Skanda OTT: స్కంద ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎంతో మంది యంగ్ హీరోలు సత్తా చాటుతున్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే సినిమా సినిమాకూ తమ స్థాయిని పెంచుకుంటున్నారు. అలాంటి వారిలో ఎనర్జిటిక్ స్టార్ ఉస్తాద్ రామ్ పోతినేని ఒకడు. టీనేజ్‌లో ఎన్నో హిట్లను అందుకున్న అతడు.. చాలా కాలం పాటు సక్సెస్ లేక ఇబ్బందులు పడ్డాడు. 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత ఫుల్ ఫామ్‌లోకి వచ్చేసిన రామ్.. ఇప్పుడు మళ్లీ వరుస షాక్‌లను చవి చూశాడు. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో 'స్కంద' అనే మూవీని చేశాడు.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన సినిమానే 'స్కంద'. ఈ చిత్రానికి ప్రీమియర్ షోల నుంచే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ భారీ రెస్పాన్స్ రావడంతో ఓపెనింగ్స్ కూడా ఓ రేంజ్‌లో లభించాయి. కానీ, ఆ తర్వాత నుంచే ఈ సినిమాకు కష్టాలు ప్రారంభం అయ్యాయి. రెండో రోజు నుంచే డౌన్ అవుతూ వచ్చిన రామ్ సినిమా.. వారంలోనే చాలా థియేటర్లను కోల్పోయింది. ఫలితంగా ఫుల్ రన్‌ను నష్టాలతోనే ముగించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా 'స్కంద' మూవీ ఓటీటీ డేట్‌పై న్యూస్ బయటకు వచ్చింది.

ఊరమాస్ కాంబినేషన్‌లో రూపొందిన 'స్కంద' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఓటీటీ దిగ్గజం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను కళ్లు చెదిరే ధరకు కొనుగోలు చేసింది.

బిజినెస్ డీల్ జరుపుకున్న సమయంలోనే 'స్కంద' మూవీని థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాతనే ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని తెలిసింది. అంటే సెప్టెంబర్ 28న విడుదలైన 'స్కంద' మూవీ అక్టోబర్ చివరి వారంలో స్ట్రీమింగ్‌కు వస్తుందని టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను అక్టోబర్ 27న దీన్ని స్ట్రీమింగ్‌కు తీసుకు వస్తున్నారని తాజాగా ఓ న్యూస్ లీకైంది.

ఇదిలా ఉండగా.. బోయపాటి శ్రీను - రామ్ పోతినేని కాంబోలో రూపొందిన 'స్కంద' సినిమాను శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా.. సయీ మంజ్రేకర్ కీలక పాత్రలో నటించింది. అలాగే, శ్రీకాంత్, ఇంద్రజ తదితరులు నటించారు. ఈ మూవీకి థమన్ సంగీతాన్ని అందించాడు.


Click it and Unblock the Notifications











