OTTలోకి శ్రియారెడ్డి క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. రాధికా శరత్ కుమార్ నిర్మించిన దీన్ని ఎక్కడ చూడాలంటే?

ఈ మధ్య కాలంలో అంతా టీవీ ఛానెల్స్ కంటే ఎక్కువగా.. ఓటీటీలే చూస్తున్నారు. అదిరిపోయే సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లను చూస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా టీవీలు, సీరియల్స్ కంటే ఓటీటీల్లో వచ్చే వెబ్ సిరీస్ లు ఆసక్తికరంగా ఉంటుండడంతో.. వాటిని అర్థం చేసుకున్న చాలా మంది దర్శక, నిర్మాతలు సరికొత్త కథలతో వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తూ సక్సెస్ సాధిస్తున్నారు. ముఖ్యంగా మొదటి పార్ట్ హిట్ అయితే వాటికి వరుసగా సీక్వెల్స్ తెస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు.

అయితే ఇప్పటికే ఓటీటీలో అనేక హార్రర్, క్రైమ్, థ్రిల్లర్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు విడుదల అయి సెన్సేషన్ క్రియేట్ చేస్తుండగా.. మరో క్రేజీ వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతుంది. అయితే సలార్ సినిమాలో లేడీ విలన్ గా కనిపించి మెస్మైరైజ్ చేసిన ముద్దుగుమ్మ శ్రియారెడ్డి ప్రధాన పాత్రలో ఓ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తెరకెక్కింది. ప్రస్తుతం ఈ సిరీస్ యే విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ వెబ్ సిరీస్ ఎక్కడ, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కాబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Shreya Reddy New Crime Thriller Web Series Thalaimai Seyalagam Streaming Details Here

ఇటీవలే తెరకెక్కిన క్రేజీ క్రైమ్ వెబ్ సిరీస్ యే తలైమై సేయలగం. అయిితే కని కుశ్రుతి, కిశోర్ కుమార్ జి, శ్రియా రెడ్డిలు ప్రధాన పాత్రలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. వీరితో పాటు రమ్య నంబీషన్, వైజీ మహేంద్రన్, సంతాన భారతి, కవిత భారతి, దర్శ గుప్త, సిద్ధార్థ్ విపిన్, నిరూప్ నందకుమార్, ఆదిత్య మీనన్ లు కీలక పాత్రల్లో కనిపంచబోతున్నారు. రాడాన్ మీడియా వర్క్స్ పతాకంపై రాధికా శరత్ కుమార్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ కు జాతీయ అవార్డు గ్రహీత.. డైరెక్టర్ వసంత బాలన్ దర్శకత్వం వహించారు.

ముఖ్యంగా సీఎం అవినీతి విచారణ కేసుతో పాటు.. జార్ఖండ్ లో జరిగిన హత్య, చెన్నై శివార్లలో జరిగిన హత్యల దర్యాప్తులకు లింక్ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ కేసు మొత్తాన్ని సాల్వ్ చేసేందుకు హీరో, హీరోయిన్లు చేసే ప్రయత్నం మరింత అలరిస్తుంది. ఇలా క్రేజీ క్రైమ్ థ్రిల్లర్ తో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఇటీవలే ఈ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు.

Shreya Reddy New Crime Thriller Web Series Thalaimai Seyalagam Streaming Details Here

ట్రైలర్ తో పాటే ప్రముఖ ఓటీటీ దిగ్గజం అయిన జీ5 వేదికగా ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించారు. మే 17వ తేదీ నుంచి తెలుగుతో పాటు తమిళ భాషలో అందుబాటులో ఉండబోతున్నట్లు వివరించారు. మరో వారంలో రాబోతున్న ఈ వెబ్ సిరీస్ ను కచ్చితంగా చూడండి. అస్సలే మిస్ కాకండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X