ఓటీటీలోకి వచ్చేసిన మరో క్రైమ్ థ్రిల్లర్.. ఈ కిడ్నాప్ డ్రామాను ఎక్కడ చూడాలంటే!
ఇండియా వ్యాప్తంగా ఉన్న అన్ని సినిమా ఇండస్ట్రీల్లోనూ క్రైమ్ థ్రిల్లర్ మూవీల ట్రెండ్ కనిపిస్తోంది. అందుకే గతంలో కంటే ఇప్పుడు ఆ తరహా సినిమాలు అన్ని భాషల్లోనూ భారీ స్థాయిలో వస్తున్నాయి. ముఖ్యంగా తెలుగులో కూడా అలాంటి చిత్రాలను తెరకెక్కించేందుకు దర్శక నిర్మాతలు ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. అలా వచ్చిన మరో చిత్రమే 'పారిజాత పర్వం'.
శ్రద్దా దాస్ ప్రధాన పాత్రలో కంభంపాటి సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే 'పారిజాత పర్వం'. సినిమాల్లోకి రావాలని ప్రయత్నిస్తున్న ఓ యంగ్ డైరెక్టర్.. డబ్బు కోసం కిడ్నాప్‌కు పాల్పడడం అనే కాన్సెప్టుతో ఈ సినిమా రూపొందింది. దీనికితోడు ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో ఈ మూవీ ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించి భారీ అంచనాలను ఏర్పరచుకుంది.

మంచి హైప్‌తో 'పారిజాత పర్వం' మూవీ ఏప్రిల్ 19వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా విడుదల అయింది. కానీ, ఆరంభంలోనే ఈ సినిమాకు మంచి టాక్ రాలేదు. దీనికి కారణం ఇందులో పాయింట్ పర్‌ఫెక్ట్‌గా ఉన్నా.. రోటీన్‌గా సాగడం.. పైగా దాన్ని చూపించిన విధానం కాస్త డల్‌గా ఉండడమే. ఫలితంగా ఈ చిత్రం టార్గెట్‌ను చేరుకోలేక విజయానికి దూరం అయింది.
థ్రిల్‌కు గురి చేసే కంటెంట్‌తో రూపొందిన మూవీ కావడంతో పాటు విడుదలకు ముందే అంచనాలను ఏర్పరచుకోవడంతో 'పారిజాత పర్వం' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ఓటీటీ సంస్థ నుంచి మంచి పోటీనే వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను ఆహా సంస్థ సొంతం చేసుకుంది. ఇందుకోసం మంచి మొత్తాన్నే నిర్మాతలకు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది.

శ్రద్దా దాస్, సునీల్, చైతన్య రావు ప్రధాన పాత్రలో నటించిన 'పారిజాత పర్వం' మూవీని ఆహా వీడియో సంస్థ నేటి ఉదయం నుంచే స్ట్రీమింగ్‌కు తీసుకు వచ్చేసింది. సాధారణ సబ్‌స్క్రిప్షన్ ఉన్న వాళ్లు కూడా ఈ సినిమాను అందులో చూసేలా స్ట్రీమింగ్ చేస్తోంది. ఇక, థియేటర్లలో మాదిరిగా కాకుండా ఆహా వీడియోలో 'పారిజాత పర్వం'కు మంచి రెస్పాన్స్ లభిస్తోందని టాక్.
ఇదిలా ఉండగా.. శ్రద్దా దాస్ - కంభంపాటి సంతోష్ కాంబినేషన్‌లో రూపొందిన 'పారిజాత పర్వం' చిత్రాన్ని వనమాలి క్రియేషన్స్ బ్యానర్‌పై మహీధర్ రెడ్డి, దేవేష్ నిర్మించారు. ఇందులో చైతన్య రావు, సునీల్, వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్, సురేఖ వాణి తదితరులు నటించారు. ఈ మూవీకి రీ మ్యూజిక్ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











