Ayalaan OTT Release: శివకార్తికేయన్ అయలాన్ సినిమా నేరుగా OTTలోకేనా.. అసలు విషయం ఏంటంటే?
శివకార్తికేయన్ హీరోగా వచ్చిన తాజా సినిమా అయలాన్ గురించి అందరికీ తెలిసిందే. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన విడుదల అయిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. తమిళనాడులో దాదాపు 100 కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ చిత్రం తెలుగులో జనవరి 26వ తేదీన విడుదల కావాల్సి ఉంది. కానీ పలు సమస్యల కారణంగా షోలను రద్దు చేశారు. అడ్వాన్స్ గా టికెట్లు బుక్ చేసుకున్న వారికి డబ్బులు కూడా తిరిగిచ్చేశారు. అయితే ఈ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేయబోతున్నారని టాక్ నడుస్తోంది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కేజేఆర్ స్టూడియోస్, ఫాంటమ్ ఎఫ్ఎక్స్ స్టూడియోస్, ఆది బ్రహ్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై కోటపాడి జె.రాజేష్ నిర్మించిన ఈ సినిమాకు ఆర్. రవికుమార్ దర్శకత్వం వహించాడు. శివ కార్తీకేయన్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించగా.. శరద్ కేల్కర్, ఇషా కొప్పికర్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. అయితే ఈ సినిమాను జనవరి 12వ తేదీన తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల చేశారు. తెలుగులో మాత్రం థియేటర్లు దొరక్క వాయిదా వేశారు. కానీ ఇప్పుడు మరోసారి వాయిదా పడగా.. ఈ సినిమా నేరుగా ఓటీటీలోనే విడుదల అవుతుందని ప్రచారం సాగుతోంది.

ముఖ్యంగా తెలుగులో థియేటర్లలో విడుదల అయ్యే తేదీ కన్ఫార్మ్ కాకముందే.. త్వరలోనే అయలాన్ ఓటీటీ వేధికగా రాబోతుందని సన్ నెట్ వర్క్ సంస్థ ఎక్స్ వేధికగా ప్రకటించింది. విడుదల తేదీ చెప్పకపోయినప్పటికీ.. ఫిబ్రవరి 16వ తేదీన నుంచి ఈ సినిమా ఓటీటీ వేధికగా స్ట్రీమింగ్ అవుతుందని సమాచారం. ఇంతకంటే ముందే వచ్చినా కూడా ఏమాత్రం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరోవైపు ఈ సినిమా తెలుగు రిలీజ్ డేట్ కూడా త్వరలోనే ఉండబోతుందని తెలుస్తోంది.
ప్రొడ్యూసర్ మహేశ్వర్ రెడ్డి అయలాన్ సినిమాను తెలుగులో చాలా గ్రాండ్ గా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఫిబ్రవరి 2వ తేదీన రిలీజ్ చేస్తే బాగుంటుందని ఆలోచన చేస్తున్నారట. ఇదే కనుక నిజం అయితే ఈ సినిమా విడుదల అయిన వారం, పది రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తుంది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.


Click it and Unblock the Notifications











