OTTలోకి బ్లాక్ బస్టర్ గ్రహంతరవాసి సినిమా - యాక్షన్, కామెడీ సూపర్!
ఓటీటీలోకి సినీ ప్రేక్షకులను అలరించేందుకు మరో కొత్త సినిమా రెడీ అయిపోయింది. అది ఇప్పటికే థియేటర్లలో విడుదలై మంచి హిట్ టాక్‌ను తెచ్చుకుంది. సంక్రాంతి పండగ బరిలో దిగి మంచి వసూళ్లను సాధించింది. సైన్స్ ఫిక్షన్ గ్రహాంతర వాసి బ్యాక్‌డ్రాప్‌తో కామెడీ జోడించి ఆడియెన్స్‌ను బాగా నవ్వులు పూయించింది. ఇప్పుడా చిత్రమే పలు అడ్డంకులను దాటి ఎట్టకేలకు ఓటీటీలోకి తెలుగు వెర్షన్లో రాబోతుంది. మరి ఇంతకీ ఆ చిత్రం ఏంటి? ఎందులో స్ట్రీమింగ్ కానుంది? ఎప్పటి నుంచి అందుబాటులో ఉండనుంది పూర్తి వివరాలను స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం..
పైన్ చెప్పుకున్న సినిమా ఏంటంటే అయలాన్. ఈ ఏడాది కోలీవుడ్ ఇండస్ట్రీలో సంక్రాంతి పండగకు థియేటర్లలో విడుదలై బ్లాక్‌బస్టర్ టాక్‌ను దక్కించుకుంది. అయితే ఈ ముగ్గుల పండక్కి మన దగ్గర భారీ సినిమాల పోటీ ఉండడంతో అయలాన్ వెనక్కి తగ్గి కేవలం కోలీవుడ్‌లోనే రిలీజైంది. ఇందులో నటుడు శివ కార్తికేయన్ హీరోగా నటించి ఆకట్టుకున్నారు. అసలే ఈయన చిత్రాలకు మంచి క్రేజ్ ఉంటుంది. అందుకే ఈ చిత్రం ధనుశ్ కెప్టెన్ మిల్లర్‌కు పోటీగా అక్కడ విడుదలై మంచి హిట్ టాక్‌ను తెచ్చుకుంది. అలా ఈ సైన్స్ ఫిక్షన్ మూవీకి దాదాపు రూ. 96 కోట్లకుపైగా కలెక్షన్స్ వచ్చాయి. 2024లో కోలీవుడ్‌లో అత్యధిక వసూళ్లను దక్కించుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

అయితే ఈ సినిమాకు తెలుగులో మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ చిత్రాన్ని చూడాలని చాలా మంది ఆశించారు. దీంతో సంక్రాంతి పండగ అయిపోయిన రెండు వారాలకు విడుదల చేయాలని మేకర్స్ డెసిషన్ తీసుకున్నారు. ప్రమోషన్స్ కూడా చేశారు. ఇందులో శివ కార్తికేయన్ కూడా పాల్గొని సందడి చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది కుదరలేదు.
వీఎఫ్ఎక్స్ వల్ల తెలుగు వెర్షన్ రిలీజ్ పోస్ట్ పోన్ అయిందని ఆ మధ్య ప్రచారం కూడా సాగింది. దీంతో ఈ సినిమాను ఓటీటీలోనైనా చూడాలని చాలా మంది ఆశపడ్డారు. అయినా డబ్బింగ్ పనులు పూర్తైనప్పటికీ కూడా ఓటీటీ రిలీజ్‌కు నోచుకోలేదు. కేవలం తమిళ వెర్షన్లోనే ఇది అందుబాటులోకి వచ్చింది. అయితే ఎట్టకేలకు ఇంత కాలానికి ఇప్పుడు ఓటీటీలో తెలుగు వెర్షన్ రిలీజ్‌కు సిద్ధమైందీ చిత్రం. దీని ఓటీటీ రైట్స్ సన్ నెక్స్ట్ దక్కించుకుంది. ఇప్పుడీ చిత్రాన్ని ఏప్రిల్ 19న ఓటీటీలో స్ట్రీమింగ్కు సిద్ధం చేయనున్నట్లు సమాచారం అందింది.

ఈ చిత్రంలో నాజూకు భామ రకుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా నటించింది. ఎలియన్ పాత్రకు హీరో సిద్ధార్థ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. హీరో శివకార్తికేయన్‌తో పాటు సిద్ధార్థ్ ఈ చిత్రానికి రెమ్యునరేషన్ తీసుకోలేదని అప్పట్లో అన్నారు. ఇందులో నిజమెంతో తెలీదు. ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు. ఈ మూవీ షూటింగ్ దాదాపు ఎనిమిదేళ్ల పాటు సాగిందట. 2016లో చిత్రాన్ని ప్రకటించగా అన్నీ అడ్డంకులను దాటి 2024లో రిలీజైంది.
ఇకపోతే హీరో శివ కార్తికేయన్ ప్రస్తుతం అమరన్ పేరుతో ఓ బయోపిక్ చిత్రాన్ని చేస్తున్నారు. ఇండియన్ ఆర్మీ అధికారి మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఇది తెరకెక్కుతోంది. సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. రాజ్‌కుమార్ పెరియాసామి దర్శకత్వం వహిస్తున్నారు. మరో సీనియర్ దర్శకుడు మురుగదాస్‌తోనూ శివకార్తికేయన్ ఓ సినిమా చేయనున్నారు.


Click it and Unblock the Notifications











