OTT లోకి మరో బ్లాక్ బస్టర్ చిత్రం.. 33 కోట్లకు కొనుగోలు.. అందులో ఇదే రికార్డ్

తమిళ హీరోలకు తెలుగులోను మంచి క్రేజ్ ఉంటుంది. సూర్య, విక్రమ్ నుంచి విజయ్ ఆంటోని, శివ కార్తికేయన్ వరకు అనేకమందిని ఆదరించారు టాలీవుడ్ ఆడియెన్స్. ఇక తన నటనతో, కామెడీ టైమింగ్ తో ఎంటర్టైన్ చేసే శివ కార్తికేయన్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. రెమోతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శివ కార్తికేయన్ ఇటీవల నేరుగా తెలుగు సినిమా కూడా చేశాడు. తాజాగా ఆయన నటించిన చిత్రం మహావీరుడు (Mahaveerudu Movie). ఇటీవల విడుదలైన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ఆసక్తిగా మారింది.

రెమో, వరుణ్ డాక్టర్, కాలేజీ డాన్, ప్రిన్స్ వంటి చిత్రాలతో తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్. అతను తాజాగా నటించిన సినిమా మహావీరుడు తమిళంలో 'మావీరన్' (Maaveeran). అరుణ్ విశ్వ నిర్మించిన ఈ చిత్రాన్ని మడోన్ అశ్విన్ దర్శకత్వం వహించారు. భరత్ శంకర్ సంగీతం అందించారు. ఇందులో స్టార్ డైరెక్టర్ శంకర్ కుమార్తె అదితి శంకర్ హీరోయిన్ గా శివ కార్తికేయన్ కు జోడీగా నటించింది. సరిత, యోగిబాబు, మిస్కిన్ కీలక పాత్రలు పోషించారు.

Sivakarthikeyan Mahaveerudu Maaveeran Movie OTT Rights And Streaming Date

యాక్షన్, కామెడీ, ఫాంటసీ అంశాలతో తెరకెక్కిన మహావీరుడు సినిమా జూలై 14న విడుదలైంది. అయితే తమిళంలో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్న మహావీరుడు సినిమాకు తెలుగులో మాత్రం కలెక్షన్స్ అంతగా వసూలు కావట్లేదు. ఈ సినిమా తెలుగు వెర్షన్ కోసం శివ కార్తికేయన్ కు మాస్ మహారాజా రవితే డబ్బింగ్ చెప్పడం విశేషం. సునీల్ సైతం కీలక పాత్ర పోషించిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్, విడుదల తేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.

మహావీరుడు చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో రూ. 33 కోట్లకు కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు శివ కార్తికేయన్ నటించిన సినిమాల్లో ఈ మూవీనే అత్యంత ధరకు అమ్ముడుపోయింది. ఇది శివ కార్తికేయన్ సినీ కెరీర్ లో రికార్డ్. ఇక ఈ సినిమాను ఆగస్టు నెలాఖరు నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X