OTTలోకి బిగ్ బాస్ కంటెస్టెంట్ కొత్త వెబ్ సిరీస్... స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ అంటే?

ప్రతివారం ఓటీటీ కొత్త సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఒకప్పటి స్టార్ హీరో హీరోయిన్లు... సెకండ్ ఇన్సింగ్స్ ను ఓటీటీ వేదికగా మొదలుపెడుతున్నారు. సీరియర్ హీరోలు, హీరోయిన్లు.. ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇక ఒకప్పుడు వరుసగా సినిమాల్లో నటించిన హీరో శివాజీ. ఈయన ఇప్పుడు బిగ్ బాస్ షోలో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. మరి ఈయన కొత్త వెబ్ సిరీస్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఒకప్పుడు సినిమాల్లో హీరోగా అలరించిన శివాజీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన కామెడీ మూవీస్ తో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఇక లవ్ స్టోరీస్ సినిమాలతో కూడా బాగా దగ్గరయిన ఈ హీరో.. సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. ఇక రాజకీయాల్లో బిజీ అయిన ఈ హీరో.. ఇటీవల బిగ్ బాస్ కంటెస్టెంట్ గా సీజన్ 7లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు. ఇక బిగ్ బాస్ ఇంట్లో తనదైన శైలిలో శివాజీ గేమ్ ను ఆడుతున్నాడు.

Bigg Boss Contestant Sivaji and Vasuki anand 90s Web Series Going To Streaming on Etv Win From Diwali Festival

ఇక బిగ్ బాస్ ఇంట్లో అందరికీ పెద్దన్నగా శివాజీ గైడ్ చేస్తూ.. మైండ్ గేమ్ ఆడుతున్నాడు. వయసులో పెద్దవాడు అయినప్పటికీ.. ఇంట్లో వాళ్లతో అన్ని గేమ్స్ లో పాల్గొంటున్నాడు. ఇక ఇటీవల హెల్త్ ఇష్యూస్ వల్ల సైలెంట్ అయినా శివాజీ... ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ కు గైడెన్స్ ఇస్తూ గేమ్ ఆడుతున్నాడు. ఇక ఈ హీరో ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఓటీటీ వేదికగా ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు సిద్ధం అవుతున్నాడు.

శివాజీ హీరోగా.. నైంటీస్ అనే వెబ్ సిరీస్ తెరెకక్కుతోంది. ఇక ఈ వెబ్ సిరీస్ కు ఆదిత్య హ‌స‌న్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సిరీస్ లో పవన్ కల్యాణ్ తొలిప్రేమ సినిమాలో నటించిన వాసుకీ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ భామ ఆ సినిమాలో పవన్ చెల్లెలిగా నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు నైంటీస్ వెబ్ సిరీస్ లో శివాజీ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవల ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. దీనికి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది.

Bigg Boss Contestant Sivaji and Vasuki anand 90s Web Series Going To Streaming on Etv Win From Diwali Festival

మిడిల్ క్లాక్స్ బయోపిక్ అనేది నైంటిస్ వెబ్ సిరీస్ క్యాప్షన్. ఈ సీరిస్ కు ఆదిత్య హ‌స‌న్ డైరెక్టర్ గా వ్యవహారిస్తున్నారు. ఇక ఈ వాసంతిక మచ్చ, మౌళి, స్నేహల్ కామత్, రోహన్ రాయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సురేష్ బొబ్బిలి ఈ సీరిస్ కు మ్యూజిక్ అందిస్తున్నారు. అజీమ్‌ మొహమ్మద్‌ కెమెరామెన్‌గా, గాంధీ నడికుడియార్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌ గా పని చేశారు. శ్రీధర్‌ సోంపల్లి ఎడిటింగ్‌ బాధ్యతలు నిర్వర్తించగా... షర్వీన్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ గా పనిచేశారు.

ఇక ఈ నైంటీస్ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ వేదికగా రిలీజ్ కానుంది. ఇటీవల ఈటీవీ విన్ కొత్త కొత్త సినిమాలను, వెబ్ సీరిస్లను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తుంది. ఇక ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు అందులో భాగంగా ఈ వెబ్ సీరిస్ రిలీజ్ చేసేందుకు సిద్ధం అయింది. ఈటీవీ విన్‌ లో నైంటీస్ వెబ్ సిరీస్ నవంబర్‌ రెండో వారంలో స్ట్రీమింగ్‌కు అందుబాటులో రానుందని తెలుస్తోంది. దీపావళి కానుకగా ఈ సీరిస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. మీరు కనుక ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చూడాలనుకుంటే... పండక్కి ఓటీటీలో ఈ సిరీస్ ను ఇంట్లోనే కూర్చుని చూసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X