Skanda OTT: ఆ ఓటీటీలోకి వచ్చేసిన స్కంద.. థియేటర్లలో మిస్సైన ఆ సీన్స్ కూడా!
టాలీవుడ్‌లో ఇప్పుడు ఎంతో మంది టాలెంట్ ఉన్న యంగ్ హీరోలు సత్తా చాటుతున్నారు. అందులో కొందరు మాత్రం తమ రేంజ్‌ను పెంచుకునే సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నారు. అలాంటి వారిలో ఉస్తాద్ రామ్ పోతినేని ఒకడు. సినిమా సినిమాకూ తన స్థాయిని పెంచుకుంటోన్న అతడు.. గత చిత్రంతో నిరాశనే ఎదుర్కొన్నాడు. దీంతో ఈ సారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలన్న పట్టుదలతో 'స్కంద' అనే సినిమాను చేశాడు.
రామ్ పోతినేని హీరోగా.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన చిత్రమే 'స్కంద'. దీనికి ప్రీమియర్ షోల నుంచే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ భారీ రెస్పాన్స్ రావడంతో ఓపెనింగ్స్ భారీగా లభించాయి. కానీ, ఆ తర్వాత నుంచే వసూళ్లు డౌన్ అవుతూ వచ్చాయి. దీంతో ఇది వారంలోనే చాలా థియేటర్లను కోల్పోయింది. ఫలితంగా రన్‌ను నష్టాలతోనే ముగించింది.

ఊరమాస్ యాక్షన్‌తో రూపొందిన 'స్కంద' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డ విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఓటీటీ దిగ్గజం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను రామ్ కెరీర్‌లోనే అత్యధిక ధరకు కొనుగోలు చేసింది.
ఇక, 'స్కంద' మూవీని థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని తెలిసింది. అంటే సెప్టెంబర్ 28న విడుదలైన 'స్కంద' మూవీ అక్టోబర్ చివరి వారంలో స్ట్రీమింగ్‌కు వస్తుందని టాక్ వచ్చింది. కానీ, ఊహించని విధంగా ఈ సినిమాను నవంబర్ 2వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకు వచ్చారు.

ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'స్కంద' మూవీని నేటి అర్ధరాత్రి నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇందులో థియేటర్లలో చూపించిన కంటెంట్ కంటే కాస్త ఎక్కువ నిడివిని పెంచినట్లు తెలిసింది. అంటే.. సెన్సార్ బోర్డు కట్ చేసిన కొన్ని సన్నివేశాలు, డైలాగులను కూడా యాడ్ చేసి తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను - ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబోలో రూపొందిన 'స్కంద' సినిమాను శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా.. సయీ మంజ్రేకర్ కీలక పాత్రలో నటించింది. అలాగే, శ్రీకాంత్, ఇంద్రజ తదితరులు నటించారు. ఈ మూవీకి థమన్ సంగీతాన్ని అందించాడు.


Click it and Unblock the Notifications











