ఓటిటి కంటే ముందే "కంగువా" క్లారిటీ ప్రింట్ లీక్ .. మరి ఓటిటిలో ఎప్పుడంటే..
ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ లో మన తెలుగు సినిమాకి ఉన్న వాల్యూ మరో లెవెల్లో ఉంది అని చెప్పాలి. ఒకప్పుడు తమిళ సినిమాలు హై స్టాండర్డ్స్ తో సత్తా చాటాయి. కానీ బాలీవుడ్ సినిమాని మాత్రం బీట్ చేయలేకపోయాయి. కానీ ఒక్క మన తెలుగు సినిమాలు మాత్రమే బాలీవుడ్ సినిమాని బీట్ చేసి ఇపుడు ఇండియన్ సినిమాకి ఫేస్ గా నిలిచాయి అని చెప్పడంలో సందేహం లేదు.
దీనితో ఒకప్పుడు భారీ సినిమాలు అందించిన తమిళ సినిమా కూడా మనల్నే ఫాలో అవుతూ వస్తుంది. ఇపుడు వస్తున్న సినిమాల్లో సీక్వెల్స్ అండ్ భారీ పీరియాడిక్ సినిమాల నేపథ్యంలో వచ్చిన మరో తమిళ బిగ్ బడ్జెట్ సినిమానే "కంగువా". దర్శకుడు శివ - హీరో సూర్య కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం విడుదలకి ముందు 1000 కాదు 2000 కోట్లు కొడతాం అని మేకర్స్ చెప్తూ భారీ హైప్ ఇస్తూ తీసుకొచ్చారు.

కానీ ఈ సినిమా ఊహించని విధంగా ప్లాప్ అయిపోయింది. దీనితో 1000 కోట్లు 2000 కోట్లు ఏమో కానీ 2000 కోట్లలో ఒక సున్నా తీసేస్తే వచ్చే 200 కోట్ల గ్రాస్ ని కూడా రాబట్టలేకపోయింది. దీనితో తమిళ సినిమా దగ్గర పెద్ద రచ్చ కూడా జరుగుతోంది. సినిమా వచ్చి కేవలం రెండు వారాలు మాత్రమే అయినప్పటికీ ఇంకా ఓటిటిలో కూడా విడుదల కాకుండానే కంగువా ఫుల్ హెచ్ డి ప్రింట్ లీక్ అయ్యి షాకిచ్చింది.
రెండు వారాల్లోనే ఫుల్ క్లారిటీ ఉన్న సినిమా లీక్ కావడం చిత్ర సీమలో చర్చకి దారి తీసింది. దీనితో ఈ చిత్రం ఓటిటి రిలీజ్ పై కొత్త రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. ఇపుడు క్లారిటీ ఉన్న ప్రింట్ బయటకి వచ్చేయడంతో ఇక మేకర్స్ కూడా చేసేది ఏమీ ఉండదు. పైగా ఇప్పుడు ఎలాగో థియేటర్స్ కి జనాలు కూడా రావట్లేదు. సో ఎర్లీ ఓటిటి రిలీజ్ కే ఈ సినిమా వచ్చేస్తుంది అని తెలుస్తుంది.

మరి లేటెస్ట్ రూమర్స్ ప్రకారం అయితే ఈ చిత్రాన్ని డిసెంబర్ 12 నుంచే ఓటిటిలో వదిలేయనున్నారట. ఈ సినిమా ఓటిటి హక్కులు పాపులర్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేయగా అందులోనే పాన్ ఇండియా భాషల్లో ఇచ్చేయనున్నట్టుగా ఇపుడు వినిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే ఈ సినిమా తమిళ్ వెర్షన్ లో లీక్ అయ్యినట్టుగా తెలుస్తుంది. సో ఓటిటిలో ముందే వచ్చేసే ఛాన్స్ లు ఉన్నాయని చెప్పాల్సిందే.
ఇక ఈ భారీ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్ , బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ గా నటించారు. ఈ సినిమాలో సూర్య తమ్ముడు కార్తీ ఒక పవర్‌ఫుల్ క్యామియోలో నటించాడు. ఈ చిత్రానికి సీక్వెల్ ని కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. మరి ఇది ఎపుడు వస్తుందో? అసలు వస్తుందో రాదో? అనేది చూడాలి. అసలే మొదటి పార్ట్ కే భారీ బడ్జెట్ ని మేకర్స్


Click it and Unblock the Notifications











