OTTలోకి అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్.. సిద్దార్థ్ మల్హోత్రా సూపర్ మూవీని ఎక్కడ చూడాలంటే?
రోజురోజుకూ ఓటీటీల హవా పెరిగిపోతుంది. అనేక మంది అద్భుతమైన సినిమాలను ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి కూర్చుని చూసేందుకు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. ఓ నెల రోజులు ఆలస్యం అయినా ఫర్వాలేదనుకుంటూ ఓటీటీల్లో చూస్తూ రచ్చ చేస్తున్నారు. అలాగే పలు ఓటీటీ సంస్థల యాజమాన్యాలు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుని చిన్న, పెద్ద అనే తేడా లేకుండా నెల రోజులు కూడా తిరక్కముందే ఓటీటీలో విడుదల చేస్తూ ఓటీటీ ప్రియులకు ట్రీట్ ఇస్తున్నారు. అయితే తాజాగా ఓ అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్ మూవీ సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చింది. ఆ సినిమా ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
హిందీ భాషలో విడుదల అయిన సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీయే యోధ. సాగర్ అంబ్రే, పుష్కర్ ఓజా రచన మరియు దర్శకత్వం వహించిన ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హిరూ యష్ జోహార్, కరణ్ జోహార్ మరియు అపూర్వ మెహతా నిర్మించారు. అలాగే సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా చేయగా.. రాశీ ఖన్నా, దిశా పటానీలు హీరోయిన్లుగా నటించి మెప్పించారు. అలాగే రోనిత్ రాయ్, తనజ్ విర్వానీ, సన్నీ హిందూజా, ఎస్ఎం జహీర్, సంజయ్ గుర్బక్సానీ, మిఖాయిల్ యావల్కర్, కత్వాల్, చిత్రాంజన్ త్రిపాఠిలు ప్రధాన పాత్రల్లో కనిపించారు.

2024 మార్చి 15వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయిన ఈ సినిమాకు పాజిటివ్ టాకే వచ్చింది. కానీ ఎక్కువగా ఆడలకేపోయింది. మొత్తం రూ.55 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రూ.32.45 కోట్ల లూళ్లును రాబట్టుకుంది. అయితే థియేటర్లలో విడదుల అయిన నెల రోజులు కూడా కాకముందే ఈ సినిమా ఓటీటీలోకి వ్చేసింది. ఆ విషయం తెలుసుకున్న ప్రతీ ఒక్కరూ షాక్ అవుతున్నారు. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుంటున్నారు.
ప్రస్తుతం సిద్దార్థ్ మల్హోత్రా, రాశీ ఖన్నాలు హీరోహీరోయిన్లుగా నటించి ఈ యోధ సినిమా.. ప్రముఖ ఓటీటీ దిగ్గజం అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. అలా అందరూ ఈ సినిమా చూసేయొచ్చు అనుకుంటున్నారేమో. ఓ కండీషన్ కూడా పెట్టిందీ సంస్థ. డబ్బులు చెల్లించి మాత్రమే యోధ చిత్రాన్ని వీక్షించవచ్చు. కేవలం రెంటల్ విధానంలో మాత్రమే అందుబాటులో ఉందీ చిత్రం. చాలా కాలంగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఇలాగే చేస్తోంది. ముందుగా పలు సినిమాలను రెంటల్ విధానంలో విడుదల చేసి ఆ తర్వాత ఫ్రీగా స్ట్రీమింగ్ చేస్తోంది.
డబ్బులు చెల్లించి చూడాలనుకున్న వారు ఇప్పుడే చూసే అవకాశం ఇవ్వగా.. కాస్త ఆలస్యమైన ఫర్వాలేదు అనుకునే వాళ్లు మరికొంత కాలం ఆగాల్సిందే. ఎప్పుడైనా సరే.. అదిరిపోయే యాక్షన్ సన్నివేషాలు ఉన్న ఈ చిత్రాన్ని ఫ్యామిలీతో కలిసి ఇంట్లోనే కూర్చుని ఈ సినిమాను చూసేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











