సోనూసూద్ డైరెక్ట్ చేసిన మూవీ, సైలెంట్‌గా ఓటీటీలోకి ఫతేహ్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?

ఇటీవలి కాలంలో చిన్నా పెద్దా నటీనటులు మెగా ఫోన్ పట్టేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న తాము దర్శకత్వం చేయకుంటే బాగోదు అనుకుంటున్నారో లేక తాము కూడా డైరెక్టర్ అనిపించుకోవాలని తాపత్రయపడుతున్నారో కానీ ఈ కల్చర్ పెరుగుతోంది. టాలీవుడ్ టూ బాలీవుడ్ అందరు నటుల్లోనూ ఇదే కనిపిస్తోంది. తాజాగా ప్రతినాయక పాత్రలతో స్టార్ డమ్ సంపాదించి విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సోనూసూద్ కూడా మెగా ఫోన్ పట్టుకున్నాడు. అదే ఫతేహ్.

శక్తి సాగర్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ బ్యానర్‌పై సోనూసూద్ సతీమణి సోనాలి సూద్, ఉమేశ్ కేఆర్ బన్సాల్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి ఏకంగా ఐదుగురు సంగీత దర్శకులు పనిచేయడం విశేషం జాన్ స్టీవర్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించగా.. పాటలను యోయో హనీ సింగ్, షబ్బీర్ అహ్మదర్, హరూన్ - గావిన్, వివేక్ హరిహరన్‌లు స్వర కల్పన చేశారు. ఫతేహ్ లో సోనూసూద్ సరసన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్‌‌గా నటించగా విజయ్ రాజ్, నసిరుద్దీన్ షా, నాగినీడు, దివ్వెందు భట్టాచార్య, రవి కిషన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.

Sonusood jacqueline fernandez s Fateh Movie now streaming on Jio Hotstar

పంజాబీల లోహ్రి, దక్షిణాదిన సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకుని ఈ ఏడాది జనవరి 10న ఫతేహ్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. టీజర్, ట్రైలర్, ఫస్ట్ లుక్ పోస్టర్లకు తోడు సోనూసూద్ దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై సినీ పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు ఫతేకు రచయిత కూడా సోనూనే కావడం విశేషం. సైబర్ క్రైమ్, సస్పెన్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే శెభాష్ అనిపించుకున్నారు సోనూసూద్.

పంజాబ్‌లోని ఓ గ్రామంలో పాల వ్యాపారం చేసుకుని జీవించే ఫతే సింగ్ వద్ద పనిచేసే ఓ వ్యక్తి లోన్ యాప్ ప్రతినిధుల వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుంటాడు. ఇదే సమయంలో తన ఇంట్లో నివసించే మహిళను ఓ సైబర్ క్రైమ్ అపహరిస్తుంది. ఆమెను ఎవరు కిడ్నాప్ చేశారు? చనిపోయిన పనివాడికి సదరు సైబర్ క్రైమ్ ముఠాకు సంబంధం ఉందా? ఆమెను హీరో ఎలా కాపాడాడు? ఈ సమయంలో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు అన్నదే ఫతేహ్ సినిమా కథ.

Sonusood jacqueline fernandez s Fateh Movie now streaming on Jio Hotstar

ఇక ఫతేహ్ కలెక్షన్ల విషయానికి వస్తే.. తొలిరోజే 2.4 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా.. ఫస్ట్ వీక్‌లో రూ.12 కోట్ల గ్రాస్ అందుకుంది. రెండో వారం నుంచి ఫతే వసూళ్లు దారుణంగా పడిపోయాయి. రోజుకు రూ.20 లక్షలు కూడా రాబట్టడం కష్టంగా మారింది. దాదాపు రూ.50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. తన లాంగ్ రన్‌లో ప్రపంచవ్యాప్తంగా రూ.30 కోట్ల వసూళ్లను మాత్రమే రాబట్టి భారీ నష్టాలను మిగిల్చింది.

ఫతేహ్ సినిమా ఓటీటీలో చూసేందుకు ఈ సెక్షన్ ఆడియన్స్ ఎదురుచూశారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. మార్చి 7వ తేదీన సడెన్‌గా జియో హాట్ స్టార్‌‌లో దర్శనమిచ్చింది. ప్రస్తుతం హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతున్న ఫతేహ్ సినిమాను తెలుగులో అందుబాటులోకి తీసుకురానున్నారు. మరి సోనూసూద్ మూవీ ఎలా ఉందో మీరూ ఓ లుక్కేయండి.

More from Filmibeat

Read more about: sonusood fateh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X