటర్ల కంటే ముందే స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి. ముఖ్యంగా ఆహాలో ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు అలా ఓటీటీ ప్రియులను అలరించేందుకు ఓ సినిమా వచ్చేసింది. అదే 'విద్య వాసుల అహం'. స్టార్ డాటర్ శివానీ రాజశేఖర్, రాహుల్ విజయ్ ఈ చిత్రంలో జంటగా నటించిన విషయం తెలిసిందే.

స్టార్ డాటర్ శివానీ రాజశేఖర్, రాహుల్ విజయ్ జంటగా మణికాంత్ గిల్లి తెరకెక్కించిన సినిమానే 'విద్య వాసుల అహం'. ఈ మూవీ ఎప్పుడో షూటింగ్ జరుపుకుంది. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకుంది. కానీ, ఎందుకనో ఇది థియేటర్లలోకి రావడంలో ఆలస్యం అయింది. ఫలితంగా ఈ చిత్రం అసలు విడుదల కాదేమో అని అందరూ అనుకున్నారు.
ఇగో వల్ల హీరో హీరోయిన్ల మధ్య ఎదురైన సంఘటన ఆధారంగా తెరకెక్కిన 'విద్య వాసుల అహం' మూవీని థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే విడుదల చేయాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయింది. ఈ మేరకు ఈ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఆహా సంస్థకు అమ్మేసింది. ఈ నేపథ్యంలో తాజాగా సదరు సంస్థ సోషల్ మీడియాలో దీనిపై అధికారిక ప్రకటన చేసింది.

ముందుగా ప్రకటించినట్లుగానే 'విద్య వాసుల అహం' సినిమా తాజాగా ఆహా ప్లాట్‌ఫాంలో ఓటీటీలోకి వచ్చేసింది. గత అర్ధరాత్రి నుంచే సదరు సంస్థ దీన్ని స్ట్రీమింగ్ చేస్తోంది. అంతేకాదు, ఇప్పటికే ఈ చిత్రానికి అక్కడ మంచి స్పందన కూడా వస్తున్నట్లు తెలుస్తోంది. మరి నేరుగా ఓటీటీలోనే విడుదలైన ఈ చిత్రానికి ఎలాంటి టాక్ వస్తుందో వేచి చూడాల్సిందే.
ఇదిలా ఉండగా.. క్రేజీ లవ్ స్టోరీతో వచ్చిన 'విద్య వాసుల అహం' మూవీని ఎటర్నిటీ ఎంటర్‌టైన్‍మెంట్, తన్విక జష్విక క్రియేషన్స్ బ్యానర్లపై మహేశ్ దత్త, లక్ష్మీ నవ్య నిర్మించారు. ఈ చిత్రానికి కల్యాణి మాలిక్ సంగీతాన్ని అందించారు. ఇందులో శ్రీనివాస్ అవసరాల, అభినయ, తనికెళ్ల భరణి, శ్రీనివాసరెడ్డి, మౌనిక రెడ్డి, రవివర్మ, కాశీ విశ్వనాథ్ కీలక పాత్రలను పోషించారు.


Click it and Unblock the Notifications











