Takkar OTT: సిద్ధార్థ్ 'టక్కర్'కి ప్లాప్ టాక్.. ఆసక్తిగా ఓటీటీ-శాటిలైట్ రైట్స్.. అప్పుడే రిలీజ్!

నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు వంటి బ్లాక్ బస్టర్ హిట్లతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో మంచి స్థానం సంపాదించుకున్న హీరో సిద్ధార్థ్. ఎన్నో ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో నటిస్తూ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.

తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు, వెబ్ సిరీసులు చేస్తూ అలరిస్తున్నాడు. ఇటీవల ఎస్కేప్ లైవ్ వంటి వెబ్ సిరీస్ తోపాటు మహా సముద్రం, ఒరేయ్ బామ్మర్ది సినిమాలతో అలరించిన సిద్ధార్థ్ తాజాగా నటించిన చిత్రం టక్కర్. ప్రస్తుతం ఈ మువీ డిజిటల్ పార్టనర్ హక్కులపై ఆసక్తిగా చర్చ నడుస్తోంది.

Siddharth Divyansha Kaushik Takkar Movie OTT And Satellite Rights

సంచలన హిట్స్: బాయ్స్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సిద్ధార్థ్ తర్వాత నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు సినిమాలతో ఎనలేని క్రేజ్ తెచ్చుకున్నాడు. తెలుగు ఇండస్ట్రీలో ఈ రెండు చిత్రాలు సంచలన హిట్స్ సాధించాయి. దీంతో స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడు సిద్ధార్థ్.

ఓటీటీలోకి ఎంట్రీ: హీరో సిద్ధార్థ్ తెలుగులో చుక్కల్లో చంద్రుడు, ఆట, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఓయ్, బావ, అనగనగా ఓ ధీరుడు, ఓ మై ఫ్రెండ్, లవ్ ఫెయిల్యూర్, జబర్దస్త్, మహాసముద్రం వంటి సినిమాలతో ఆకట్టుకున్నాడు. తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ చిత్రాలతో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు సిద్ధార్థ్. ఇటీవలే వెబ్ సిరీస్ తో ఓటీటీలోకి సైతం ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో ఫుల్ బిజీగా ఉన్నాడు.

Siddharth Divyansha Kaushik Takkar Movie OTT And Satellite Rights

తమిళ దర్శకుడితో: సిద్ధార్థ్ తాజాగా నటించిన చిత్రమే టక్కర్. తమిళ దర్శకుడు కార్తీక్ జీ క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఫ్యాషన్ స్టూడియోస్ తో కలిసి టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు.

వర్కౌట్ కానీ సీన్స్: టక్కర్ మూవీలో మజిలీ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటించింది. అభిమన్యు సింగ్, యోగి బాబు, మునిష్కాంత్, ఆర్జే విఘ్నేష్ కాంత్ కీలక పాత్రలు పోషించారు. టక్కర్ మూవీ ఎట్టకేలకు జూన్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. యాక్షన్ సీన్స్ బాగానే ఉన్న రొటీన్ గా ఉందని, ఎమోషనల్ సీన్స్, కామెడీ అంతగా వర్కౌట్ కాలేదని చెబుతున్నారు.

Siddharth Divyansha Kaushik Takkar Movie OTT And Satellite Rights

ఓటీటీ-శాటిలైట్ రైట్స్: టక్కర్ కు మిక్స్ డ్ టాక్ వస్తున్న నేపథ్యంలో ఓటీటీ రైట్స్ కీలకంగా మారాయి. టక్కర్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుందని వార్తలు వస్తున్నాయి. అలాగే శాటిలైట్ రైట్స్ ను స్టార్ నెట్ వర్క్ కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే సినిమాకు వస్తున్న రెస్పాన్స్ కారణంగా నెల కాకుముందే ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X