OTTలోకి రాబోతున్న టిల్లు స్క్వేర్.. అన్ని భాషల్లో ఆ రోజు నుంచే స్ట్రీమింగ్!

టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో సిద్ధు జొన్నలగడ్డ, క్యూట్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కాంబోలో వచ్చిన రీసెంట్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రమే టిల్లు స్క్వేర్. థియేటర్ల వద్ద బాక్సాఫీసును బద్ధలు చేసిన ఈ సినిమాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. టిల్లన్నా, టిల్లన్నా అంటూ.. చూసిన సినిమానే చాలా మంది మళ్లీ మళ్లీ చూస్తున్నారు. అలాంటి వాళ్ల కోసమే చిత్రబృందం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీని ప్రకటించింది. నెల తిరక్కముందే ఓటీటీలోకి రాబోతున్న ఈ సినిమా ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

2022లో వచ్చి సూపర్ హిట్ అయిన సినిమా 'డీజే టిల్లు'. అయితే స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ సినిమాకు సీక్వెల్‌ గా టిల్లు స్క్వేర్ ను తీసుకు వచ్చారు. అయితే ఈ సినిమాలో కూడా సిద్ధుయే హీరో. అయితే మల్లిక్ రామ్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రంలో హీరోయిన్ మాత్రం అనుపమ పరమేశ్వరన్. సితార ఎంటర్​టైన్మెంట్స్​, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంస్థలు కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ తమన్ బ్యాక్ గ్రాండ్ మ్యూజిక్ అందించారు.

Siddhu Jonnalagadda And Anupama Parameshwaran Tillu Square Movie Official OTT Streaming Date Here

అదిరిపోయే రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైరన్ గా వచ్చిన ఈ చిత్రాన్ని మార్చి 29వ తేదీన థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేశారు. అయితే సినిమా విడుదలకు ముందే నుంచే భారీ హైప్ క్రియేట్ అయిన ఈ సినిమా థియేటర్ల వద్ద కూడా సక్సెస్ అయింది. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా 9 రోజుల్లోనే వంద కోట్లకు పైగా గ్రాస్‌ను వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. మొత్తంగా రూ.125 కోట్ల వసూళ్లు రాబట్టుకుని బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే ఈ సూపర్ హిట్ సినిమా డిజిటల్ హక్కుల కోసం అనేక సంస్థలు తీవ్రంగా పోటీ పడ్డాయి.

ఇలా ప్రముఖ ఓటీటీ దిగ్గజం అయిన్ నెట్‌ఫ్లిక్స్ సంస్థ రూ. 35 కోట్లు రూపాయలు చెల్లించి మరీ ఓ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా నెట్ ఫ్లిక్స్ యే ఎక్స్ వేదికగా ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీని ప్రకటించింది. ముఖ్యంగా నెల తిరక్కముందే ఈ సినిమా ఓటీటీలోకి రాబోతున్నట్లు వివరించగా అంతా షాక్ అవుతున్నారు. ఏప్రిల్ 26వ తేదీ నుంచి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ వేదికగా విడుదల కాబోతున్నట్లు సదరు సంస్థ స్పష్టం చేసింది.

Siddhu Jonnalagadda And Anupama Parameshwaran Tillu Square Movie Official OTT Streaming Date Here

తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఏప్రిల్ 26వ తేదీ నుంచే స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వివరించింది. ఈ విషయం తెలుసుకున్న టిల్లు ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు. తమకు నచ్చిన చిత్రాన్ని మరో వారం రోజుల్లోనే ఇంట్లోనే కూర్చుని చూసేయొచ్చని అనుకుంటున్నారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, స్నేహితులతో కలిసి మరీ ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X