Sikandar: ఓటీటీలోకి 200 కోట్ల యాక్షన్ థ్రిల్లర్.. సల్మాన్ మూవీ ఏ ఓటీటీలో?.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమాలు ఇండస్ట్రీ హిట్స్‌గా నిలవడంతో పాటు సల్మాన్ కెరీర్‌ను తిరిగి నిలబెట్టాయి. తాజాగా వీరిద్దరి కాంబోలో వచ్చిన చిత్రమే సికందర్. రష్మిక మందన్న, కాజల్ అగర్వాల్ కీలకపాత్రలు పోషించారు. సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్, సాజిద్ నడియావాలా గ్రాండ్ సన్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించిన సికందర్ మూవీ రంజాన్ కానుకగా మార్చి 30వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చింది.
సికందర్ బడ్జెట్ ఎంత (Sikandar Budget)?
ఈ చిత్రంలో సత్యరాజ్, శర్మాన్ జోషి, ప్రతీక్ బబ్బర్, జతిన్ శర్మ తదితరులు కీలకపాత్ర పోషించారు. ప్రీతమ్ స్వరాలు సమకూర్చగా.. సంతోష్ నారాయణన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. తిరు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో పాటు సల్మాన్ ఖాన్‌కు ఉన్న భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా ఈ సినిమాను భారీ సెట్స్ వేసి, విదేశాల్లో కూడా చిత్రీకరించారు. దాంతో సికందర్‌ను సుమారుగా 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత (Sikandar Break Even Target)?
సల్మాన్ - మురగదాస్ క్రేజ్, ప్రచార కార్యక్రమాలు, టీజర్, ట్రైలర్లతో సికందర్ ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్‌కు భారీ రేటు పలికింది. దాంతో ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ బాక్సాఫీస్ వద్ద సులభమైంది. సికందర్ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను సుమారుగా 100 కోట్ల రూపాయల నెట్, 200 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లుగా నిర్దేశించారు ట్రేడ్ పండితులు.
సికందర్ కలెక్షన్లు (Sikandar Collections)
సల్మాన్ క్రేజ్ దృష్ట్యా తొలి రోజు ఈ సినిమా రూ.30 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టింది. మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ తొలి వారం రోజుల్లోనే ఈ సినిమాకు రూ.115 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. రెండో వారం 17.55 కోట్ల నెట్, మూడో వారం రూ.2.1 కోట్ల నెట్ చొప్పున థియేట్రికల్ రన్ ముగిసేసరికి ఇండియాలో రూ.110.36 కోట్ల నెట్, రూ.130.89 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాడు సల్మాన్ ఖాన్. అయితే ఓవర్సీస్‌లో మాత్రం సికందర్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేసింది.
బాలీవుడ్ సినిమాలకు బేస్‌గా నిలిచే ఓవర్సీస్‌లో సికందర్ తన లాంగ్ రన్‌లో రూ.54 కోట్ల కలెక్షన్స్ అందుకుంది. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి సికందర్ ప్రపంచవ్యాప్తంగా 184.89 కోట్ల వసూళ్లు రాబట్టింది. అయితే బాలీవుడ్ వర్గాలు, ట్రేడ్ పండితులు మాత్రం 33 రోజుల థియేట్రికల్ రన్ ముగిసేసరికి సికందర్ భారత్‌లో రూ.129.95 కోట్ల నెట్, రూ.153.34 కోట్ల గ్రాస్, ఓవర్సీస్‌లో రూ.58 కోట్లు చొప్పున ప్రపంచవ్యాప్తంగా రూ.211.34 కోట్ల వసూళ్లతో థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ చేసినట్లుగా అంచనా వేశారు.
సికందర్ ఓటీటీ వివరాలు ( Sikandar OTT Release)
సికందర్‌ను ఎప్పుడెప్పుడు ఓటీటీలో చూస్తామా అని సల్మాన్ ఖాన్ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. దాదాపు 2 నెలల నిరీక్షణకు తెరదించుతూ సికందర్ ఓటీటీ రిలీజ్‌పై మేకర్స్ ప్రకటన చేశారు. సికందర్ డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మే 25 నుంచి హిందీ, అరబిక్, జులు భాషల్లో సికందర్ స్ట్రీమింగ్‌లో అందుబాటులో ఉంటుందని నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. మరి ఓటీటీలో సల్మాన్ ఖాన్ చిత్రం ఎలాంటి మేజిక్ చేస్తుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











