Unstoppable 2: సినిమాకో గర్ల్ ఫ్రెండ్.. మనస్ఫూర్తిగా ముగ్గురే.. బాలయ్యతో నిజం చెప్పిన హీరో

సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే నందమూరి నటసింహం బాలకృష్ణ డిజిటల్ తెరపై కూడా అదరగొడుతున్నాడు. సూపర్ సక్సెస్ అయిన టాక్ షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకేకు కొనసాగింపుగా సీజన్ 2ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండో సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ ను ఏపీ రాజకీయాల్లో కీలక వ్యక్తి అయిన నారా చంద్రబాబుతో ప్రారంభించిన వ్యూస్ పరంగా రికార్డ్ నెలకొల్పారు. ఇక ఇప్పుడు తాజాగా రెండో ఎపిసోడ్ పూర్తిగా వచ్చేసింది. ఈ రెండో ఎపిసోడ్ లో ఇద్దరు యంగ్ హీరోలో పార్టిస్ పేట్ చేసి అన్‌స్టాపబుల్ 2 సీజన్ జోష్ ను కొనసాగించారు. బ్రేకప్ లు, రొమాంటిక్ సీన్లు, క్రష్ లు అంటూ సాగిన ఈ ఎపిసోడ్ వివరాల్లోకి వెళదామా!

 చూస్తుంటే నా కుర్రతనం గుర్తొస్తుంటుంది..

చూస్తుంటే నా కుర్రతనం గుర్తొస్తుంటుంది..

ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహా వేదికగా నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా అన్‌స్టాపబుల్ రెండో సీజన్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ అన్‌స్టాపబుల్ 2 రెండో ఎపిసోడ్ లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ సందడి చేశారు. ఇండస్ట్రీలో చాలామంది కుర్రాళ్లను చూస్తుంటాను. వారిని చూస్తుంటే నా కుర్రతనం గుర్తు వస్తుంటుంది. అంతమంది కుర్రాళ్లలో నా మనసు దోచుకున్న వాళ్లను మీ ముందుకు తీసుకొస్తున్నాను అంటూ వారిద్దరిని ఆహ్వానించాడు బాలయ్య బాబు.

మీ ఫ్యాన్స్ వచ్చి కొట్టేట్టయితే..

మీ ఫ్యాన్స్ వచ్చి కొట్టేట్టయితే..

నా సినిమాలలో సమర సింహారెడ్డి, నరసింహా నాయుడు సినిమాలు చేస్తారా అని బాలకృష్ణ అడగ్గా.. నరసింహా నాయుడు నేను చేస్తా అని సిద్ధు జొన్నలగడ్డ చెప్పాడు. ఫ్యూచర్ లో సినిమాలు చేయొద్దు అనుకున్నప్పుడు మీ సినిమాలు చేస్తాం సార్.. ఎందుకంటే మీ ఫ్యాన్స్ వచ్చి కొట్టేట్టయితే అని విశ్వక్ సేన్ తెలిపాడు. ఆ సినిమాల్లో మీరు గెస్ట్ గా వచ్చారంటే ఇక సేఫ్ సార్ అని సిద్ధూ అన్నాడు.

 మీ సినిమాలు నేను చేయగలనా..

మీ సినిమాలు నేను చేయగలనా..

దీనికి అంటే నా పేరు పెట్టుకుని మీరు కలెక్షన్లు కొట్టేద్దామని బాలయ్య అంటే అవును సార్ అని ఇద్దరు చెప్పారు. తర్వాత మరి మీ సినిమాలు నేను చేయగలనా అని బాలకృష్ణ అడిగిన ప్రశ్నకు.. మీరు చేయగలరనే క్వశ్చనే లేదు సార్ అసలు.. కానీ మీ లెవెల్ కి ఆ సినిమాలు సరిపోతాయా అనేది తెలియదని సిద్ధు అంటే అవును సార్ అని విశ్వక్ చెప్పాడు. దీంతో బాబు స్పిన్ వేయకండి స్పిన్ వేయకండి అని బాలకృష్ణ నవ్వించాడు.

