Dahaad Review: నిరుపేద యువతులే టార్గెట్.. సైకోగా తమన్నా ప్రియుడు విజయ్.. దహాద్ రివ్యూ

రేటింగ్: 2.75/5

టైటిల్: దహాద్ (Dahaad)
నటీనటులు: సోనాక్షి సిన్హా, విజయ్ వర్మ, గుల్షన్ దేవయ్య, సోహమ్ షా, జోవా మొరానీ తదితరులు
సినిమాటోగ్రఫీ: తాన్య సతమ్, యోగి సంకోత్రా
ఎడిటింగ్: ఆనంద్ సుబాయా
సంగీతం: గౌరవ్ రైనా, తరానా మార్వా
క్రియేటర్స్: రీమా కగ్టి, జోయా అక్తర్
దర్శకత్వం: రీమా కగ్టి, రుచికా ఒబెరాయ్
విడుదల తేది: మే 12, 2023
ఓటీటీ వేదిక: అమెజాన్ ప్రైమ్ వీడియో
ఎపిసోడ్స్: 8, నిడివి: 50 నిమిషాలు

సినిమా క్వాలిటీ తరహాలో వెబ్ సిరీసులను అందిస్తుంటుంది ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో. మీర్జాపూర్, ది ఫ్యామిలీ మ్యాన్, బ్రీత్, తాండవ్, పాతాల్ లోక్ వంటి మంచి సిరీసుల తరహాలో తాజాగా వచ్చిందే దాహాద్ (Dahaad). దబాంగ్ మూవీతో హిందీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సోనాక్షి సిన్హా.. రజనీకాంత్ లింగా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ఇక తమన్నా రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ గా విజయ్ వర్మ బాగా పాపులర్ అయ్యాడు. వీరిద్దరు ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన దహాద్ వెబ్ సిరీస్ (Dahaad Web Series Telugu Review) ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథ:
రాజస్థాన్ లోని మండవా పోలీస్ట్ స్టేషన్ కు ఇన్ ఛార్జ్ గా దేవి లాల్ సింగ్ (గుల్షన్ దేవయ్య) ఉంటాడు. ఆయన ఆధ్వర్యంలో ఎస్సై అంజలి భాటి (సోనాక్షి సిన్హా), కైలాష్ పర్గీ (సోహమ్ షా) కేసులు సాల్వ్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే పోలీస్ పరిధిలో నివసించే కృష్ణ చందాల్ అనే యువతి ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నట్లు ఇంట్లో లేఖ రాసి వెళ్లిపోతుంది. నెలలు గడుస్తున్న ఆమె నుంచి ఫోన్ రాకపోవడం, కాల్ చేస్తే స్విచ్ఛాప్ రావడంతో ఆమె సోదరుడు పోలీసులను ఆశ్రయిస్తాడు.

Dahaad Review

ట్విస్టులు:

ఈ కేస్ టేకప్ చేసిన ఎస్సై అంజలికి 27 మంది అమ్మాయిలు పెళ్లి కోసమే వెళ్లిపోయి సైనెడ్ తీసుకుని సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తుంది. అలా 27 మంది అమ్మాయిలు పెళ్లి చేసుకుంటున్నట్లు లేఖ రాసిపెట్టి వెళ్లడం ఏంటీ? వాళ్లవి నిజంగా ఆత్మహత్యలా? లేక హత్యలా? వాటి వెనుక ఉన్నది ఎవరు? ఈ ఇన్వెస్టిగేషన్ ఎలా చేసింది? ఈ విచారణలో అంజలి ఎదుర్కున్న ఇబ్బందులు, అనుభవాలు ఏంటీ? ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన అంజలికి ఆనంద్ స్వర్ణాంకర్ (విజయ్ వర్మ)పై అనుమానం ఎలా వచ్చింది? అతడే హంతకుడని ఎలా నిరూపించింది? అనే ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే దహాద్ వెబ్ సిరీస్ చూడాల్సిందే.

