Unstoppable 2: 'డీజే టిల్లు'కు పెద్ద అవమానం.. కంటతడి పెట్టిన బాలయ్య, ఫుల్ ఎమోషనల్ గా వీడియో
ఇప్పటి వరకు వెండితెరపై సినిమాలతో రికార్డులు క్రియేట్ చేసిన నందమూరి బాలకృష్ణ డిజిటల్ తెరపై కూడా అదరగొడుతున్నాడు. అన్‌స్టాపబుల్ టాక్ షోతో తొలిసారిగా హోస్ట్ గా మారిన బాలయ్య బాబు ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నాడు. ఇక ఇటీవల అన్‌స్టాపబుల్ రెండో సీజన్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ రెండో సీజన్ మొదటి ఎపిసోడ్ కు 24 గంటల్లోనే 10 లక్షలకుపైగ వ్యూస్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది. ఇక అన్‌స్టాపబుల్ 2 రెండో ఎపిసోడ్ కు దాస్ విశ్వక్ సేన్, డీజే టిల్లుగాడు సిద్ధు జొన్నల గడ్డ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన రెండో ప్రోమోను తాజాగా విడుదల చేశారు. పూర్తి ఎమోషనల్ గా సాగిన ఈ ప్రోమోలో బాలయ్య బాబు కంటతడి పెట్టుకున్నారు.

అన్‌స్టాపబుల్ 2 రెండో ఎపిసోడ్..
ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహా వేదికగా ప్రసారమవుతోంది అన్‌స్టాపబుల్ 2. ఈ సీజన్ కు కూడా నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఫస్ట్ ఎపిసోడ్ ఇచ్చిన ఉత్సాహంతో 2వ ఎపిసోడ్ ప్రోమోను ఇటీవల విడుదల చేసి ఆహా అనిపించారు. ఈ అన్‌స్టాపబుల్ 2 రెండో ఎపిసోడ్ లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ సందడి చేశారు.

ఎదుర్కొన్న పరిస్థితుల గురించి..
ఈ ఎపిసోడ్ ఫస్ట్ ప్రొమోలో.. ప్రస్తుతం ఉన్న హీరోల్లో తన మనసు దోచుకున్న ఇద్దరు హీరోలను పిలుస్తున్నానంటూ విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డను పిలిచాడు బాలకృష్ణ. ఇప్పుడు తాజాగా ఈ ఎపిసోడ్ రెండో ప్రోమోను విడుదల చేసింది ఆహా. ఈ ప్రోమోలో సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ తమ లైఫ్ లో ఫేస్ చేసిన పరిస్థితుల గురించి చెప్పుకొచ్చారు.

నీకు జరిగిన బిగ్ ఇన్సల్ట్..
'అమ్మా సిద్ధూ చెప్పు నీకు జరిగిన బిగ్ ఇన్సల్ట్ (పెద్ద అవమానం)' అని బాలకృష్ణ అడిగాడు. దీనికి ''నేను హీరోగా చేద్దామని అనుకుంటున్నా అని అంటే.. ఏది నీ మొహానికి ఈ మచ్చలు వేసుకుని హీరో అయిపోదామని అనుకుంటున్నావా నువ్వు..'' అని సిద్ధూ జొన్నలగడ్డ చెప్పగానే బాలయ్య బాబు మనసు చివుక్కుమంది. తర్వాత 'నాకు వస్తున్నాయి కన్నీళ్లు' అని బాలకృష్ణ బాధపడ్డారు.

మనసుకు హత్తుకున్న బాలయ్య..
సిద్దూ అలాగే చెప్పుకుంటూ పోతూ ఉంటే.. నువ్ అక్కడితో ఆపేసి ఇలా రా అమ్మా.. అని వెళ్లి సిద్ధూని మనసుకు హత్తుకున్నాడు బాలయ్య బాబు. అప్పుడు కొద్దిగా ఎమోషనల్ అయ్యాడు బాలకృష్ణ. అనంతరం బిగ్ ట్రబుల్ (పెద్ద సమస్య) చెప్పమని విశ్వక్ సేన్ ని అడిగాడు నందమూరి నటసింహం.

స్ట్రైక్ అయిపోయే సమయానికి..
''సార్.. మేము ధమ్కీ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం.. డైరెక్ట్ చేస్తున్నాం. ప్రొడ్యూసర్స్ స్ట్రైక్ ఇదంతా అయింది. ఈ స్ట్రైక్ అయిపోయే సమయానికి మా సిస్టర్ ని హాస్పిటల్ చేర్పించాల్సి వచ్చింది. ఒక ఐదు ఆరు రోజులు పరిస్థితి ఎలా ఉందంటే.. ఆస్పత్రిలో ఒకటి, రెండింటి వరకు ఉండి ఉదయం 6 గంటలకు షూటింగ్ సెట్ కి వెళ్లడం.
ఒక్కన్నే కూర్చుని ఏడ్చుకుంటూ..
సెట్ కి వెళ్లి కట్ అని చెప్పగానే.. మానిటర్ దగ్గరికి వెళ్లి ఒక్కన్నే కూర్చుని ఏడ్చుకుంటూ ఉన్నాను. అంటే నేను ఏం చేయలేని పరిస్థితి సార్ అది. డబ్బు పోతే పోయింది. సెట్ పోతే పోయింది అనుకుని అక్క ఎక్కువని అటు వెళ్లలేను'' అని విశ్వక్ సేన్ తెలిపాడు. ఇలా ఈ ప్రోమో ఆద్యంతం ఎమోషనల్ గా సాగి.. అందరిని ఎమోషనల్ చేసింది.


Click it and Unblock the Notifications











