Tillu Sqaure: టిల్లు స్క్వేర్ రాబోయేది ఆ OTTలోకే.. ఎన్ని కోట్లకు కొనుగోలు చేసిందంటే?
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ కాంబోలో రాబోతున్న సరికొత్త చిత్రం టిల్లు స్క్వేర్. ఈ సినిమాపై ఇప్పటికే పెద్ద ఎత్తున అంచనాలు నమోదు కాగా.. ఈ చిత్రం ఓటీటీ హక్కులను రికార్డు ధరకు దక్కించుకుందో సంస్థ. మల్లిక్ రామ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా ఓటీటీ హక్కుల ధరలు చూసి అంతా షాక్ అవుతున్నారు. అయితే ఓ సంస్థ ఈ చిత్రం ఓటీటీ హక్కులను దక్కించుకుంది, ఎంతకు కొనుగోలు చేసింది వంటి వివరాలను మనం ఈ కథనంలో చూసేద్దాం.
డీజే టిల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సిద్ధు జొన్నలగడ్డ ఒక్క చిత్రంతోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తెలుగు ప్రేక్షుకలు అంతా టిల్లన్నా, టిల్లన్నా అని పిలుచుకునే స్థాయికా వచ్చేశాడు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బారీ వసూళ్లను రాబట్టడమే కాకుండా.. విపరీతమైన క్రేజ్ తెచ్చుకోవడంతో దీనికి సీక్వెల్ తీసుకురావాలని మూవీం టీం డిసైడ్ అయింది. అనుకున్నట్లుగానే దీనికి పార్ట్ 2ను తీసుకు వచ్చారు. చాలా సార్లు విడుదల చేసేందుకు ముందుకు రాగా వాయిదా పడుతూ వచ్చింది.

కానీ చివరకు మార్చి 29వ తేదీన వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల కాగా.. విశేష స్పందన వచ్చింది. కుర్రకారు మొత్తం ఈ చిత్రం గురించే మాట్లాడుకుంటున్నారు. సినిమా కచ్చితంగా చూడాలని ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఇదంతా ఇలా ఉండగా.. ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా కనిపించబోతుంది. ఎప్పుడూ లేనంతగా.. యమా హాట్ గా కనిపిస్తూ.. టిల్లు గాడితో గట్టిగా రొమాన్స్ చేసిందీ ముద్దుగుమ్మ. ట్రైలర్ చూస్తుంటేనే ఈ విషయం అర్థం అయిపోతుంది.
మల్లిక్ రామ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంస్థలు కలిసి సంయుక్తంగా సినిమాను నిర్మించాయి. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ తమన్ బ్యాక్ గ్రాండ్ మ్యూజిక్ అందిస్తున్నారు. క్రేజీ కాంబోలో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది.

ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్ టిల్లు స్క్వేర్ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఎవరూ ఊహించని స్థాయిలో రూ.35 కోట్ల రూపాయలకు ఈ చిత్రం డిజిటల్ హక్కులను కొనుగోలు చేసిందని సమాచారం. ఒ కొత్త హీరో సినిమా ఈ రేంజ్ లో అమ్ముడు పోవడంతో అంతా షాక్ అవుతున్నారు. ప్రస్తుతం నెట్టింట ఇదే చర్చ సాగుతోంది. మరి మార్చి 29న రాబోతున్న ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్టు కొడుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











