Single OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి శ్రీవిష్ణు రొమాంటిక్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీవిష్ణు నుంచి సినిమా వస్తుందంటే ఖచ్చితంగా అందులో ఏదో ఒక స్పెషాలిటీ ఉందని అభిమానులు అనుకుంటారు. అందుకు తగినట్లుగానే విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తుంటారు శ్రీవిష్ణు. రీసెంట్‌గా ఆయన నటించిన చిత్రం సింగిల్. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కార్తీక్ రాజు దర్శకత్వంలో సింగిల్ మూవీ తెరకెక్కింది. చిన్న సినిమాగా వచ్చిన సింగిల్ భారీ వసూళ్లతో నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది. తాజాగా సింగిల్ చిత్రం సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చి షాకిచ్చింది. ఈ వివరాల్లోకి వెళితే.

గీతా ఆర్ట్స్, కళ్యాణ్ ఫిల్మ్స్ పతాకాలపై విద్య కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరిలు సంయుక్తంగా సింగిల్ చిత్రాన్ని నిర్మించారు. శ్రీవిష్ణు సరసన కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించగా వెన్నెల కిషోర్, వీటీవీ గణేష్, కల్పలత, రాజేంద్రప్రసాద్ తదితరులు కీలకపాత్ర పోషించారు. టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కార్యక్రమాలతో మంచి బజ్ సాధించిన సింగిల్‌కు అదిరిపోయేలా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

Single OTT Release Sree Vishnu s Movie Now Streaming on this OTT Platform

సింగిల్ బడ్జెట్, బిజినెస్ & బ్రేక్ ఈవెన్ టార్గెట్
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి సింగిల్ చిత్రానికి సుమారుగా 15 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయం అయ్యింది. శ్రీవిష్ణు గత సినిమాల రిజల్ట్, యూత్‌లో ఆయనకున్న క్రేజ్‌తో సింగిల్ సినిమాకు దాదాపు 7 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా ఫిలింనగర్ వర్గాలు తెలిపాయి. సింగిల్ చిత్రం లాభాల్లోకి రావాలంటే రూ.8 కోట్ల షేర్.. రూ.16 కోట్ల గ్రాస్ వసూలు చేయాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. మే 9న సుమారుగా తెలుగు రాష్ట్రాల్లో 400 స్క్రీన్లలో, ప్రపంచవ్యాప్తంగా 700 స్క్రీన్లలో సింగిల్ సినిమాను రిలీజ్ చేశారు.

సింగిల్ కలెక్షన్స్
సింగిల్ మూవీకి తొలి రోజు ఇండియాలో రూ.2.5 కోట్లు, రెండవ రోజు రూ.3.5 కోట్ల నెట్, మూడో రోజు రూ.3.55 కోట్ల నెట్, నాలుగో రోజు రూ.1.7 కోట్లు, ఐదో రోజు రూ.1.58 కోట్లు, ఆరో రోజు రూ.1.17 కోట్లు, ఏడో రోజు రూ.1.1 కోట్లు, ఎనిమిదో రోజు రూ.1.32 కోట్లు, తొమ్మిదో రోజు రూ.1.83 కోట్లు, పదవ రోజున రూ.2.09 కోట్లు, పదకొండవ రోజున రూ.77 లక్షలు, పన్నెండవ రోజున రూ.55 లక్షలు, పదమూడవ రోజున రూ.47 లక్షలు, పద్నాలుగవ రోజున రూ.39 లక్షలు, పదిహేనవ రోజున రూ.34 లక్షలు , పదహారో రోజున రూ.59 లక్షలు, పదిహేడవ రోజున రూ.64 లక్షలు, పద్దెనిమిదవ రోజున రూ.32 లక్షలు చొప్పున 28 రోజుల వరకు ఇండియాలో రూ.26.16 కోట్ల నెట్, రూ.30.53కోట్ల గ్రాస్ రాబట్టినట్లు సాక్‌నిల్క్ తెలిపింది.

తెలుగు రాష్ట్రాలతో సమానంగా ఓవర్సీస్‌లోనూ ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి స్పందన లభించింది. అక్కడ దాదాపు రూ.4.20 కోట్ల వరకు సింగిల్ మూవీ వసూళ్లు రాబట్టినట్లు సాక్‌నిల్క్ తెలిపింది. ఇండియాలో వచ్చిన గ్రాస్ 30.53 కోట్లు + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి సింగిల్ మూవీకి ప్రపంచవ్యాప్తంగా రూ.34.83 కోట్ల వసూళ్లు ఆర్జించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

సింగిల్ ఏ ఓటీటీలో అంటే?
థియేటర్‌లో నవ్వులు పూయించిన సింగిల్ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని శ్రీవిష్ణు అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ సంస్ధ అమెజాన్ ప్రైమ్ వీడియో ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుంది. అయితే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సింగిల్ మూవీ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్‌లో సంచలన విజయం సాధించిన సింగిల్ మూవీ థియేటర్‌లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.

More from Filmibeat

Read more about: single sree vishnu ketika sharma
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X