సైలెంట్‌గా ఓటీటీలోకి సిద్ధార్ధ్ రొమాంటిక్ మూవీ .. నెల తిరక్కుండానే, ఎందులో అంటే?

సిద్ధార్ధ్ అంటే టక్కున గుర్తొచ్చేది ప్రేమ కథలే. తమిళ నటుడే అయినా తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు సిద్ధార్ధ్. బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాలతో ప్రేమ కథల స్పెషలిస్ట్‌గా ముద్ర వేసిన సిద్ధార్ధ్.. తర్వాత ఎందుకో తన జోరు తగ్గించాడు. మధ్యలో తమిళ్, హిందీల వైపు వెళ్లడంతో పాటు తెలుగులో వరుస ఫ్లాప్స్ కారణంగా టాలీవుడ్‌లో మార్కెట్‌ను కోల్పోయాడు.

హిట్టు ఫ్లాప్‌తో సంబంధం లేకుండా వినూత్నమైన కథలు చేస్తూ తన ఉనికిని చాటుకుంటున్నారు సిద్ధార్ధ్. అయితే ఏది ఏమైనా యూత్‌లో తనకు మంచి పేరు తీసుకొచ్చి హీరోగా నిలదొక్కుకునేందుకు కారణమైన ప్రేమ కథలను మాత్రం సిద్ధార్ధ్ వదిలిపెట్టలేదు. మధ్యలో ప్రేమ కథలు టచ్ చేస్తూ తానింకా పాత సిద్ధార్ధ్‌నేనని చెబుతున్నారు. దీనిలో భాగంగా ఆయన నటించిన చిత్రమే మిస్ యూ. ఇందులో సిద్ధార్ధ్ సరసన ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటించగా కరుణాకరన్, సస్తికా రాజేంద్రన్‌లు ఇతర కీలకపాత్రలు పోషించారు.

siddharth and ashika ranganath starrer Miss You now streaming in Amazon ott here s the details

మిస్ యూ చిత్రానికి ఎన్ రాజశేఖర్ దర్శకత్వం వహించగా.. గిబ్రాన్ స్వరాలు సమకూర్చారు. 7 మైల్స్ పర్ సెకండ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శామ్యూల్ మ్యాథ్యూ నిర్మాతగా వ్యవహించారు. గతేడాది డిసెంబర్ 13న విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి. తల్లిదండ్రుల్ని ఒప్పించి ఇష్టమైన అమ్మాయిని హీరో ఎలా పెళ్లి చేసుకున్నాడనేది మిస్ యూ కథ. బ్యాడ్ మ్యారేజ్, అభిప్రాయాలు కలవని జంట, కుటుంబ సంబంధాలను ఇందులో చర్చించారు.

దాదాపు రూ.10 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా టోటల్ రన్ ముగిసే సరికి రూ. 4.20 కోట్లు మాత్రమే వసూలు చేసి రూ.5 కోట్ల నష్టాలను మిగిల్చినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. విడుదలైన 8వ రోజు నుంచి మిస్ యూ కలెక్షన్స్ భారీగా పడిపోయాయి. యూత్‌కి మాత్రమే కనెక్ట్ అయ్యే ఈ చిత్రాన్ని ఫ్యామిలీ ఆడియన్స్, ఇతర వర్గాలు అంతగా పట్టించుకోలేదు. సరిగ్గా ఇదే సమయంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సునామీలో మిస్ యూ కొట్టుకుపోయింది. ఇదొక్కటే కాదు యూఐ, విడుదలై 2, మార్కో, మాక్స్ వంటి పెద్ద సినిమాలు వెంట వెంటనే రిలీజ్ కావడంతో మిస్ యూ తట్టుకోలేకపోయింది.

siddharth and ashika ranganath starrer Miss You now streaming in Amazon ott here s the details

థియేట్రికల్ బిజినెస్ పూర్తి చేసుకున్న మిస్ యూ చిత్రం ఓటీటీ రిలీజ్ గురించి పలు కథనాలు వచ్చాయి. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ని ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. తొలుత డిసెంబర్ 27న ఓటీటీలోకి వస్తుందని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో సైలెంట్‌గా మిస్ యూ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉన్నట్లు అమెజాన్ వెల్లడించింది. మరి చూద్దాం ఓటీటీలో మిస్ యూ ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో?

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X