850 కోట్ల మూవీ ఓటీటీలోకి.. సడెన్‌గా వచ్చేసిన శ్రద్దాకపూర్ మూవీ.. ఎక్కడ? ఎప్పుడు చూడొచ్చంటే?
ఇండియాలో ఉన్నటువంటి దాదాపు అన్ని సినీ పరిశ్రమల్లో కూడా మేల్ డామినేటింగ్ సిస్టం ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా కొందరు హీరోయిన్స్ ఆ హీరోలకి ధీటుగా నిలబడతారు. మరి అలాంటి హీరోయిన్స్ ఆ హీరోల్లానే చాలా కాలం అదే స్టార్డంతో కొనసాగిన వారు కూడా లేకపోలేరు.
అయితే టోటల్ ఇండియన్ సినిమా దగ్గర ఏ ఇండస్ట్రీలో అయినా కూడా ఓ హీరోయిన్ ఇండస్ట్రీ హిట్ కొట్టడం అనేది చాలా పెద్ద విషయమే అని చెప్పాలి. అలాగే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే ఇంకా కష్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మేల్ డామినేషన్ బాక్సాఫీస్ దగ్గర మరింత ఎక్కువ అయ్యింది.

ఇలా బాక్సాఫీస్ దగ్గర లెక్కలు మారిపోయిన తరుణంలో బాలీవుడ్ సినిమా దగ్గర ఓ హారర్ సీక్వెల్ సినిమా రికార్డు వసూళ్లతో బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ రికార్డులు గల్లంతు చేసింది. కాగా ఆ సినిమానే "స్త్రీ 2" కాగా ఈ సినిమాలో బాలీవుడ్ గ్లామరస్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ నటించగా బాలీవుడ్ దర్శకుడు అమర్ కౌశిక్ తెరకెక్కించారు.
మరి గత 2018లో వచ్చిన ఈ హారర్ కామెడీ ఎంటర్టైనర్ కి సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం బాలీవుడ్ నుంచి ఏకంగా 860 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకొని సంచలనం సృష్టించింది. అలాగే ఇండియా వరకు అయితే భారీ మార్జిన్ తో షారుఖ్ ఖాన్ రికార్డులు కూడా బ్రేక్ చేసిన ఈ సినిమా ఇప్పుడు ఓటిటిలోకి వచ్చేసింది. కాగా కొన్ని రోజులు కితం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో డబ్బులు కట్టి చూసే విధంగా వచ్చింది కానీ ఫ్రీ స్ట్రీమింగ్ కోసం మాత్రం చాలా మంది ఎదురు చూసారు.

మరి ఇప్పుడు ఫైనల్ గా ఆ రోజు వచ్చేసింది. ఈ బ్లాక్ బస్టర్ హారర్ హిట్ సినిమా ఈరోజు అక్టోబర్ 10 నుంచి అదే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. సో హిందీలో రికార్డులు తిరగరాసిన ఈ చిత్రం ఎలా ఉంటుందో తెలియాలి అంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడాల్సిందే. కాగా దీనికి ముందు సినిమా అయితే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి ఉంది.
మరి థియేటర్స్ లో రికార్డ్స్ బ్రేక్ చేసిన ఈ చిత్రంలో ఓటిటిలో కూడా సంచలన వ్యూస్ తో కొత్త రికార్డులు సెట్ చేసే ఛాన్స్ కూడా ఉందని చెప్పాలి. మరి ప్రైమ్ వీడియోలో ఏ రేంజ్ రెస్పాన్స్ ని ఈ చిత్రం అందుకుంటుందో చూడాల్సిందే. ఇంకా ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని మేకర్స్ కేవలం 50 కోట్ల మేర బడ్జెట్ తోనే తెరకెక్కించగా అది ఏకంగా 860 కోట్లకి పైగా వసూళ్లు అందుకొని భారీ లాభాలు చేసింది. కాగా ఈ చిత్రంలో టాలెంటెడ్ నటుడు ఆర్ రాజ్ కుమార్ రావ్, మీర్జాపూర్ సిరీస్ ఫేమ్ పంకజ్ త్రిపాఠి నటించారు. అలాగే మిల్కీ బ్యూటీ తమన్నా ఒక సెన్సేషనల్ ఐటెం సాంగ్ ని చేసింది.


Click it and Unblock the Notifications