ఏమాత్రం మొహమాటపడకుండా..

ఏమాత్రం మొహమాటపడకుండా..

తర్వాత సిద్ధూ జొన్నలగడ్డ గుంటూరు టాకీస్ మూవీ గురించి చెబుతూ బాలయ్య బాబు.. నాకు ఆ సినిమా ఎందుకు గుర్తుందో తెలుసా.. ఏమాత్రం మొహమాటపడకుండా బాగా రొమాంటిక్ గా చేశావ్ అని మళ్లీ నవ్వించాడు బాలకృష్ణ. తర్వాత రొమాన్స్ గిమాన్స్ తో మనకు ఎక్కువ పనిలేదుగా.. ఎప్పుడూ కత్తులు పట్టుకుని పరిగెత్తడమే అని విశ్వక్ సేన్ ను అంటే.. నాకు ఇష్టం కూడా అబ్బాయిలే సార్.. వాళ్లే లాయల్ గా ఉంటారు. అమ్మాయిలు ప్లేట్ మార్చేస్తుంటారు సార్.. అబ్బాయిలు అట్లా కాదు సార్.. జెన్యూన్ అని విశ్వక్ సమాధానం ఇస్తాడు.

ఎక్కువ వాళ్లతోనే..

ఎక్కువ వాళ్లతోనే..

దీంతో బ్రేకప్ ఏమైనా అయిందా ఈ మధ్య అని బాలయ్య అడుగుతాడు. లేదు సార్ సినిమా ప్లాప్ అయిన మనోడు హిట్ కొడతాడు అని లాయలిటీగా ఉంటారు సార్. అందుకే ఎక్కువ వాళ్లతోనే ఉంటాయి అని విశ్వక్ అంటాడు. మధ్యలో కల్పించుకున్న సిద్ధూ జొన్నలగడ్డ.. మేన్ ఆర్ నాట్ కాంప్లికేట్ సార్.. సింపుల్ గా ఉంటారు అని చెబుతాడు. అమ్మాయిలు మాట్లాడితేనే వంద అర్థాలు ఉంటాయి సార్.. మాట్లాడకుంటే అబ్బో.. అని చెబుతాడు.

 రిలేషన్ షిప్ అన్నాక బ్రేకప్ లు కామన్..

రిలేషన్ షిప్ అన్నాక బ్రేకప్ లు కామన్..

అందుకే వాళ్లు ఇచ్చే ట్విస్ట్ లకు మనం టేయిల్ ఊపుకుంటూ వెళతాం అని బాలయ్య అంటాడు. దీంతో ఆ బ్రేకప్ క్వశ్చన్ ఈయనకు కూడా వర్తిస్తది సార్ అడగండి అని విశ్వక్ చెప్పడంతో బాలకృష్ణ అడుగుతాడు. రిలేషన్ షిప్ అన్నాక బ్రేకప్ లు అవుతుంటాయి కదా సార్ అని సిద్ధూ అంటాడు. దీంతో ఎన్ని అయ్యాయని బాలయ్య అడగ్గా.. మనస్ఫూర్తిగా మూడు సార్ అని సిద్ధు చెబుతాడు.

సినిమాకో గర్ల్ ఫ్రెండ్ ని మార్చేశావ్..

సినిమాకో గర్ల్ ఫ్రెండ్ ని మార్చేశావ్..

అంటే సినిమాకో గర్ల్ ఫ్రెండ్ ని మార్చేశావ్ అని బాలకృష్ణ నవ్వించాడు. సినిమాకో గర్ల్ ఫ్రెండ్ కాదు సార్.. కానీ, రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు, డిఫరెంట్ పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాటి ప్రభావం సినమాపై పడుతుంది కదా సార్. ఇక నేనే రాసుకునే వాన్నికాబట్టి.. నా జీవితంలో జరిగినవే రాసేవాన్ని అని సిద్ధు వివరణ ఇచ్చాడు. అరేయి రాసుకోర మార్కస్ అని బాలయ్య బాబు నవ్వించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X