Tillu Square OTT: బడా ఓటీటీలో టిల్లు స్క్వేర్.. వచ్చేది అన్ని రోజులకేనా!

తెలుగు సినిమా పరిశ్రమలో చాలా మంది యంగ్ హీరోలు తమదైన రీతిలో ప్రేక్షకులను అలరిస్తున్నారు. కానీ, వారిలో కొందరు మాత్రమే స్పెషల్‌గా ఫోకస్ అవుతూ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంటున్నారు. అందులో సిద్దు జొన్నలగడ్డ ఒకడు. 'డీజే టిల్లు'తో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న అతడు.. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా 'టిల్లు స్క్వేర్' మూవీని చేశాడు.

మల్లిక్ రామ్ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ నటించిన సినిమానే 'టిల్లు స్క్వేర్'. మొదటి పార్టులో రాధిక అనే అమ్మాయి వల్ల మోసపోయిన హీరోకు.. ఇప్పుడు మళ్లీ మరో లేడీ వల్ల ఇబ్బంది ఎదురు కావడం అనే కథాంశంతో ఈ మూవీ రూపొందింది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

Siddu Jonnalagadda Starrer Tillu Square Movie Digital Streaming Details

సిద్దు జొన్నలగడ్డ నటించిన 'టిల్లు స్క్వేర్' సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి గత రాత్రి ప్రదర్శించిన ప్రీమియర్స్ నుంచి డీసెంట్ టాక్ వచ్చింది. మరి ఇదే కంటిన్యూ అవుతుందో లేదో ఆసక్తికరంగా మారింది. బుకింగ్స్ మాత్రం అదిరిపోయేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా 'టిల్లు స్క్వేర్' మూవీ ఓటీటీ వివరాలు బయటకు వచ్చేశాయి.

'టిల్లు స్క్వేర్' సినిమా సందడి ఇప్పటికే థియేటర్లలో రన్ అవుతుండగా.. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలు తాజాగా రివీల్ అయ్యాయి. దీని ప్రకారం.. ఈ సినిమాను తీవ్ర పోటీ నడుమ నెట్‌ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని సినిమా టైటిల్ కార్డులో రివీల్ చేశారు. ఇక, ఈ హక్కుల కోసం సదరు సంస్థ చిత్ర నిర్మాతలకు రూ. 35 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది.

Siddu Jonnalagadda Starrer Tillu Square Movie Digital Streaming Details

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ నటించిన 'టిల్లు స్క్వేర్' సినిమాను థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నెట్‌ఫ్లిక్స్ సంస్థతో నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని కూడా ఓ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. అంటే మార్చి 29వ తేదీన విడుదలైన ఈ చిత్రం మే మొదటి వారంలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పుకోవచ్చు.

ఇదిలా ఉండగా.. 'టిల్లు స్క్వేర్' మూవీలో సిద్దుకు జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. ఈ మూవీని ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు. శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియాల ఈ మూవీకి సాంగ్స్ కంపోజ్ చేయగా.. థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X