విశ్లేషణ:

దహాద్ వెబ్ సిరీస్ అనేది ఒక సైకో థ్రిల్లర్. సాధారణంగా ఈ సైకో థ్రిల్లర్ సినిమాలు లేదా సిరీసులు రెండు రకాలుగా ఉంటాయి. అందులో ఒకటి ఈ హత్యలు చేస్తుందో ఎవరో చూపించకుండా ఉండటం. హంతకుడు ఎవరో ముందే చూపించి.. అతన్ని పోలీసులు పట్టుకునేందుకు చేసే ఇన్వెస్టిగేషన్, దాని నుంచి తప్పించుకునేందుకు ఆ సైకో చేసే ప్రయత్నాలు మరొకటి. దాహాద్ సిరీస్ రెండోదానికి చెందినది. ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ను, సైకో తప్పించుకోవడం వంటి అంశాలతో చాలా ఆసక్తికరంగా సిరీస్ ను తెరకెక్కించారు.

Dahaad Review

తప్పించుకునే ప్రయత్నాలు:

దహాద్ లో హంతకుడు పోలీసులుకు చిక్కుతాడా.. అసలు అతను అలా ఎందుకు చేస్తున్నాడు పెళ్లి పేరుతో తీసుకెళ్లిన యువతులను సైకో ఏం చేశాడు అనే విషయాలు మైండ్ లో రన్ అయ్యేలా చిత్రీకరించారు. ఒక్కో చిక్కుముడి విప్పుతూ వెళ్లే పోలీసుల ఇన్వెస్టిగేషన్ బాగుంటుంది. హంతకుడు సమాజం దృష్టిలో మంచివాడుగా కనిపిస్తూ పోలీసుల ముందే తిరుగుతున్న అతనిపై అనుమానిస్తారు కానీ ఏం చేయలేకపోతారు. అతన్ని ఆధారాలతో పట్టుకునేందుకు పోలీసులు చేసే ప్రయత్నాలు, వారి నుంచి హంతకుడు తప్పించుకునేందుకు వేసే ఎత్తుగడలు చాలా బాగా ఆకట్టుకున్న కథనం మాత్రం చాలా స్లోగా సాగుతుంది.

సైకోకు ధీటుగా:

నిజానికి కథ ఏంటనేది ఫస్ట్ రెండు ఎపిసోడ్స్ లోనే చెప్పేశారు. అయితే పెళ్లి చేసుకుంటానని చెప్పి తీసుకెళ్లిన సైకో వాళ్లను ఏం చేశాడనేదే ట్విస్ట్. కానీ హంతకుడు మనకు ముందే తెలియడంతో కాస్తా థ్రిల్ మిస్ అవుతాం. తెలియని అమ్మాయిలను పరిచయం చేసుకుని, వారిని పెళ్లికి ఒప్పించడం, ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేలా చేయడం, తర్వాత వాళ్లంతట వాళ్లే సైనెడ్ తీసుకునేలా చేసే సైకో పాత్రను బాగా ఎస్టాబ్లిష్ చేశారు. దానికి ధీటుగా డేరింగ్ అండ్ డ్యాషింగ్ పోలీసుగా అంజలి పాత్ర ఉండటం ప్లస్ అనే చెప్పవచ్చు.

Dahaad Review

సమాజంలోని పరిస్థితులు:

కేసు విచారణ సాగుతున్న క్రమంలోనే మరోవైపు ధనిక, పేద వర్గాల మధ్య తారతమ్యతను చర్చించారు. చనిపోయిన 27 మంది యువతులు దళిత, నిరుపేద కుటుంబాలకు చెందిన వారు కావడం వల్లే కేసు ఇలా స్లోగా సాగుతోందని, అదే అగ్ర కులాల్లోని అమ్మాయి తప్పిపోతే ఆందోళనలు ఆకాశాన్నంటేవి అని ఎస్సై అంజలి చెప్పే డైలాగ్ తో నేటి సమాజంలోని పరిస్థితులను చూపించారు. అంతేకాకుండా ఒక పోలీసు అధికారిణిపై కూడా పోలీస్ స్టేషన్ లో, అగ్ర వర్ణాల ఇంట్లోకి వచ్చి ఇన్వెస్టిగేషన్ చేయకుండా అడ్డుపడటం వంటివి ప్రశ్నించేలా చేస్తాయి.

