Sita Ramam Hindi OTT: ఓటీటీలో సీతా రామం హిందీ వెర్షన్.. ఎప్పుడు? ఎక్కడంటే?
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటి మృణాల్ ఠాకూర్ కాంబినేషన్‌లో హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన క్లాసికల్ లవ్ స్టోరీ.. సీతా రామం. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం ఆగస్టు 5న థియేటర్లలో ప్రేక్షకుల బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. హృద్యమైన ప్రేమ కథ, అద్భుతమైన నటన, శ్రావ్యమైన సంగీతం కలబోతతో అందమైన ప్రేమకావ్యంగా ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించింది సీతా రామం. అలాగే హిందీలో కూడా విమర్శల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ మూవీ హిందీ వెర్షన్ ను ఓటీటీలో విడుదల చేయనున్నారు.

యుద్ధంతో రాసిన ప్రేమకథగా..
అందమైన ప్రేమ కావ్యంగా బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన చిత్రం సీతా రామం. యుద్ధంతో రాసిన ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటి మృణాల్ ఠాకూర్ రామ్ అండ్ సీతగా తెలుగు ప్రేక్షకుల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. ఇక కీలక పాత్ర పోషించిన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మంచి పేరు సంపాదించుకుంది. ప్రేమకు పురాణాల టచ్ ఇచ్చే దర్శకుడు హను రాఘవపూడి టేకింగ్ అద్భుతంగా ఉందని విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా దక్కాయి. సినిమా ఘన విజయం సాధించడంతో హిందీలో కూడా విడుదల చేశారు.

భాషా పరమైన అడ్డంకులు అధిగమించి..
సెప్టెంబర్ 2న హిందీ వెర్షన్ లో థియేటర్లలో విడుదలైన సీతా రామం చిత్రం అక్కడ కూడా సూపర్బ్ రెస్పాన్స్ అందుకుంది. హిందీలో సైతం పాజిటివ్ మౌత్ టాక్ తో దూసుకుపోయింది. భాషా పరమైన అడ్డంకులు అధిగమించి.. ఎల్లలు దాటిన ప్రేమ కథగా నిలిచింది సీతా రామం. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రం బంపర్ హిట్‌గా దూసుకుపోయింది. హిందీలో కూడా హిట్ టాక్ సొంతం కాగా రిలీజైన ప్రతి భాషలో సూపర్‌హిట్ అయినా సినిమాగా రికార్డుకెక్కింది. ఇక ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూశారు. వారి ఆసక్తిని అర్థం చేసుకున్న చిత్రబృందం సెప్టెంబర్ 9న అంటే విడుదలకు నెల తర్వాత ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ చేసింది.
హిందీ వెర్షన్ ఓటీటీ రిలీజ్ డేట్..
సెప్టెంబర్ 9న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో సీతా రామం తెలుగు వెర్షన్ విడుదలైంది. ఓటీటీలో కూడా అత్యధిక వ్యూస్ సాధించింది ఈ అందమైన ప్రేమకావ్యం. అయితే హిందీలో మాత్రం ఇప్పటివరకు ఓటీటీలో రిలీజ్ కాలేదు. హిందీ ప్రేక్షకులు కూడా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సీతా రామం హిందీ వెర్షన్ ఓటీటీ రిలీజ్ డేట్ ను ప్రకటించింది మూవీ టీమ్. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో నవంబర్ 18 నుంచి సీతా రామం సినిమా స్ట్రీమింగ్ కానుంది. మరి హిందీ ఓటీటీ ప్రేక్షకులు ఈ సినిమాను ఎలా ఆదరిస్తారో, ఎలాంటి వ్యూస్ సాధిస్తుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











