ఓటీటీలోకి వచ్చేసిన టిల్లు స్క్వేర్.. థియేటర్లలో చూపించని ఆ సీన్స్ కూడా కలిపి మరీ!

తెలుగు చిత్ర పరిశ్రమలో కామెడీ బ్యాగ్‌డ్రాప్‌లో వచ్చే చిత్రాలు కుప్పలు కుప్పలుగా వస్తున్నాయి. అయితే, వీటిలో కొన్నింటికి రొమాంటిక్ యాంగిల్ జోడించడంతో అవి సక్సెస్ అవుతున్నాయి. అలా సిద్దు జొన్నలగడ్డ హీరోగా కొన్నేళ్ల క్రితం వచ్చిన చిత్రమే 'డీజే టిల్లు'. సెన్సేషనల్ హిట్ అయిన ఈ మూవీకి సీక్వెల్‌గా 'టిల్లు స్క్వేర్' అనే సినిమాను తీసిన విషయం తెలిసిందే.

మల్లిక్ రామ్ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన చిత్రమే 'టిల్లు స్క్వేర్'. క్రేజీ హిట్‌కు సీక్వెల్ కావడంతో పాటు ఈ మూవీ నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు మెప్పించడంతో దీనిపై భారీ స్థాయిలో హైప్ క్రియేట్ అయింది. అందుకు తగ్గట్లుగానే 'టిల్లు స్క్వేర్' సినిమాను ప్రపంచ వ్యాప్తంగా మార్చి 29వ తేదీన ఎంతో గ్రాండ్‌గా ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చారు.

Siddu Jonnalagadda Tillu Square Movie Digital Streaming Started On Netflix

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ నటించిన 'టిల్లు స్క్వేర్' మూవీకి ప్రీమియర్స్ నుంచే మంచి టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాకు మొదటి రోజు నుంచే ప్రేక్షకుల స్పందన లభించింది. ఫలితంగా ఈ చిత్రానికి భారీ స్థాయిలో స్పందన కూడా వచ్చింది. ఇలా ఈ చిత్రం ఫుల్ రన్‌లో రూ. 130 కోట్లు వరకూ గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. తద్వారా ఎన్నో రికార్డులు కొట్టింది.

ఆరంభంలోనే అంచనాలను ఏర్పరచుకున్న 'టిల్లు స్క్వేర్' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను తీవ్ర పోటీ ఏర్పడింది. దీంతో నెట్‌ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది. ఇక, ఈ హక్కుల కోసం సదరు సంస్థ చిత్ర నిర్మాతలకు రూ. 35 కోట్లు చెల్లించినట్లు తెలిసింది. ఆ తర్వాత ఈ చిత్రం స్ట్రీమింగ్ గురించి ఎన్నో రకాల ప్రచారాలు కూడా జరిగిన సంగతి తెలిసిందే.

Siddu Jonnalagadda Tillu Square Movie Digital Streaming Started On Netflix

సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన 'టిల్లు స్క్వేర్' సినిమాను నెట్‌ఫ్లిక్స్ సంస్థ గత అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్‌కు తీసుకు వచ్చేసింది. ఏకంగా దీన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో అందుబాటులోకి తెచ్చింది. అంతేకాదు, సెన్సార్ వల్ల థియేటర్లలో చూపించని కొంత కొత్త కంటెంట్‌ను కూడా ఇందులో యాడ్ చేసినట్లు తాజాగా తెలిసింది. దీంతో ఈ చిత్రానికి ఓటీటీలో కూడా మంచి స్పందన లభిస్తోంది.

ఇదిలా ఉండగా.. 'టిల్లు స్క్వేర్' మూవీలో సిద్దుకు జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఈ మూవీని ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు. అచ్చు, రామ్ మిరియాల ఈ మూవీకి సాంగ్స్ కంపోజ్ చేయగా.. భీమ్స్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించాడు. ఇందులో నేహా శెట్టి, ప్రిన్స్, మురళీధర్ కీలక పాత్రల్లో నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X