27 మంది అమ్మాయిలు:

సిరీసులో చాలా పాత్రలు ఉండటం, వారికి సంబంధించిన స్టోరీలు వంటి ఉపకథల వల్ల చాలా ల్యాగ్ అనిపిస్తుంది. కానీ ఆ పాత్రలతో చిన్న కులాల వారి మధ్య అగ్ర కులాలు చూపే వివక్షత, కూతురుకి పెళ్లి చేస్తే భారం తగ్గిపోతుందని భావించే మధ్యతరగతి తల్లుల ఆవేదనను చూపించి సందేశం ఇచ్చారు. ఎందుకంటే ఇందులో ప్రేమించిన వాడితో 27 మంది అమ్మాయిలు వెళ్లిపోవడానికి కారణం వారి తల్లులు ఏర్పర్చిన పరిస్థితులే అని అంతర్గతంగా వివరించారు.

క్లైమాక్స్ అలా:

ఇదొక క్రైమ్ థ్రిల్లర్. అయినప్పటికీ ఒక అపరిచితుడుని ప్రేమ పేరుతో అమ్మాయిలు నమ్మేందుకు ఏర్పడిన పరిస్థితులును తెలియజేసే సన్నివేశాలతో నిడివి ఎక్కువైంది. సో కులాలు, పేదరికం, కట్నం, వివక్షత అమ్మాయిలకు ఎలాంటి పరిస్థితి తీసుకొస్తుందే చెప్పాలనే దర్శకనిర్మాతలు ప్రయత్నించారని అనిపిస్తుంది. ఇక చివరి ఎపిసోడ్ ను చాలా ఫాస్ట్ గా చుట్టేస్తారు. హంతకుడిని పట్టుకుంటారా లేదా అన్నది ఉత్కంఠంగా అనిపించినా క్లైమాక్స్ మాత్రం జస్ట్ ఓకే అనిపిస్తుంది అంతే.

Dahaad Review

ఎవరెలా చేశారంటే?:

అంజలి భాటిగా సోనాక్షి సిన్హా అదరగొట్టింది. స్వతంత్ర భావాలు కలిగి, డేరింగ్ అండ్ డ్యాషింగ్ ఉన్న పోలీస్ ఆఫీసర్ సూపర్బ్ పెర్ఫామెన్స్ ఇచ్చింది. ఇక సిరీసులో వచ్చే తెలంగాణ యాస ముఖ్యంగా సోనాక్షి చేసిన ఎస్సై అంజలి పాత్రకు ఆ వాయిస్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. సినిమాల్లో కూడా వాడని తెలంగాణ పదాలను ఇందులో వాడారు. సైకోగా, హిందీ లెక్చరర్ గా విజయ్ వర్మ మెప్పించాడు. సోనాక్షి, విజయ్ వర్మ నటన సిరీసుకు చాలా ప్లస్ అయింది.

ఫైనల్ గా చెప్పాలంటే?:

గుల్షన్ దేవయ్యా, సోహమ్ షా మిగతా పాత్రలన్నీ పరిధి మేర ఆకట్టుకున్నాయి. బీజీఎమ్ బాగుంది. టైటిల్స్ లో వచ్చే సంగీతం ఓ విధమైన ఫీల్ ఇస్తుంది. సాంకేతిక నిర్మాణ విలువలు అన్ని చక్కగా ఉన్నాయి. ఇక ఫైనల్ గా చెప్పాలంటే కథనం రేసీగా సాగదు కానీ ఇన్వెస్టిగేషన్ ఆసక్తికరంగా ఉంటుంది. కుటుంబంతో కాకుండా వీకెండ్ లో చూసేందుకు దహాద్ వెబ్ సిరీస్ ఒక మంచి ఆప్షన్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X