Sarkaaru Noukari: OTTలోకి సింగర్ సునీత కొడుకు సినిమా.. ఎక్కడ, ఎప్పటి నుంచి చూడాలంటే?
టాలీవుడ్ టాప్ సింగర్ లలో ఒకరైన సింగర్ సునీత గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన పాటలు అంతకు మించిన అందాలతో రచ్చ చేసే ఈ ముద్దుగుమ్మ మూడేళ్ల క్రితమే రెండో పెళ్లి చేసుకుంది. ముఖ్యంగా ఈమె పిల్లలే దగ్గర ఉండి ఆమె పెళ్లి చేయడం మరింత హైలెట్ గా నిలిచింది. పెళ్లీడుకు వచ్చిన పిల్లలు ఉన్న ఆమె పెళ్లి చేసుకునేందుకు ఎంతగానో ప్రోత్సహించిన ఆమె పిల్లల్లో పెద్దవాడు ఆకాష్ గోపరాజు. అయితే మెంటల్లీ ఎంతో స్ట్రాంగ్ గా ఉండే ఈయన తాజాగా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
ముఖ్యంగా సర్కారు నౌకరి అనే సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టబోతున్నాడు. ఆర్కే టెలీ షో బ్యానర్‌పై కె. రాఘవేంద్రరావు నిర్మించిన ఈ సినిమాకు గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఆకాశ్ సరసన భావన వళపండల్ హీరోయిన్ గా నటించబోతుంది. అలాగే తనికెళ్ల భరణి, సూర్య ప్రధాన పాత్రల్లో నటించబోతున్నారు. అద్భుతమైన కథాంశంతో రాబోతున్న ఈ సినిమాను న్యూ ఇయర్ సందర్భంగా జనవరి ఒకటో తేదీన విడుదల చేయబోతున్నారు. సర్కారు నౌకరి.. టైటిల్ పేరే కొత్తగా ఉండడంతో చాలా మంది ఈ సినిమా ఎలా ఉంటుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ముఖ్యంగా ఏ డాది ఆగస్టు 5వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. ఇటీవలే అంటే డిసెంబర్ 20వ తేదీన సర్కారు నౌకరి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఆద్యంతం ఆకట్టుకునేలా ఉన్న ఈ ట్రైలర్ కు విశేష స్పందన లభించింది. మరి మరో రెండ్రోజుల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. సినిమా విడుదల కాకముందే ఈ చిత్రానికి సంబంధించిన డిజటల్ రైట్స్ ను ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ సొంతం చేసుకుంది. అయితే ఆ సంస్థ ఏది, ఎప్పుటి నుంచి ఓటీటీ వేధికగా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన ఈటీవీ విన్.. సర్కారు నౌకరి సినిమా డిజిటల హక్కులను దక్కించుకుంది. అయితే సింగర్ సునీతకు ఈటీవీతో ఉన్న ప్రత్యేక బంధంతోనే ఈ సినిమా హక్కులను వాళ్లు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ సినిమా విడుదల అయి పాజిటివ్ టాక్ వచ్చి హిట్టు దిశగా దూసుకెళ్లే 45 రోజుల తర్వాత ఓటీటీలోకి వస్తుంది. లేదంటే మాత్రం నెల రోజులు కూడా కాకముందే అంటే జనవరి లాస్ట్ వీక్ లోనే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లోనే స్ట్రీమింగ్ అవుతుంద. చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది.


Click it and Unblock the Notifications











