Ayalaan OTT Release: తెలుగులో విడుదల కాకముందే ఓటీటీలోకి అయలాన్.. ఎప్పటి నుంచంటే?

శివకార్తికేయన్ హీరోగా వచ్చిన తాజా చిత్రం అయలాన్ గురించి అందరికీ తెలిసిందే. అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన విడుదల అయిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. తమిళంలో విడుదల అయిన ఈ సినిమాను తెలుగులో కూడా అప్పుడే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ థియేటర్లు దొరక్క, పోటీ ఎక్కువగా ఉండడంతో ఈ సినిమా తెలుగు వర్షన్ ను వాయిదా వేశారు. అయితే ఇప్పటికీ తెలుగులో రిలీజ్ కాని ఈ చిత్రం నేరుగా ఓటీటీలోకి రాబోతుంది. ఈ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

శివకార్తికేయన్ హీరోగా వచ్చిన ఈ చిత్రం... తమిళనాడులో దాదాపు 100 కోట్ల రూపాయలు వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే సంక్రాంతికి తెలుగు రాని ఈ చిత్రాన్ని జనవరి 26వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా విడుదల చేయాలని ప్లాన్ కూడా చేశారు. అందుకోసం ముందుగానే అడ్వాన్స్ టికెట్లను కూడా అందుబాటులో పెట్టారు. కానీ పలు సమస్యల కారణంగా షోలను రద్దు చేశారు. అడ్వాన్స్ గా టికెట్లు బుక్ చేసుకున్న వారికి డబ్బులు కూడా తిరిగిచ్చేశారు.

Sivakarthikeyan Ayalaan Movie OTT Release Date Fixed Check Details

ఇక ఆ తర్వాత ఈ సినిమా తెలుగులో ఎప్పుడు విడుదల అవుతుందని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ అలాంటి వారికి చిత్ర బృందం షాక్ ఇచ్చింది. కేజేఆర్ స్టూడియోస్, ఫాంటమ్ ఎఫ్ఎక్స్ స్టూడియోస్, ఆది బ్రహ్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై కోటపాడి జె.రాజేష్ నిర్మించిన ఈ సినిమాను తెలుగులో విడుదల కాకముందే ఓటీటీలోకి తీసుకు వస్తున్నట్లు చెప్పారు. ఆర్ రవి కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో.. శివ కార్తీకేయన్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించగా.. శరద్ కేల్కర్, ఇషా కొప్పికర్ ప్రధాన పాత్రల్లో కనిపించారు.

అంతా అనుకున్నట్లుగానే తెలుగులో విడుదల కాకముందే నేరుగా ఓటీటీలోకి రాబోతుందీ అయలాన్ సినిమా. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన సన్ నెక్స్ట్ సంస్థ.. ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకే దక్కించుకుంది. అయితే తాజాగా ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9వ తేదీన విడుదల చేస్తామని ఎక్స్ వేధికగా ప్రకటించారు. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంటుందని వివరించారు. ఇంకా ఎందుకు ఆలస్యం.. ఈ సినిమా కోసం వేచి చూస్తున్న వారంతా ఫిబ్రవరి 9వ ఫ్యామిలీతో కలిసి ఇంట్లోనే కూర్చుని చూసేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X