Free OTTs: నో సబ్ స్క్రిప్షన్.. ఈ ఓటీటీల్లో ఫ్రీగా మూవీస్ చూడొచ్చు.. మీరూ ట్రై చేస్తారా?
ఒకప్పుడు సినిమా అంటే థియేటర్లకు జనాలు పరిగెత్తే వారు. కానీ ఇప్పుడు అంతా అరచేతిలోకే వచ్చేసింది. మన చేతిలో ఉన్న ఫోన్ లోకి.. సినిమాలు విడుదలైన నెలలోపే వచ్చేస్తూ ఉండడంతో ఎక్కువగా అందరూ ఓటీటీలో సినిమాలు చూసేందుకే ఆసక్తి చూపిస్తున్నారు.
అయితే ప్రస్తుతానికి ఉన్న ఓటీటీలకు డబ్బులు చెల్లిస్తే మాత్రమే సినిమాలు లేదా వెబ్ సిరీస్ లాంటి కంటెంట్ చూసే అవకాశం కల్పిస్తోంది. అయితే డబ్బులు అవసరం లేకుండా కూడా ఫ్రీగా సినిమాలు, వెబ్ సిరీస్ లు చూసే అవకాశం కల్పించే కొన్ని ఓటీటీలు ఉన్నాయి. వాటి వివరాలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం.

సోనీలీవ్: ముందుగా సోనీ లీవ్ విషయానికి వస్తే సోనీ కంపెనీకి సంబంధించిన ఈ ఓటీటీ ఫ్లాట్ ఫాం ఇండియాలో ఇప్పుడు గట్టి ముద్ర వేసే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా కొన్ని వెబ్ సిరీస్ లను, సినిమాలను ఫ్రీగా చూసే అవకాశం కల్పిస్తోంది. కొత్తగా వచ్చిన వెబ్ సిరీస్, సినిమాలకు సబ్ స్క్రిప్షన్ అడుగుతోంది. కానీ కొన్ని సెలెక్టెడ్ సినిమాలు, వెబ్ సిరీస్ లు మాత్రం ఫ్రీగా చూసే అవకాశం కల్పిస్తోంది.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్: సాధారణంగా ఈ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ తీసుకుంటేనే సినిమాలు చూసే అవకాశం ఉంటుందని అందరూ అనుకుంటారు. కానీ ఇందులో కూడా కొన్ని సినిమాలు, షోలను ఫ్రీగా చూసే అవకాశం కల్పించారు. మీరు కనుక యాప్ లో లాగిన్ అయ్యి అబ్జర్వ్ చేస్తే కొన్ని బాలీవుడ్ సినిమాలతో పాటు తెలుగు సినిమాలను కూడా చూసే అవకాశం కల్పించారు.

జీ5: జీ మీడియాకు సంబంధించిన ఈ జీ ఫైవ్ యాప్ లో ఇప్పుడు మంచి కంటెంట్ అప్డేట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి దాదాపు చాలా వరకు వెబ్ సిరీస్ లు అన్నింటికీ మొదటి ఎపిసోడ్ ఫ్రీగా చూసే అవకాశం కల్పిస్తుండగా... కొన్ని సినిమాలను అలాగే మిగతా వెబ్ సిరీస్ లను పూర్తిగా చూసే అవకాశం కూడా కల్పిస్తున్నారు.
ఎంఎక్స్ ప్లేయర్: ఒకప్పుడు వీడియోలో స్ట్రీమ్ చేసేందుకు పనికొచ్చిన ఈ యాప్ ను ఇప్పుడు ఓటీటీగా లాంచ్ చేశారు. ఈ ఓటీటీలో హిందీ సినిమాలు, ఎంఎక్స్ ప్లేయర్ ఒరిజినల్ వెబ్ సిరీస్ లు కూడా ఫ్రీగా చూసే అవకాశం కల్పిస్తున్నారు. కానీ ఫ్రీగా కంటెంట్ చూడొచ్చు కాకపోతే మధ్యలో యూట్యూబ్ లాగా యాడ్స్ వస్తాయి.

అమెజాన్ మినీ టీవీ: అమెజాన్ వీడియోలు టీవీ ఓటీటీలో కూడా కంటెంట్ ను కొంతవరకు ఫ్రీగా చూసే అవకాశం ఉంది. అమెజాన్ రూపొందించిన ఒరిజినల్ వెబ్ సిరీస్ ల తో పాటు టీవీఎఫ్ రూపొందించిన వెబ్ సిరీస్ లో షార్ట్ వీడియోస్ కూడా ఉంటాయి. ఇలాంటివి చూస్తున్నప్పుడు మధ్యలో యాడ్స్ మాత్రం ఇబ్బంది పెడతాయి. కాకపోతే ఫ్రీగా కంటెంట్ చూస్తున్నప్పుడు ఒక్కోసారి యాడ్స్ చూడకరాకపోవడంలో పెద్ద విషయం ఏమీ లేదు కదా.


Click it and Unblock the Notifications











