Jack Movie OTT Release : సిద్ధు జొన్నలగడ్డ జాక్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఎందులో?
స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ, సెన్సేషనల్ హీరోయిన్ వైష్ణవి చైతన్య కలిసి నటించిన రొమాంటిక్ యాక్షన్ ఫిల్మ్ 'జాక్'. 'డీజే టిల్లు' చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సిద్ధూ తాజాగా ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. ఇప్పటికే ఈ చిత్రం 100 కోట్ల లోపు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని అంటున్నారు.
ఇక ఈ మూవీ వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా ఏప్రిల్ 10న విడుదలవుతోంది. 'జాక్' ప్రమోషన్స్ ను సినిమా నిర్మాతలు, సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య ఎంతో ఎనర్జిటిక్ గా నిర్వహించారు. ఈ చిత్రంపై ఆడియెన్స్ ల్లో మంచి ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేశారు. అయితే ఈ చిత్రం ఈరోజు కాబోతుండటంతో ఫస్ట్ డే సిద్ధూ జొన్నలగడ్డ బాక్సాఫీస్ వద్ద ఎంత వసూల్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడంతో సాలిడ్ కలెక్షన్లు అందుకుంటుందని తెలుస్తోంది.

ఇంట్రెస్టింగ్ ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై హైప్ పెంచేశారు. ఇక జాక్ చిత్రం పబ్లిక్ టాక్ బాగా ఉంటే మాత్రంస సిద్ధు జొన్నలగడ్డ హవా కొనసాగినట్టే అని చెప్పొచ్చు. అయితే ఈ చిత్రం ఇవ్వాళ గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న క్రమంలో ఆడియెన్స్ ముందుగానే టికెట్లు బుక్ చేస్తున్నారు. మరోవైపు ఓటీటీ ఆడియెన్స్ కు కూడా గుడ్ న్యూస్ అందింది. ఈ సినిమా ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి వస్తుందా? అని సందేహిస్తున్న క్రమంలో అప్డేట్ అందింది.
ఈ చిత్రాన్ని సంబంధించిన ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. సిద్దూ జొన్నలగడ్డ కు ఉన్న క్రేజ్ కు మంచి రేట్ వచ్చిందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రం నాలుగు వారాల థ్రియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీలోకి విడుదల కాబోతోంది. టాక్ మంచిగా ఉంటే డేట్ ప్రకటనలో మరింత ఆలస్యం అవుతుంది. అదే క్రమంలో టాక్ దెబ్బ కొడితే ముందే వస్తుందని అంటున్నారు. ఏదేమైనా ప్రస్తుతం ఈ చిత్రం థియేట్రికల్ రన్ లో సక్సెస్ సాధించాలని సిద్ధూ అభిమానులు కోరుకుంటున్నారు.
జాక్ చిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై నిర్మించారు. రేపు గ్రాండ్ రిలీజ్ కు ఏర్పాట్లు చేశారు. విలక్ష నటుడు ప్రకాశ్ రాజ్, సినీయర్ నటుడు నరేశ్, బ్రహ్మాజీలు కీలక పాత్రల్లో అలరించబోతున్నారు. ఈ చిత్రానికి అచ్చు రాజమని, సురేశ్ బొబ్బిలి, సామ్ సీఎస్ మగ్గురు సంగీత దర్శకులు పనిచేయడం విశేషం. ఇప్పటికే రెండు పాటలు విడుదలై సంగీత ప్రియులను ఆకట్టుకున్నాయి. ఇక ఫస్ట్ డే టాక్ ను బట్టి మూవీ కలెక్షన్లు ఎలా ఉంటాయనేది ఆసక్తి కరంగా మారింది. ట్విట్టర్ రివ్యూ మాత్రం మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకుంటోంది. ఇక ఈ మూవీ కోసం సిద్ధూ జొన్నలగడ్డ రూ.10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నారని టాక్.


Click it and Unblock the Notifications











