నేరుగా OTTలోకి రాబోతున్న శివానీ రాజశేఖర్ కొత్త సినిమా.. ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే?
ఈ మధ్య కాలంలో అనేక అదిరిపోయే సినిమాలు ఓటీటీలోకి రాబోతున్నాయి. ముఖ్యంగా కరోనా సమయం నుంచి కొత్త కొత్త చిత్రాలు కూడా నేరుగా ఓటీటీలోనే విడుదల అవుతూ.. ఓటీటీ ప్రియులను ఫుల్ గా ఎంటర్ టైన్ చేస్తున్నాయి. ముఖ్యంగా సూపర్ సక్సెస్ సాధిస్తూ.. సీక్వెల్స్ కూడా తీసుకు వస్తున్నారు. సీక్వెల్ మూవీస్ ను కూడా ఓటీటీల్లోనే రిజీల్ చేస్తూ తన సత్తా ఏంటో చూపిస్తున్నారు దర్శక, నిర్మాతలు. అయితే తాజాగా మరో క్రేజీ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. ఆ సినిమా ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
హీరో రాజశేఖర్, హీరోయిన్ జీవితా రాజశేకర్ ల ముద్దుల కూతురు.. శివానీ రాజశేఖర్, రాహుల్ విజయ్ జంటగా రాబోతున్న క్రేజీ చిత్రమే విద్య వాసుల అహం. మణికాంత్ గిల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఎటర్నిటీ ఎంటర్‌టైన్‍మెంట్, తన్విక జష్విక క్రియేషన్స్ బ్యానర్లపై మహేశ్ దత్త, లక్ష్మీ నవ్య నిర్మించారు. ఈ చిత్రానికి కల్యాణి మాలిక్ సంగీతాన్ని అందించారు. ఇందులో శ్రీనివాస్ అవసరాల, అభినయ, తనికెళ్ల భరణి, శ్రీనివాసరెడ్డి, మౌనిక రెడ్డి, రవివర్మ, కాశీ విశ్వనాథ్ కీలక పాత్రల్లో నటించారు.

చాలా కాలం క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న విద్య వాసుల అహం సినిమా... ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకుంది. కానీ పలు కారణాల వల్ల ఈ సినిమా థియేటర్లలోకి మాత్రం రాలేకపోయింది. దీంతో అందరూ ఈ సినిమా ఇక విడుదల కాదని అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఈ క్రేజీ మూవీని ఓటీటీలోకి తీసుకురాబోతున్నారు.

అహంతో కూడిన ప్రేమ కధను చూపించేందుకు రూపొందించిన విద్య వాసుల అహం చిత్రాన్ని నేరుగా ప్రముఖ ఓటీటీ దిగ్గజం అయిన ఆహాలో విడుదల చేయబోతున్నారు. మంచి ధరలకే ఈ సినిమాను కొనుగోలు చేసిన ఆహా సంస్థ ఈ మూవీ విడుదల తేదీని ఫిక్స్ చేసింది. ఎక్స్ వేదికగా స్ట్రీమింగ్ డేట్ ను తెలిపింది. మే 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించింది. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులు అంతా ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు. ఈ మూవీని కచ్చితంగా చూడాలని ప్లాన్ లు కూడా వేసుకుంటున్నారు. మీరు కూడా ఓ మూవీపై ఓ కన్నేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











